స్వర్గమంతా ఆ భవనాల్లోనే ఉంది

Written By:

తాజ్ మహల్ ని ఎప్పుడైనా చూస్తే అందరికీ టక్కున దాన్ని నిర్మించిన షాజహాన్ గుర్తుకురావడం సహజం.అది తన ప్రియురాలి ప్రేమకు చిహ్నంగా నిర్మించినప్పటికీ ఆ ఆర్కిటెక్ చరిత్రలో ఓ సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. అత్యద్భుత కట్టడంగా ప్రపంచం చేత మన్ననలు పొందుతోంది.దాదాపు 22 సంవత్సరాల పాటు కష్టపడి పాలరాతితో ఆ అందాల భవనాన్నినిర్మించారు.అయితే ఆ అందాల భవనంతో పాటు ఇంకా మిరుమిట్లు గొలిపే భవనాలు మనదేశంలో చాలానే ఉన్నాయి. వాటిని బిజినెస్ పరంగా వాడుతున్నా కాని అవి సర్వాంగ సుందరంగా ప్రపంచానికే సవాల్ విసిరే విధంగా ఉన్నాయి. సో వాటిపై ఇప్పుడు ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more : గూగుల్‌కి పంచ్ పడింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇన్ఫోసిస్ మైసూర్

340 ఎకరాల్లో విస్తరించబడిన ఈ క్యాంపస్ లో అనేక కార్యాలయాలు ఉన్నాయి. అలాగే ఐటీకి సంబంధించిన హబ్ కూడా ఉంది. ఈ బిల్డింగ్ పార్లమెంటరీ భవనాన్ని పోలి ఉంటుంది. ఐటీ ఉద్యోగులకు ఇది స్వర్గధామం.అక్కడ సకల సదుపాయాలతో అత్యాధునిక హంగులతో జిమ్ ,రిసార్ట్ ,మల్టిప్లెక్స్ లు స్విమ్మింగ్ పూల్ తో ఊరిస్తూ ఉంటుంది. ఈ భవనం ఇప్పటికే గిన్నిస్ బుక్ లో చోటు కూడా సంపాదించింది

ఫిషరీ డిపార్ట్ మెంట్ భవనం హైదరాబాద్

ఫిష్ ఆకారంలో ఉన్న ఈ అత్యాధునిక భవనాన్ని 2012లో నిర్మించారు. 4 అంతస్థుల ఈ భవనం హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో ఉంది.
ఈ భవనంలోకి వెళ్లే దారి సిల్వర్ తో కూడి ఉంటుంది. ఈ భవనాన్ని మత్స్య భవన్ అని కూడా పిలుస్తారు.

సైబర్ టెక్చర్ ఎగ్ ముంబై

జేమ్స్ లా సైబర్ టెక్చర్ ముంబైలో ఉంది. దీని ఆర్కిటెక్ అంతా వింతగానూ కొత్తగానూ ఉంటుంది. విజువల్ ప్రాసెపెక్టివ్ కోసం నిర్మించారు. 4025 sq 17 అంతస్థులతో కూడి ఉంటుంది. పైన 14 అంతస్థులు కింద మూడు అంతస్థులతో కోడి గుడ్డు ఆకారంలో ఉంటుంది. ఇండియాలోని అన్ని భవనాల కన్నా ఈ భవనం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది.

టాటా కన్సల్టెన్సీ సర్వీస్ సిరూసేరి

70 ఎకరాల్లో విస్తరించబడి ఐటీ రంగానికి తలమానికంగా నిలుస్తోంది ఈ భవనం. ఆసియాలో అతి పెద్ద ఐటీ పార్క్ ఇదే. 6 అంతస్థులతో అంతా సీతాకోకచిలుక ఆకారంలో చూపరుల మతి పోగోడుతుంది. ఈ ఆపీసులో దాదాపు 25000 మంది ఉద్యోగులు ఉన్నారు.

శ్రీ సిమెంట్ జైపూర్

ఎడారి రాష్ర్టం రాజస్థాన్ లో వెలుగులు విరజిమ్ముతున్న ఈ భవనం ఆర్కిటెక్ చూపరుల కు కనువిందును చేస్తోంది. రాత్రి వేళ ఎల్ ఈడి లైట్ల వెలుగులో ప్రకాశవంతంగా మెరిసిపోతూ ఉంటుంది.

ఐ-ఫ్లెక్స్సొల్యూషన్స్ బెంగుళూరు

ప్లెక్స్, ప్లెక్ల్సిబుల్ ఆర్కిటెక్ లో ఐ-ఫ్లెక్స్ మేటి.144000 స్వాయిర్ పీట్ లో విస్తరించి 15000 మంది ఎంప్లాయిస్ ను కలిగి ఉంది. బెంగుళూరులోని బగ్మానే జిల్లాలో ఉంది. కష్టమర్లకు సపోర్ట్ ను కలిగి ఇక్కడ అంతా వాతావరణం చాలా కూల్ గా కూడా ఉంటుంది.

బాటా బిల్డింగ్ గుర్గాన్

ఇండియాలో ఉన్న ఢిపరెంట్ ఆర్కిటెక్ భవనాల్లో బాటా ఒకటి. అంతా గ్లాస్ తో నిర్మితమై ఉంటుంది. చుట్టుపక్కల అంతా అడవిని తలపిస్తూ ఉంటుంది. ఇండియాలో కళ్లు మిరుమిట్లు గొలిపే క్యాంపస్ లను బయటకు తీస్తే ఇది ముందు వరుసలో ఉంటుంది.

ఇంజనీరింగ్ డిజైన్ రీసెర్చ్ సెంటర్ చెన్నై

భవనం అంతా చెట్లతో నిండి ఉండి పచ్చదనం ఉట్టి పడుతూ ఉంటుంది. మొత్తం బిల్డింగ్ అంతా కాంక్రీట్ తో నిర్మించారు. ఆసియాలోని కాంక్రీట్ భవనాలను వెలికితీస్తే ఈ భవనం సెకండ్ ప్లేస్ ను ఆక్రమిస్తుంది.

సౌత్ ఏసియన్ హ్యూమన్ రైట్స్ డాక్యుమెంటేషన్ సెంటర్ న్యూఢిల్లీ

ఇటుకల ఆకారంలో నిర్మించిన ఈ భవనం ఢిల్లీలో ఉంది. ఈ భవనమంతా ఇటుకలతో అత్యంత కళాత్మకంగా ఉంటుంది.

అడోబ్ హెడ్ క్వార్టర్స్ నోయిడా

రకరకాల రంగులతో నిండి ఉన్న ఈ భవనం సాఫ్ట్ వేర్ కు సంబంధించినది. ఎరుపు, పసుపు,గ్రీన్ ఇంకా రకరకాల రంగులతో నిండి ఉంటుంది. 200000స్వాయిర్ పీట్ లో రియల్ ఎస్టేట్ కలిగి ఉంది.

ఇన్ఫినిటి టవర్స్ కలకత్తా

బిజినెస్ రంగంలో రెండో అతిపెద్ద బిజినెస్ భవనం ఈ టవర్ .ఈ టవర్ ఎక్కువ బాగం అంతా గ్లాస్ తోనే నిండి ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
here write Have A Look At These 11 Amazing And Unique Office Campuses In India
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot