మొబైల్ బిల్లులు భారీగా తగ్గుతున్నాయ్, ఎందుకంటే..

Written By:

త్వరలో మొబైల్ బిల్లులు భారీగా తగ్గబోతున్నాయ్. ప్రతి యేటా తగ్గుతున్న ఈ మొబైల్ బిల్లులు ఈ సారి భారీగా తగ్గనున్నాయని రిపోర్టులు తెలియజేస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఏర్పడిన టెలికం కంపెనీల మధ్య పోటీ, డేటా, వాయిస్ సేవలను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకురావడంతో ఆకాశంలో ఉన్న మొబైల్ బిల్లులు నేలకు దిగివచ్చిన సంగతి తెలిసిందే..అవి ఇంకా 30 శాతం తగ్గనున్నాయట.

తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ ఫీచర్లు ఉండే ఫోన్ కోసం చూస్తున్నారా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

25 నుంచి 30 శాతం వరకూ

వచ్చే సంవత్సరం 25 నుంచి 30 శాతం వరకూ ఫోన్ బిల్స్ తగ్గుతాయని ఇండస్ట్రీ నిపుణులు అంచనా వేస్తున్నారు.

డేటా వాడకంపై చెల్లిస్తున్న మొత్తం

గడచిన సంవత్సర కాలంలో బిల్స్ 25 నుంచి 32 శాతం వరకూ తగ్గగా, డేటా వాడకంపై చెల్లిస్తున్న మొత్తం ఏకంగా 60 శాతం వరకూ తగ్గింది. ఇందుకు ఓ రకంగా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే.

జియో అత్యంత తక్కువ ధరలకు సేవలందిస్తున్న వేళ

జియో అత్యంత తక్కువ ధరలకు సేవలందిస్తున్న వేళ, ప్రధాన పోటీదారులైన భారతీ ఎయిర్ టెల్, వోడాఫోన్, ఐడియాలు కూడా ధరలను తగ్గించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.

రూ. 250 నుంచి రూ. 500లోపే

కేవలం రూ. 250 నుంచి రూ. 500లోపే నెలవారీ ప్యాకేజీలను ఎన్నుకుని రోజుకు 8 గిగాబైట్ల వరకూ డేటాను వాడుకునే సదుపాయం స్మార్ట్ ఫోన్ యూజర్లకు దగ్గర కానుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

2016లో

2016లో ఒక గిగాబైట్ డేటాకు రూ. 250 వరకూ ధర ఉండగా, ప్రస్తుతం అది రూ. 50కి దిగువకు చేరిందని గుర్తు చేస్తున్నారు. జూన్ 2016లో 20 కోట్ల గిగాబైట్ల డేటాను కస్టమర్లు వాడగా, మార్చి 2017కు అది 1300 కోట్లకు చేరిందని తెలిపారు.

ధరల తగ్గింపుతో

కాగా, ధరల తగ్గింపుతో భారతీ ఎయిర్ టెల్ సంస్థ జూన్ తో ముగిసిన త్రైమాసికంలో 75 శాతం మేరకు నిరకలాభాలను కోల్పోయిన సంగతి తెలిసిందే. ఓడాఫోన్ ఆదాయం 8.3 శాతం తగ్గింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here’s why your mobile bill may fall 25-30% by 2018 Read more At Gizbot Telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot