సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు కొత్త పిలుపు, అదీ అమెరికాలో..

Written By:

హెచ్ 1 బి వీసాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న కటినతరమైన నిర్ణయాలు భారత టెక్కీలకు శరాఘాతంలా మారాయి. అయితే ట్రంప్ తీసుకునే కఠిన చర్యలకు ఇండియన్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మా దేశానికి వచ్చి మీ టెక్నాలజీ సేవలు అందించండని ఉత్తర అమెరికాలోని అతి పెద్ద దేశం కెనడా పిలుపునిస్తోంది. అంతేకాక ట్రంప్ నిషేధానంతరం కెనడాలో టెక్ రిక్రూట్‌మెంట్, ఇన్వెస్ట్​‍మెంట్లు భారీగా పెరగనున్నట్టు ఆ దేశం చెబుతోంది.

లీకేజీ భారీన సోనీ కొత్త ఫోన్లు, సరికొత్తగా..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కెనడాలోనే నివసిస్తూ, కెనడాలో ఉద్యోగం

భారత్ నుంచి వచ్చే ప్రతిభావంతులకు ఇదే చక్కని అవకాశం. కెనడాలోనే నివసిస్తూ, కెనడాలో ఉద్యోగం చేసుకోవచ్చని ఫాంటసీ 360 సీఈవో షాఫిన్ డైమండ్ తేజని చెప్పారు.

గేమ్స్‌ అభివృద్ధి

వాంకోవర్‌కు చెందిన ఈ కంపెనీ వర్చ్యూవల్ రియాల్టీ, అగ్మెంటెడ్ రియాల్టీ, మిక్స్‌డ్ రియాల్టీల సహాయంతో గేమ్స్‌ను అభివృద్ధి చేస్తోంది. వాంకోవర్‌లోకి భారతీయులకు స్వాగతం పలుకుతున్నామని అమెరికాలో ఉన్న భారత టెక్కీస్‌ల నుంచి వివరాలు సేకరిస్తున్నామని తేజని చెప్పింది.

దేశ ప్రధానికి లేఖ

ట్రంప్ జారీచేసిన కార్యనిర్వాహక ఆదేశాలతో ప్రభావితులైన వారికి వీసాలు అందించాలని తమ దేశ ప్రధానికి కూడా లేఖ రాసినట్టు కెనడియన్ టెక్నాలజీ కమ్యూనిటీ చెబుతోంది.

తమ ఆర్థికవ్యవస్థను మరింత అభివృద్ధి చేసేలా..

ప్రపంచంలో ఉన్న ప్రతిభావంతులను హైర్ చేసుకుని, వారికి ట్రైనింగ్ ఇప్పించి, గ్లోబల్ కంపెనీలను తమ దేశంలో స్థాపించి, తమ ఆర్థికవ్యవస్థను మరింత అభివృద్ధి చేసేలా చేస్తామని ఆ లేఖలో టెక్ కమ్యునిటీ పేర్కొంది.

టాప్ స్టార్టప్ ఇంక్యుబేటర్లు

అక్కడి టాప్ స్టార్టప్ ఇంక్యుబేటర్లు కూడా భారత టెక్కీలను కెనడాలో నియమించుకోవడానికి ఎక్కువగా మొగ్గుచూపుతున్నాయి. తాజాగా లాంచ్ అకాడమీ కెనడియన్ స్టార్టప్ ఓ వీసా ప్రొగ్రామ్‌కు శ్రీకారం చుట్టింది.

అంతర్జాతీయ స్థాయిలో ఉన్న స్టార్టప్‌లు

ఈ ప్రొగ్రామ్ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఉన్న స్టార్టప్‌లు తమ ప్రధాన కార్యాలయాలను కెనడాలో నియమించుకునేలా అవకాశం కల్పిస్తోంది. ఆ ప్రొగ్రామ్ ద్వారా స్టార్టప్‌లో ఐదుగురు ప్రధాన వ్యక్తులకు, వారి కుటుంబసభ్యులకు ఆరు నెలల్లో కెనడాలో శాశ్వత నివాసానికి ఆమోదం కల్పిస్తోంది.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Indian techies welcome in Canada after Trump's refugee ban read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot