గూగుల్ ఆన్ హబ్ చాలా ఫాస్ట్ గురూ

Written By:

ప్రస్తుత రోజుల్లో ఇంటర్నెట్ ప్రతి ఒక్కరి జీవితంలో పాలుపంచుకుంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉండే విధంగా ‘ఆన్ హబ్' పేరుతో గూగుల్ సంస్థ వైఫై రూటర్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈ రూటర్ ను ఉపయోగించేవారికి నెట్ తో పాటుగా డౌన్ లోడ్, స్ట్రీమింగ్ లు సైతం వేగంగా వస్తాయని గూగుల్ సంస్థ తెలిపింది.తమ ఉత్పత్తులను గృహ వినియోగదారులకు సైతం చేరువ చెయ్యాలనే ఉద్దేశ్యంతోనే దీన్ని రూపొందించినట్లుగా సంస్థ పేర్కొంది. సిలిండర్ ఆకారంలో ఉండే ఈ హబ్ ధర కేవలం రూ. 199.99 అమెరికన్ డాలర్లు. ఓ బ్లాగ్ పోస్ట్ ద్వారా సంస్థ ఈ విషయాన్ని పేర్కొంది. గూగుల్ స్టోర్ , అమెజాన్.కామ్, వాల్ మార్ట్. కామ్ లో ఈ ఆన్ హబ్ కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుందని తెలిపింది.

Read more:సెప్టంబర్‌లో రాబోతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆన్ హబ్

గూగుల్ నుండి వచ్చే ఏ ప్రోడక్ట్ గాని, ఆప్ కు గాని ఒక ప్రత్యేకత ఉంటుందని మనకు తెలుసు. అదే ఒరవడిలో గూగుల్ ఇప్పుడు నెట్ wi-fi ప్రియులకు ఒక సరికొత్త రూటర్ ను లాంచ్ చేసింది. దాని పేరే "ఆన్ హబ్"

స్వంత ఆన్ లైన్ షాప్ అమ్మకాలు

దీనిని తన స్వంత ఆన్ లైన్ షాప్, వాల్మార్ట్, అమెజాన్ ఆన్ లైన్ స్టోర్ ల ద్వారా అమ్మడానికి సిద్దం చేసింది.

సిలిండర్ షేప్

గూగుల్ తయారు చేసిన "ఆన్ హబ్ " సిలిండర్ షేప్ లో ఉంటుంది.

ఎంతో సులువుగా ఆపరేట్

దీనిని మిగతా wi-fi రూటర్లు అయిన నేట్గేర్, ఆపిల్, ఎరిస్ గ్రూప్ లాంటి కంటే ఎంతో సులువుగా ఆపరేట్ చేయడానికి, నమ్మకమయినదిగా, సెక్యూర్ గా, ఉంటుందని తెలుస్తుంది.

ఎప్పటికప్పుడు సాఫ్ట్ వేర్ అప్ డేట్

దీనిలో ఎప్పటికప్పుడు సాఫ్ట్ వేర్ అప్ డేట్ అవుతుందని, ఒక వేళ గూగుల్ క్రోమ్ ఆపరేటింగ్ సిస్టం వాడే వారికి ఇంకా సులువు అవుతుందని కంపనీ తెలిపింది.

సెట్ అప్ చేయడానికి చాలా తక్కువ సమయం

దీనిని సెట్ అప్ చేయడానికి చాలా తక్కువ సమయం కేవలం 3 నిమిషాలు, అంట కంటే తక్కువ పడుతుంది. ఈ రూటర్ ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ పై కూడా పని చేస్తుంది.

తొందరగా ఆన్ లైన్ లోకి

దీనివల్ల వినియోగ దారులను చాలా తొందరగా ఆన్ లైన్ లోకి తీసుకొని రావడానికి గూగుల్ ప్రయత్నం సపలమవుతుందని చెప్పవచ్చు.

గూగుల్ ఫైబర్, ఆల్ట్రా – ఫాస్ట్ ఇంటర్నెట్ సర్వీస్

ఇదియే కాకుండా గూగుల్ గూగుల్ ఫైబర్, ఆల్ట్రా - ఫాస్ట్ ఇంటర్నెట్ సర్వీస్ ను ప్రోవైడ్ చేయాలని తెలుస్తుంది.

అత్యదిక వినియోగ దారులను పెంచుకోవాలని ప్రయత్నాలు

ఇంకా సరికొత్త ప్రయోగమయిన తన ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ ద్వారా వైర్ లెస్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ను అమలు చేయాలని దాని ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అత్యదిక వినియోగ దారులను పెంచుకోవాలని ప్రయత్నాలు కోన సాగుతున్నాయి.

అమ్మకాలతో హాల్ చల్

ఇప్పటికే గూగుల్ తమ wi -fi ఆధారిత ఉత్పత్తులయిన తెర్మో స్టాట్స్, స్మోక్ డిటేక్తర్స్, వీడియో కెమరాలు మార్కెట్లో విపరీతమయిన అమ్మకాలతో హాల్ చల్ చేస్తున్నాయి..

సెప్టెంబర్ మొదటి వారములో...

గూగుల్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం ప్రకారం నెట్ ను ప్రతీ వినియోగదారునికి చాలా స్పీడ్ గా, అనుకూలంగా ఉండడానికి డిజిటాల్ సర్వీసెస్ అందుబాటులోకి తేవడానికి ఉపక్రమించింది. ఇదే "ఆన్ హబ్ " ను అమెరికా మరియు కెనడా లలో ఆగస్ట్ చివరి వారములో గాని, సెప్టెంబర్ మొదటి వారములో గాని కొనుగోలు చేయవచ్చు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
here write meet onhub router the new way wi fi
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot