విండోస్ 10కి సీక్రెట్ వెర్షన్, కేవలం వారికోసమే !

Written By:

విండోస్ 10 ఆపరేటింగ్ సిస్థం మరింత హంగులతో రానుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా యాభై కోట్లకు పైగా కంప్యూటర్లలో రన్‌ అవుతున్న విండోస్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టం మరిన్ని ఆకట్టుకునే ఫీచర్లతో రానుంది. మైక్రోసాఫ్ట్ విండోస్‌ 10కి సీక్రెట్‌ వెర్షన్‌ను అభివృద్ధి చేస్తోందట. అయితే ఆ వెర్షన్‌ను అందరూ వినియోగించడానికి వీలుండదని సమాచారం.

ఐఫోన్ల డేటా హ్యాకర్ల చేతికి వెళ్లింది

విండోస్ 10కి సీక్రెట్ వెర్షన్, కేవలం వారికోసమే !

చైనా ప్రభుత్వం డిమాండ్‌ మేరకు చైనీయుల కోసమే ఆ వెర్షన్‌ను మైక్రోసాఫ్ట్‌ సిద్ధం చేస్తోందట. 2015 జూలై 29 ప్రపంచ మార్కెట్‌లోకి విండోస్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టంను మైక్రోసాఫ్ట్‌ విడుదల చేసింది. అయితే చైనా మాత్రం దానికి అనుమతి నిరాకరించింది.

ఇకపై పాస్‌పోర్టుల్లో ఎలక్ట్రానిక్ చిప్స్ (పాస్‌పోర్టుకి అప్లయి చేయడం ఎలా ?)

విండోస్ 10కి సీక్రెట్ వెర్షన్, కేవలం వారికోసమే !

తమ దేశ నిబంధనల ప్రకారం అందులో భద్రతా లోపాలు ఉన్నాయని, తాము చెబుతున్న మార్పులతో కొత్త వెర్షన్‌ను రూపొందించాలని డిమాండ్‌ చేసింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనా మార్కెట్‌కు దూరం కాకూడదన్న ఆలోచనతో మైక్రోసాఫ్ట్‌ అక్కడి ప్రభుత్వ డిమాండ్‌కు అంగీకరించిందని సమాచారం.

4జీ...ఎయిర్‌టెల్ మరో భారీ డీల్

విండోస్ 10కి సీక్రెట్ వెర్షన్, కేవలం వారికోసమే !

అందుకే ఓఎస్‌లో పలు మార్పులు చేయడంతో పాటు భద్రతాపరమైన కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టిందని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్న విండోస్‌ 10తో పోల్చితే చైనా వెర్షన్‌లో చాలా మెరుగైన ఫీచర్లు ఉన్నట్లు చెబుతున్నారు.

English summary
Windows 10 - Microsoft is releasing a completely NEW version, but you CAN'T get it read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting