ఫేస్‌బుక్‌కు బానిసలవుతున్న యువత!

Posted By: Prashanth

ఫేస్‌బుక్‌కు బానిసలవుతున్న యువత!

 

లండన్: యువతలో ఫేస్‌బుక్ వినియోగం మితిమీరుతోంది. ఈ సామాజిక సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ను వినియోగిస్తున్న ప్రతి తొమ్మిది మందిలో ఒకరు 8 గంటల పాటు కంప్యూటర్‌కే అతుక్కుపోతున్నారు. ఒకటికాదు రెండు కాదు ఏకంగా 20సార్లు ఫేస్‌బుక్‌లోకి లాగినై తమ ఖాతాలను మళ్లీ మళ్లీ చూసుకుంటున్నారు. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ వోచర్‌కోడ్స్.కో.యూకే నిర్వహించిన సర్వేలో ఈ ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.

ముఖ్యంగా 18-25 సంవత్సరాల వయసున్న యువకులకు ఫేస్‌బుక్ వ్యసనంలా మారిందని ఇందులో తేలింది. వీరు రోజుకు సగటున ఎనిమిది గంటలపాటు సామాజిక సంబంధాల వెబ్‌సైట్లతో గడుపుతున్నారు. సైట్‌లో ఉంచిన తమ ఫొటోలు దుర్వినియోగం అవుతుండడం తమకు అత్యంత బాధను కలిగించే విషయమని సగం మంది చెప్పారు. ఈ విషయంలో అమ్మాయిలు ఎక్కువగా ఆందోళన వ్యక్తం చేశారు. ఫేస్‌బుక్ యువత జీవితాల్లో భాగమైపోయిందని, అదే సమయంలో వారిపై ఒత్తిడిని పెంచుతోందని ఈ అధ్యయనం నిర్వహించిన సైట్ వ్యవస్థాపకుడు డంకన్ జెన్నింగ్స్ చెప్పారు.

ఫేస్‌బుక్ ఏలా ఏర్పాటైంది..?

కోట్టాది యూజర్లతో దేశదేశాలను కలగలపుతూ దిగ్గజ సామాజిక నెట్‌వర్కింగ్ సైట్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఫేస్‌బుక్‌కు గొప్ప చరిత్రే ఉంది. తొలత ఈ సామాజిక సైట్ ‘ఫేస్‌మాష్ డాట్‌కామ్ ’గా ప్రారంభమైంది. దీని రూపకర్త మార్క్ జూకర్స్ బర్గ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని తన మిత్రులతో కలిసి ఫేస్‌మాష్ కార్యకలాపాలను ప్రారంభించాడు. సదరు విశ్వవిద్యాలయంలోని అమ్మాయిలు, అబ్బాయిల ఫోటోలను వారికి తెలియకుండా వారి వారి ప్రొఫైల్స్ నుంచి సేకరించి తన లోకల్ నెట్‌వర్క్‌లో పొందుపరిచాడు. ఈ చర్య మార్క్‌ను నేరారోపణలు ఎదుర్కొనేలా చేసింది. ఈ వివాదం ముగిసిన అనంతరం ఫిబ్రవరి 4వ తేదిన ఫేస్‌మాష్ డాట్‌కామ్ ‘ద ఫేస్‌బుక్ డాట్ కామ్’గా రూపాంతరం చెందింది. 30 రోజుల వ్యవధిలనో ద ఫేస్‌బుక్ కాస్తా ఫేస్‌బుక్‌లా మారిపోయింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot