PM Modi యొక్క కొత్త బోయింగ్ 777 VVIP ప్లేన్!!! ఎయిర్ ఫోర్స్ వన్ కు సమానమైన ఫీచర్స్

|

ప్రపంచం మొత్తంగా ఉన్న దేశాల అద్యక్షులకు భద్రత సమస్యలు ఉంటాయి. అందుకోసం వారు విదేశీ పర్యటనలకు వెళ్లేటప్పుడు ప్రత్యేకంగా తయారుచేసిన విమానాలను వాడుతూ ఉంటారు. భద్రత సమస్యలను ఎదురుకుంటున్న టాప్ 10 అద్యక్షులలో మన దేశ ప్రధాని మోడీ కూడా ఉన్నారు.

VVIP బోయింగ్ 777 విమానం

VVIP బోయింగ్ 777 విమానం

ఇప్పుడు మన ప్రధాని కోసం కొత్తగా కొంటున్న VVIP బోయింగ్ 777 విమానం అమెరికా అద్యక్షుడి భద్రత కోసం వాడుతున్న ఎయిర్ ఫోర్స్ వన్ విమానం అందిస్తున్న అధునాతన ప్రొటెక్షన్ ను కలిగి ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి. Amazon- Airtel $2 బిలియన్ల పెట్టుబడుల ఒప్పందం మీద క్లారిటీ ఇచ్చిన ఎయిర్‌టెల్‌

భారత ప్రధాని సరికొత్త VVIP బోయింగ్ 777 ప్లేన్

భారత ప్రధాని సరికొత్త VVIP బోయింగ్ 777 ప్లేన్

భారతదేశం యొక్క ప్రధాని విదేశి పర్యటనల కోసం కొనుగోలు చేస్తున్న సరికొత్త VVIP బోయింగ్ 777 విమానంను ఫోటోగ్రాఫర్ ఆండీ ఎగ్లోఫ్ మొదటిసారిగా పూర్తి ఫోటోను పూర్తిగా కొత్త లైవరీతో క్లిక్ చేయగలిగారు. ఇది ప్రస్తుత తరం విమానాలలో మనం చూసినట్లు కాకుండా అధునాతన రక్షణ సూట్‌ను కలిగి ఉంది. ఈ రెండు VVIP విమానాలు యుఎస్ ఆధారిత బోయింగ్ విమానాల నుండి సుమారు రూ.1200 కోట్ల ధరకు కొనుగోలు చేసినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. Also Read: తక్కువ ధరకే రియల్‌మి నుంచి 55 ఇంచ్ స్మార్‌టీవీ

బోయింగ్ 777 విమానం బాడీ డిజైన్

బోయింగ్ 777 విమానం బాడీ డిజైన్

సరికొత్త VVIP బోయింగ్ 777 విమానం యొక్క బయటిభాగం పూర్తిగా తెలుపు కలర్ లో ఉంటుంది. ఈ విమానం పైభాగంలో భారత జెండాను కలిగి ఉంటుంది. అలాగే విమానం యొక్క మధ్యభాగంలో హిందీ బాషలో భారత్ అని మరియు ఇంగ్లీష్ లో ఇండియా అని వ్రాయబడి ఉంటుంది. అలాగే విమానం యొక్క తోకపై భారత జెండాతో పాటు దేశానికి ప్రాతినిధ్యం వహించేటట్లు వ్రాయబడి ఉంటుంది. పిఎమ్ ఉపయోగిస్తున్న ప్రస్తుత బోయింగ్ 747 రెగ్యులర్ ఎయిర్ ఇండియా లివరీని పొందుతుంది.

బోయింగ్ 777 విమానం టెక్నాలజీ ఫీచర్స్

బోయింగ్ 777 విమానం టెక్నాలజీ ఫీచర్స్

సరికొత్త VVIP బోయింగ్ 777 విమానాలు దేశ అధ్యక్షుడిని మరియు ప్రధానమంత్రి యొక్క పర్యటనలకు భారత ప్రభుత్వం ఉపయోగించనున్నది. ఈ కొత్త విమానాలలో ఇన్ఫ్రారెడ్ మరియు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కౌంటర్మెషర్స్ సూట్లు, కౌంటర్మెజర్ డిస్పెన్సింగ్ సిస్టమ్స్ మరియు క్షిపణి ప్రమాద హెచ్చరిక సెన్సార్లు వంటివి కూడా ఉన్నాయి. ఈ సెన్సార్లు అన్ని కూడా విమానానికి స్వీయ-రక్షణను అందిస్తాయి.

బోయింగ్ 777 విమానం ఇండియా రాక

బోయింగ్ 777 విమానం ఇండియా రాక

సరికొత్త VVIP బోయింగ్ 777 రెండు విమానాలు భారతదేశానికి త్వరలోనే చేరుకోనున్నాయి. వీటిని ఈ సంవత్సరంలోనే మైదానంలో ఉంచనున్నారు. భారత వైమానిక దళం బోయింగ్ సదుపాయాన్ని ఇప్పటికే అనేకసార్లు సందర్శించింది. అక్కడ వారు విమానం యొక్క పురోగతి మరియు అభివృద్ధికి తరచూ సహకరించారు. అదనంగా ఈ విమానం ఇప్పుడు కొత్త అధునాతన పరికరాలతో వస్తున్నందున భారత వైమానిక దళం యొక్క యాజమాన్యంలో మరింత శక్తి పెరిగింది అని కూడా చెప్పవచ్చు.

ప్రధాని వినియోగిస్తున్న ప్రస్తుత విమానం

ప్రధాని వినియోగిస్తున్న ప్రస్తుత విమానం

ప్రధాని మోడీ ప్రస్తుతం దేశీయ ప్రయాణాల కోసం IAF విమానంలో మరియు అంతర్జాతీయ ప్రయాణానికి ఎయిర్ ఇండియా బోయింగ్ 747 లో ప్రయాణిస్తున్నారు. అత్యాధునిక ఈ వివిఐపి విమానాలను హ్యాండిల్ చేయడానికి 40మంది ఎయిర్ ఇండియా పైలట్ల బృందానికి IAF ప్రత్యేక శిక్షణను అందిస్తున్నారు. సరికొత్త VVIP బోయింగ్ 777 వాడుకలో యుఎస్ ప్రెసిడెంట్ యొక్క ఎయిర్ ఫోర్స్ వన్ వలె అదునాతన టెక్నాలిజీలను కలిగి ఉన్నాయి.

Best Mobiles in India

English summary
PM Modi Boeing 777 New Plane Comes With Air Force One Advanced Technology

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X