అన్నీ డేటా ప్లాన్లు ఇక్కడే..బెస్ట్ ఏదో తేల్చుకోండి

Written By:

టెలికం రంగంలోకి ప్రవేశించిన అతికొద్ది కాలంలోనే ఉచిత వాయిస్, డేటా ఆఫర్లతో టెల్కోలకు కంటిమీద కునుకులేకుండా చేసిన జియో ఎట్టకేలకు టారిఫ్ ప్లాన్లను ప్రకటించింది. జియో ప్రకటించిన టారీఫ్ ప్లాన్లతో టెల్కోలు ఊపిరిపీల్చుకున్నాయి. జియోకి ధీటుగా ఆఫర్లను ఇచ్చేందుకు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న ఆఫర్లలో ఏది బెస్ట్ అనేదానిపై ఓస్మార్ట్ లుక్కేద్దాం.

ఎయిర్‌టెల్‌ మళ్లీ దుమ్మురేపింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియో రూ. 303 ప్లాన్

రూ. 99 రీఛార్జ్ చేసుకున్న ప్రైమ్ యూజర్లు రూ. 303 ప్లాన్ కింది ఉండే అన్ని రకాల బెనిపిట్స్ పొందుతారు. 28 జిబి డేటాతో పాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఆఫర్ ఈ ప్లాన్ ద్వారా వర్తిస్తుంది. అయితే రోజుకు 1 జిబి మాత్రమే జియో ఇస్తుంది.తరువాత డేటా వాడితే స్పీడ్ తగ్గుతుందని తెలిపింది. దీంతో పాటు 5జిబి డేటా అదనంగా కూడా ఇస్తోంది.

వొడాఫోన్ రూ. 342 ప్లాన్

రూ. 342కే 28 జిబి డేటా అంటూ సంచలనం రేపింది. ఈ ప్లాన్ లో మీకు రోజుకు 1జిబి డేటా లభిస్తుంది. అలాగే అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ కూడా వర్తిస్తుంది. అలాగే రూ. 346 ప్లాన్ వేసుకుంటే 10 జిబి డేటాతో పాటు రోజుకు 300 నిమిషాల టాక్ టైం ఉచితంగా లభిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ. 345 ప్లాన్

రూ. 345కే 28 జిబి డేటాను అందిస్తోంది. ఇది రోజుకు 1జిబి డేటా చొప్పున మీరు వాడుకోవాల్సి ఉంటుంది. అలాగే వాయిస్ కాల్స్ అపరిమితంగా చేసుకోవచ్చు. ఈ 1జిబి డేటా కైడా పగలు 500 ఎంబి రాత్రి 500 ఎంబి లెక్కన వినియోగించుకోవాల్సి ఉంటుంది.

ఐడియా రూ. 345 ప్లాన్

రూ.345 చెల్లించటం ద్వారా 14జీబి 4జీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్‌ను 28 రోజులు పాటు ఆస్వాదించవచ్చు. రూ.345 ప్లాన్‌లో భాగంగా ఆఫర్ చేయనున్న 14జీబి 4జీ డేటా రోజుకు 500 ఎంబి చొప్పున 28 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది.

జియో బంపరాఫర్, అదనంగా 10జిబి డేటా

జియో బంపరాఫర్, అదనంగా 10జిబి డేటా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio, Airtel, Vodafone and Idea: The ‘free unlimited data’ offers read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot