1000 జిబి డేటాతో జియో ప్లాన్

Written By:

ఉచిత డేటా వాయిస్ కాల్స్‌తో టెల్కోలను ముప్పతిప్పలు పెట్టిన జియో బ్రాడ్‌బాండ్ రంగంలోకి దూసుకొస్తోంది. మొబైల్స్ లో అయితే ఏవిధంగా జియోను వినియోగదారులు వాడారో అదే వేగంతో జియో బ్రాడ్‌బ్యాండ్ సేవలు కూడా వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. దాదాపు 1000 జిబి డేటాతో జియో బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ రానున్నట్లు తెలుస్తోంది.

సరికొత్త ఫీచర్లతో ఆండ్రాయిడ్ 8.0

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

100 జిబి మొదలుకుని 1000 జీబీ డేటా వరకు

నెలకు 100 జిబి మొదలుకుని 1000 జీబీ డేటా వరకు అందించే ప్లాన్‌ను జియో తన బ్రాడ్‌బ్యాండ్ సేవల ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నట్లు టెక్ వర్గాల సమాచారం

10 జీబీపీఎస్ స్పీడ్‌తో

1 జీబీపీఎస్ స్పీడ్‌తో నెలకు 100 జీబీ వరకు ఉచిత డేటా మొదలుకొని 10 జీబీపీఎస్ స్పీడ్‌తో నెలకు గరిష్టంగా 1000 జీబీ వరకు డేటా ఇచ్చేలా జియో బ్రాడ్ బ్యాండ్ సేవలను తీసుకురానున్నట్టు సమాచారం.

ముంబై, పూణెలాంటి నగరాలలో

ఇప్పటికే జియో తన బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను ముంబై, పూణెలాంటి నగరాలలో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నది. అక్కడ కొందరు యూజర్లకు ఇప్పటికే ఉచితంగా ఈ సేవలను జియో అందిస్తోంది.

జియో బ్రాడ్‌బ్యాండ్ ద్వారా వస్తున్న నెట్ స్పీడ్ వివరాలను

ఈ క్రమంలో వారు తమకు జియో బ్రాడ్‌బ్యాండ్ ద్వారా వస్తున్న నెట్ స్పీడ్ వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి వైరల్ అయ్యాయి. ఈ వివరాలతో జియో స్పీడ్‌పై భారీగా అంచనాలు పెరిగేలా ఉన్నాయి.

అధికారికంగా ఎప్పుడు ప్రారంభమవుతాయనేది

అయితే జియో బ్రాడ్‌బ్యాండ్ సేవలు అధికారికంగా ఎప్పుడు ప్రారంభమవుతాయనేది మాత్రం తెలియలేదు. జియో దీనిపై త్వరలోనే ప్రకటన చేసే అవకాశం ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Reliance jio to introduce 1 gbps speed 1000gb broadband plan read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting