ఐఫోన్ ఎక్స్ పై జియో సంచలన ఆఫర్

|

భారీ బడ్జెట్ కారణంగా ఐఫోన్ ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయలేకపోతున్న వారికి గుడ్ న్యూస్. ఐఫోన్ ఎక్స్ కొనుగోలును మరింత సులభతరం చేస్తూ రిలయన్స్ జియో 70 శాతం బుయ్‌బ్యాక్ ఆఫర్‌ను అనౌన్స్ చేసింది.

 
ఐఫోన్ ఎక్స్  పై  జియో సంచలన ఆఫర్

ఈ ఆఫర్‌లో భాగంగా సంవత్సరం ఒప్పందంతో జియో కనెక్షన్ పై ఐఫోన్ ఎక్స్‌ను కొనుగోలు చేసిన వారికి, ఫోన్ రిటర్న్ ఇచ్చే సమయంలో MRP పై 70 శాతం అమౌంట్‌ను తిరిగి ఇవ్వటం జరుగుతుందని కంపెనీ తెలిపింది. ఇదే తరహా స్కీమ్‌ను iPhone 8, iPhone 8 Plusల పైనా జియో అందిస్తోంది.

రూ.4890కే 'కార్బన్ కే9 స్మార్ట్ సెల్ఫీ'రూ.4890కే 'కార్బన్ కే9 స్మార్ట్ సెల్ఫీ'

రిలయన్స్ జియో యూజర్లు కొత్త ఐఫోన్‌లను రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ స్టోర్, మైజియో యాప్, Jio.com లేదా అమెజాన్.ఇన్ ద్వారా ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ కొనుగోలు సమయంలో సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా వరల్డ్ డెబిట్ కార్డ్‌లను ఉపయోగించటం ద్వారా రూ.10,000 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

జియో Buyback Offerను పొందటం ఎలా..?

జియో Buyback Offerను పొందాలనుకునే యూజర్లు ఐఫోన్ ఎక్స్‌ను కొనుగోలు చేసిన వెంటనే మైజియో మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని బుయ్ బ్యాక్ ఆఫర్ లో నమోదు కావల్సి ఉంటుంది. ఒప్పందం ప్రకారం ఏడాది తరువాత ఫోన్ ను రిటర్న్ చేసే సమయంలో ఫోన్ పూర్తిగా వర్కింగ్ కండీషన్ లో ఉండాలి. ఎటువంటి డ్యామేజీలు ఉండకూడదు. జియో Buyback Offerను స్వీకరించిన వారు ప్రతినెలా రూ.799 అంతకన్నా ఎక్కువ మొత్తంలోని జియో టారిఫ్ ను రీఛార్జ్ చేసుకోవల్సి ఉంటుంది.

jio.comలో ఐఫోన్ ఎక్స్‌ను ప్రీ-బుక్ చేసుకునేందుకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్..

- ముందుగా జియో అఫీషియల్ వెబ్‌సైట్ అయిన jio.comలోకి వెళ్లండి.

- వెబ్‌సైట్‌లోకి ఎంటర్ అయిన తరువాత మీకు నచ్చిన ఐఫోన్ ఎక్స్ వేరియంట్‌ను సెలక్ట్ చేసుకోండి.

- తదుపరి స్టెప్‌లో భాగంగా పిన్‌కోడ్‌ను ఎంటర్ చేసి క్వాంటిటీని సెలక్ట్ చేసుకోవల్సి ఉంటుంది.

- తరువాతి స్టెప్‌లో మీ పేరు, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ వంటి వ్యక్తిగత వివరాలను చేయవల్సి ఉంటుంది.

పేమెంట్ ఆప్షన్‌ను సలక్ట్ చేసుకుని ప్రీ-బుకింగ్ అమౌంట్ క్రింద రూ.1,999 చెల్లించినట్లయితే ఫోన్ మీ పేరిట బుక్ కాబడతుంది.

అక్టోబర్ 27, 2017న ప్రారంభమైన ఈ ప్రీ-బుకింగ్ ప్రాసెస్ నవంబర్ 3, 2017తో ముగుస్తుంది.

యాపిల్ ఐఫోన్ ఎక్స్ (Apple iPhone X) స్పెసిఫికేషన్స్...

5.8 అంగుళాల సూపర్ రెటీనా హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఐఓఎస్ 11 ఆపరేటింగ్ సిస్టం, 3డీ టచ్ సిక్స్-కోర్ ఏ11 బయోనిక్ 64-బిట్ ప్రాసెసర్ విత్ 3 కోర్ జీపీయూ, ఎమ్11 మోషన్ కో-ప్రాసెసర్, స్టోరేజ్ ఆప్షన్స్ (64జీబి, 256జీబి), 12 మెగా పిక్సల్ + 12 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 7 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ వోల్ట్ సపోర్ట్, క్యూఐ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్.

Most Read Articles
Best Mobiles in India

English summary
Mukesh Ambani owned Reliance Jio is providing you with the best offer possible.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X