మరో షాక్, జియో బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్

Written By:

ఉచిత డేటా, వాయిస్ సర్వీసులతో టెల్కోల గుండెల్లో మొన్నటిదాకా గుబులు పుట్టించిన రిలయన్స్ జియో ఇప్పుడు టారిఫ్ ప్లాన్ల విషయంలో సైతం టెల్కోలకు నిద్రలేకుండా చేస్తోంది. మరింత మంది కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఎన్నో ప్లాన్స్ వేస్తోంది. ఏప్రిల్ 1 నుంచి టారిఫ్ ప్లాన్స్ అమలుచేయనున్న జియో, కొత్తగా 'బై వన్ గెట్ వన్ ఫ్రీ' ఆఫర్‌తో మరో సంచలనానికి తెరతీయబోతుంది.

తక్కువ ధరకే కత్తిలాంటి ఫోన్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.149 రీఛార్జ్

ఓ ఇంగ్లీష్ వెబ్ సైట్ రిపోర్టు ప్రకారం రూ.149 రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లు కూడా అదనపు డేటా ప్రయోజనాలను అందిస్తుందని రివీల్ అయింది.

హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ కంటే ముందుగా

మార్చి 31 తో ముగుస్తున్న హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ కంటే ముందుగా రీఛార్జ్ చేసుకున్న వారికి 1జీబీ, 5జీబీ, 10 జీబీ డేటా అదనంగా ఇస్తామని కంపెనీ ఇంతకుమునుపే ప్రకటించిన సంగతి తెలిసిందే.

రూ.149కు 2జీబీ డేటా అదనం

అది ఒక్కటి మాత్రమే కాక రూ.149కు 2జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, మరో 1జీబీ డేటాను పొందవచ్చట.

ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకోని జియో కస్టమర్లకు

అయితే ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకోని జియో కస్టమర్లకు ఇదే రీఛార్జ్ తో అపరిమిత వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్, 1జీబీ 4జీ డేటాను కంపెనీ ఆఫర్ చేస్తోంది. అదే ప్రైమ్ మెంబర్లైతే ఈ రీఛార్జ్ కింద 2జీబీ 4జీ డేటాను పొందవచ్చు.

బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్

బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్ కింద రూ.303, రూ.499, రూ.999, రూ.1999, రూ.9999 రీఛార్జ్ లపై అదనపు డేటా ప్రయోజనాలను పొందవచ్చు. ప్రస్తుతం రూ.149 రీఛార్జ్‌తో కూడా డేటా ప్రయోజనాలను పొందవచ్చని తెలుస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio offers extra freebies with Prime to woo more users read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting