జియో ఎఫెక్ట్, ఐడియా నుంచి మరో బంఫరాపర్

Written By:

రిలయన్స్ జియో రోజు రోజుకు సరికొత్త ఆఫర్లతో మిగతా టెల్కోలకు చుక్కలు చూపిస్తోంది. ఇప్పుడు మరో షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒకసారి రూ.303తో రీచార్జ్ చేసుకుంటే జూన్ చివరి వరకు ఉచిత సేవలు పొందవచ్చని బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. మరో వైపు బీఎస్ఎన్ఎల్ కూడా ఇటువంటి ఆఫ‌ర్‌నే ప్ర‌క‌టించింది. ఇక ఐడియా కూగా రంగంలోకి దిగింది. ప్రత్యేక రీఛార్జీలతో త‌మ‌ పోస్ట్‌ పెయిడ్ 4జీ మొబైల్‌ వినియోగదారులకు రోజుకి 1జీబీ 4జీ డాటాను అందించనుంది.

మరిన్ని కొత్త సంచలన టారిఫ్ ప్లాన్లతో వస్తున్న జియో !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.300 యాడ్ ఆన్ ప్యాక్‌తో

రూ.300 యాడ్ ఆన్ ప్యాక్‌తో రోజుకు 1 జీబీ చొప్పున నెల రోజుల పాటు 4జీ డేటాను అందించనున్నట్లు ఐడియా పేర్కొంది.

రూ. 50 అదనంగా చెల్లించి

రూ. 349 లేదా అంతకంటే ఎక్కువ రెంటల్ ఉన్న పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు రూ. 50 అదనంగా చెల్లించి మూడు నెలలపాటు ఈ ఆఫర్‌‌ను పొందవ‌చ్చ‌ని కూడా తెలిపింది.

మార్చి 2018 వరకు ఈ డిస్కౌంట్‌ ఆఫర్‌ పొందాలంటే

అంతేగాక‌, మూడు నెలల తరువాత మార్చి 2018 వరకు ఈ డిస్కౌంట్‌ ఆఫర్‌ పొందాలంటే రూ.199-రూ.349 మధ్యప్లాన్‌లో అదనంగా రూ.200, రూ.349- రూ.498 మధ్య ప్లాన్‌లో అదనంగా రూ.50 చెల్లిస్తే సరిపోతుందని చెప్పింది.

ఈ నెల ముప్పై వ‌ర‌కు

ఈ నెల ముప్పై వ‌ర‌కు త‌మ వినియోగ‌దారులు ఈ రీచార్జ్ చేసుకొని ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చ‌ని తెలిపింది. ఈ ఆఫర్‌ 4జీ హ్యాండ్‌సెట్లకు మాత్రమేన‌ని తెలిపింది.

రూ.100 డిస్కౌంట్‌

అంతేకాదు, రూ.349- రూ.498ల మధ్య రెంటల్‌ ప్లాన్‌ లో రూ.50 డిస్కౌంట్‌, అలాగే రూ.149-రూ.349 రెంటల్ ప్లాన్ పై సబ్ స్క్రైబ్ అయిన ఖాతాదారులకు రూ.100 డిస్కౌంట్‌ అందించనున్నట్టు చెప్పింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Reliance Jio Prime Effect: Idea Launches 1GB Per Day Postpaid Pack for Rs. 300 read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot