హైదరాబాద్ రోబో పోలీస్ విధులకు రెడీ, ప్రపంచంలోనే రెండో పోలీసు !

తెలంగాణా రాష్ట్ర ప్రజలకు మెరుగైన రక్షణ సేవలను అందించే ఉద్దేశంతో ప్రభుత్వం సరికొత్త వ్యూహాలకు తెరలేపింది.

By Hazarath
|

తెలంగాణా రాష్ట్ర ప్రజలకు మెరుగైన రక్షణ సేవలను అందించే ఉద్దేశంతో ప్రభుత్వం సరికొత్త వ్యూహాలకు తెరలేపింది. ఇందులో భాగంగా పోలీసు విభాగంలో లేటెస్ట్ సాంకేతిక విధానాలతో రూపొందించిన రోబో పోలీస్ వ్యవస్థను ప్రవేశ పెట్టేందుకు సిద్ధమవుతోంది.

డిసెంబర్ 31 నుంచి ఈ రోబో పోలీసు విధుల్లో చేరేందుకు రెడీ అవుతోంది. మరి ఆ రోబో పనితీరు ఎలా ఉంటుందో ఓ లుక్కేద్దాం.

ఈ ఏడాది ప్రపంచాన్నివణికించిన క్రూరమైన దాడులు ఇవే !ఈ ఏడాది ప్రపంచాన్నివణికించిన క్రూరమైన దాడులు ఇవే !

పోలీసు శాఖను అలర్ట్

పోలీసు శాఖను అలర్ట్

ఈ రోబో పోలీస్ ప్రజలను పలకరిస్తుంది, అలాగే గుర్తు పడుతుంది, ఫిర్యాదులను కూడా వింటుంది. ముఖ్యంగా అన్ని విషయాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటుంది. దీంతోపాటు అనుమానితులను, బాంబులను గుర్తించి వెంటనే పోలీసు శాఖను అలర్ట్ చేస్తుంది.

జూబ్లీహిల్స్‌ చెక్‌ పోస్టులో..

జూబ్లీహిల్స్‌ చెక్‌ పోస్టులో..

కాగా ఈ రోబో పోలీసు నగరంలో అత్యంత రద్దీ ప్రాంతంగా ఉండే జూబ్లీహిల్స్‌ చెక్‌ పోస్టులో మొదటిసారిగా విధులు నిర్వహించనుంది.

టీ-హబ్‌లో స్టార్టప్‌ కంపెనీగా..

టీ-హబ్‌లో స్టార్టప్‌ కంపెనీగా..

స్టార్టప్‌ సిటీగా.. టీ-హబ్‌లో స్టార్టప్‌ కంపెనీగా ప్రారంభమైన హెచ్‌ బోట్స్‌ రోబోటిక్స్‌ కంపెనీ పోలీస్‌ రోబోను రూపొందించింది. ప్రపంచంలోనే రెండవ పోలీస్‌ రోబోగా గుర్తింపు పొందనున్న దీనిని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశామని రూపకర్తలు తెలిపారు.

రోబో రూపకర్తలు కిషన్‌, అన్వేష్‌, అనిరుధ్‌.

రోబో రూపకర్తలు కిషన్‌, అన్వేష్‌, అనిరుధ్‌.

కాగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ల్యాబ్‌లో ప్రతి ఏటా 10 రోబోలను తయారు చేసే అవకాశం ఉందని, దీని ధర సుమారు రూ.3 లక్షల వరకు ఉంటుందని వారు తెలిపారు. ఈ రోబో రూపకర్తలు కిషన్‌, అన్వేష్‌, అనిరుధ్‌.

ఇప్పటికే దుబాయ్ లో..

ఇప్పటికే దుబాయ్ లో..

అయితే ఇప్పటికే దుబాయ్ లో ఓ రోబో పోలీసు తన విధులను నిర్వరిస్తోంది. అయితే చక్రాలపై కదులుతూ ఆ రోబో పోలీసు విధులను నిర్వహిస్తోంది.దీనికి భిన్నంగా హైదరాబాద్ రోబో పోలీసు చక్రాల మీద కాకుండా, కదులుతూ తన విధులను నిర్వహిస్తుంది.

నగరంలోకి రోబో పోలీసు వస్తోందన్న న్యూస్ ..

నగరంలోకి రోబో పోలీసు వస్తోందన్న న్యూస్ ..

ఇదిలా ఉంటే నగరంలోకి రోబో పోలీసు వస్తోందన్న న్యూస్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సినిమాల్లోనే చూసిన రోబోలను ఇప్పుడు స్వయంగా రోడ్లపై ప్రజల కోసం పని చేయడానికి వస్తుండడంతో ప్రజల్లో ఆసక్తి నెలకొంది.

Best Mobiles in India

English summary
Awesome! Hyderabad based H-Bots designing police robot, which can talk, even walk Read more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X