దిమాక్ ఖరాబ్ అయే ఆఫర్లతో అమ్మకానికి సిద్దమైన సరికొత్త గెలాక్సీ A50 & A30

|

గెలాక్సీ A-సిరీస్‌కు శామ్‌సంగ్ రెండు కొత్త చేర్పులను ప్రకటించింది. సరికొత్త గెలాక్సీ A50 మరియు గెలాక్సీ A 30 ను ఈ రోజు భారతదేశంలో లాంచ్ చేసారు. ఇవి గెలాక్సీ ఎ 50 మరియు గెలాక్సీ ఎ 30 ఫోన్‌లకు అప్‌గ్రేడ్ గా ఇండియాలో అడుగు పెడుతున్నాయి. ఈ రెండింటి యొక్క ముఖ్యాంశాలు సూపర్ అమోలేడ్ డిస్ప్లేలు మరియు వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరాలు.

 

ధరల వివరాలు

ధరల విషయానికొస్తే శామ్‌సంగ్ గెలాక్సీ ఎ 50 యొక్క 4 జీబీ ర్యామ్ వేరియంట్‌ ధర 22,999 రూపాయలు మరియు 6 జీబీ ర్యామ్ వేరియంట్‌ 24,999 రూపాయల ధర వద్ద లభిస్తాయి. అలాగే శామ్‌సంగ్ గెలాక్సీ ఎ 30 యొక్క 4 జిబి + 64 జిబి వేరియంట్‌ 16,999 రూపాయల ధర వద్ద లభిస్తాయి . ఈ హ్యాండ్‌సెట్ ప్రిజం క్రష్ వైలెట్, ప్రిజం క్రష్ బ్లాక్ మరియు ప్రిజం క్రష్ వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం మాల్, మరియు శామ్‌సంగ్ ఆన్‌లైన్ లతో పాటు ఆఫ్ లైన్ రిటైలర్లతో పాటు శామ్‌సంగ్ భాగస్వామి రిటైలర్ల ద్వారా ఈ రోజు నుంచి అందుబాటులో ఉంటుంది.

ఆఫర్స్

ఆఫర్స్ విషయానికి వస్తే రిలయన్స్ జియో మరియు ఎయిర్‌టెల్ కస్టమర్లకు గెలాక్సీ ఎ 50, గెలాక్సీ ఎ 30 లలో డబుల్ డేటా లభిస్తుంది. వోడాఫోన్ ఐడియా చందాదారులకు రూ .255 రీఛార్జ్ మీద 75 రూపాయలు క్యాష్‌బ్యాక్ , రోజుకు 500 ఎంబి అదనపు డేటా 18 నెలలు పాటు లభిస్తాయి.

గెలాక్సీ ఎ 50 యొక్క స్పెసిఫికేషన్
 

శామ్‌సంగ్ గెలాక్సీ ఎ 50 యొక్క స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే ఈ హ్యాండ్‌సెట్‌లో 6.4-అంగుళాల ఫుల్ -హెచ్‌డి + (1080x2340 పిక్సెల్స్) ఇన్ఫినిటీ-యు సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. 6GB RAM మరియు 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఉన్న ఆక్టా-కోర్ ఎక్సినోస్ 9611 SoC ఉంది. ఇది పైన ఉన్న UI తో ఆండ్రాయిడ్ 9 పైతో షిప్పింగ్ అవుతుంది. 48 మెగాపిక్సెల్ ప్రాధమిక సెన్సార్‌తో ఎఫ్ / 2.0 ఎపర్చరు లెన్స్‌తో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ మరియు 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో గల ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది.అలాగే ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరా ఎఫ్ / 2.0 ఎపర్చరు లెన్స్‌తో వస్తుంది. శామ్సంగ్ నైట్ మోడ్‌ను ప్రదర్శించిన మొట్టమొదటి గెలాక్సీ-ఎ స్మార్ట్‌ఫోన్ A50. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,000 ఎంఏహెచ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, వై-ఫై, బ్లూటూత్, డ్యూయల్ సిమ్, యుఎస్‌బి టైప్-సి పోర్ట్ వంటివి ఇందులో ప్రత్యకతలు.

గెలాక్సీ ఎ 30 యొక్క స్పెసిఫికేషన్

గెలాక్సీ ఎ 30 యొక్క స్పెసిఫికేషన్ విషయానికి వస్తే ఇది 6.4-అంగుళాల హెచ్‌డి + (720x1560 పిక్సెల్స్) ఇన్ఫినిటీ-వి సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది ఆక్టా-కోర్ ఎక్సినోస్ 7904 SoC చేత రన్ అవుతుంది. అంతేకాకుండ ఇందులో 4GB ర్యామ్ మరియు 64GB ఆన్బోర్డ్ స్టోరేజ్ ఉంటుంది మరియు మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని విస్తరించవచ్చు. ఇది ఎఫ్ / 1.7 ఎపర్చరు లెన్స్‌తో 25 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా మరియు 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో సహా వెనుక భాగంలో మూడు కెమెరాలు గల ట్రిపుల్ కెమెరా సెట్ అప్ ను కలిగి ఉంది. అలాగే ముందు భాగంలో ఎఫ్ / 2.0 ఎపర్చరు లెన్స్‌తో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,000 ఎంఏహెచ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, వై-ఫై, బ్లూటూత్, డ్యూయల్ సిమ్, యుఎస్‌బి టైప్-సి పోర్ట్ వంటివి ఇందులో ప్రత్యకతలు.

Best Mobiles in India

English summary
Samsung Galaxy A50s,A30 Launched in India: Price,Offers,Specifications and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X