Samsung Exynos 880 5G Chip గురించి కొన్ని ముఖ్య విషయాలు....

|

ఇండియాలో శామ్సంగ్ సంస్థ ఒక బ్రాండ్ గా ఎదిగింది. శామ్సంగ్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క డివైస్ అద్భుతమైన విజయాన్ని సాధించాయి. శామ్సంగ్ యొక్క స్మార్ట్‌ఫోన్‌లు అధిక ధరలతో పాటుగా మిడ్-రేంజ్ విభాగాలలో కూడా మంచి విజయాలను సాధించాయి. ఈ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌లు అద్భుతమైన స్పెసిఫికేషన్లను కలిగి ఉన్నాయి.

ఎక్సినోస్ 880 చిప్‌

ఎక్సినోస్ 880 చిప్‌

శామ్సంగ్ సంస్థ ఇప్పటికే బలమైన చిప్‌సెట్ పోర్ట్‌ఫోలియోలోను కలిగి ఉంది. దీనికి తోడుగా శామ్సంగ్ ఇప్పుడు కొత్తగా ఎక్సినోస్ 880 చిప్‌ను కూడా జతచేస్తోంది. ఈ చిప్‌సెట్ ప్రాసెసర్ యొక్క హైలైట్ ఏమిటంటే మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లు కూడా ప్రస్తుతం అందుబాటులోకి రాబోతున్న 5G మోడెమ్ మరియు ‘AI సామర్థ్యాలకు మద్దతును ఇవ్వడం. ఇది శామ్సంగ్ కోసం ఒక ముఖ్యమైన 5G ప్రాసెసర్ అని కూడా నిరూపించవచ్చు. ఎందుకంటే ఇది రాబోయే నెలల్లో అనేక మధ్య-శ్రేణి హ్యాండ్‌సెట్లలో రావడం మనం చూడవచ్చు. Redmi Earbuds S: తక్కువ ధరలోనే ఇయర్‌బడ్స్!!! నేటి నుంచే సేల్స్...

ఎక్సినోస్ 880 చిప్‌సెట్ ఫీచర్స్

ఎక్సినోస్ 880 చిప్‌సెట్ ఫీచర్స్

ఎక్సినోస్ 880 చిప్‌సెట్ యొక్క ముఖ్యమైన ఫీచర్లలో ఒకటి 5G యొక్క సబ్-6GHz కు మద్దతు ఇవ్వగల సామర్థ్యం. అలాగే ఎక్సినోస్ 880 అప్‌లోడ్ వేగం 1.28Gbps వరకు కూడా ఉంటుంది. ఇది 5G మరియు LTE సామర్థ్యాలను కలిపే E-UTRA-NR డ్యూయల్ కనెక్టివిటీను కలిగి ఉండి 2.55Gbps నుండి 3.55Gpbs వరకు డౌన్‌లోడ్ వేగాన్ని అందిస్తుంది అని శామ్సంగ్ సంస్థ తెలిపారు.

ఎక్సినోస్ 880 AI వర్చువల్ అసిస్టెంట్ ఫీచర్

ఎక్సినోస్ 880 AI వర్చువల్ అసిస్టెంట్ ఫీచర్

స్మార్ట్‌ఫోన్ యొక్క కెమెరాలు మరియు వర్చువల్ అసిస్టెంట్ ఫీచర్ల విషయానికి వస్తే ఎక్సినోస్ 880 చిప్‌సెట్ దాని AI సామర్థ్యాలను కూడా ఉపయోగిస్తుంది. ప్రతిస్పందన సమయాలు మరియు భద్రతను మెరుగుపరచడానికి ఇది న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ (NPU) మరియు డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్ (DSP) ఫీచర్లను కూడా కలిగి ఉంది.

వీడియో రికార్డింగ్ సెన్సార్

వీడియో రికార్డింగ్ సెన్సార్

ఎక్సినోస్ 880 చిప్ కెమెరా విషయాలలో ISP ఐదు సెన్సార్ల వరకు మద్దతు ఇస్తుంది. ఇందులో ముఖ్యమైనది ఏకకాలంలో మూడు సెన్సార్లను ప్రాసెస్ చేయగల సామర్ఢ్యమును కలిగి ఉండడం అని శామ్సంగ్ తెలిపింది. ఇది ఆరు కెమెరాలకు గరిష్టంగా 64 మెగాపిక్సెల్ రిజల్యూషన్ మరియు ప్రతి కెమెరాకు 20 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా రేటింగ్‌తో మద్దతు ఇవ్వగలదు. Exynos 880 యొక్క మల్టీ-ఫార్మాట్ కోడెక్ HEVC, H.264 మరియు VP9 లతో 4K 30fps వీడియో రికార్డింగ్ మరియు ప్లేబ్యాక్‌కు కూడా మద్దతు ఇస్తుంది.

చిప్‌సెట్ రిజల్యూషన్

చిప్‌సెట్ రిజల్యూషన్

ఇంటెన్సివ్ పనుల కోసం రెండు కార్టెక్స్-ఎ 77 కోర్లు మరియు తేలికపాటి బరువు గల కార్యాచరణలను నిర్వహించడానికి ఆరు కార్టెక్స్-ఎ 55 కోర్లతో సహా మొత్తం ఎనిమిది కోర్లను కలిగి ఉంది. కార్టెక్స్- A77 కోర్లను 2GHz వద్ద క్లాక్ చేయగా, కార్టెక్స్- A55 కోర్లు 1.8GHz వద్ద క్లాక్ చేయబడతాయి. ఇవన్నీ ARM మాలి-జి 76 GPU తో పాటు వస్తాయి. ఇది FHD + (2520x1080 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్ప్లే, LPDDR4X RAM మరియు UFS 2.1 / eMMC 5.1 స్టోరేజ్ కు మద్దతు ఇస్తుంది. 8nm చిప్‌సెట్ బ్లూటూత్ V5.0, GPS, GLONASS, బీడువో మరియు గెలీలియోకు మద్దతు ఇస్తుంది.

Best Mobiles in India

English summary
Samsung launched Exynos 880 5G processor Chipset

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X