RS.1000ల తగ్గింపుతో శామ్‌సంగ్ గెలాక్సీ M10

|

ఇండియాలో శామ్‌సంగ్ గెలాక్సీ M10 ధర 1,000రూపాయలు తగ్గించింది. సవరించిన ఈ ధరలు ప్రస్తుతం అమెజాన్.ఇన్ మరియు శామ్సంగ్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా నడుస్తున్న పరిమిత కాల ఆఫర్స్ ద్వారా ధర లభిస్తుంది అని ప్రముఖ దక్షిణ కొరియా దిగ్గజం శామ్సంగ్ తెలిపింది. ముఖ్యంగా ధర తగ్గిన కొద్ది రోజులకే గెలాక్సీ M-సిరీస్ అమ్మకాలు రెండు మిలియన్ యూనిట్ల మార్కును అధిగమించాయని కంపెనీ వెల్లడించింది.

 
samsung m10 price in india cut galaxy rs 6990 specifications

గెలాక్సీ M10 ను ఈ ఏడాది ప్రారంభంలో గెలాక్సీ M20 తో పాటు 7,990రూపాయల ధర వద్ద ప్రారంభించారు.ఈ ఫోన్ శామ్‌సంగ్ యొక్క ఇన్ఫినిటీ-వి డిస్ప్లే ప్యానల్‌ను కలిగి ఉంది మరియు డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

శామ్‌సంగ్ గెలాక్సీ M10 ధర:

శామ్‌సంగ్ గెలాక్సీ M10 ధర:

శామ్సంగ్ ఇండియా ట్విట్టర్ ఖాతాలో ఇండియాలో శామ్సంగ్ గెలాక్సీM10 యొక్క ₹ 6,990 తాత్కాలిక ధర తగ్గింపును ప్రకటించింది.ఇప్పుడు గెలాక్సీM10 యొక్క 2 GB+ 16 GB వేరియంట్‌ ధర ప్రస్తుతం 6,990రూపాయలు కాగా 3 GB+ 32 GB వేరియంట్‌ ధర 7,990రూపాయలు.

గుర్తుచేసుకుంటే శామ్సంగ్ గెలాక్సీ M10 జనవరి చివరిలో భారతదేశంలో 2 GB+ 16 GB వేరియంట్‌ ధర 7,990 రూపాయలు. మరియు 3GB+ 32GB వేరియంట్‌ ధర 8,990 రూపాయలుగా ఉండేది.

 

శామ్సంగ్  అధికారిక ట్వీట్:
 

శామ్సంగ్ అధికారిక ట్వీట్:

Amazon.in మరియు శామ్సంగ్ ఇండియా వెబ్‌సైట్లలో ధర తగ్గింపు అందుబాటులో ఉందని అధికారిక ట్వీట్ తెలిపింది. అయితే ఈ కథనాన్ని దాఖలు చేసే సమయంలో కంపెనీ వెబ్‌సైట్ ధరను ఉత్పత్తి సూచికలో మాత్రమే చూపిస్తుంది మరియు ఫోన్ యొక్క లిస్టింగ్ పేజీలో కాదు. Amazon.in విషయంలో ఇది కాదు.ఇది వినియోగదారులను కొత్త ధరతో ఫోన్‌ను కొనుగోలు చేయడానికి అనుమతిస్తుంది.

పరిమిత కాల ఆఫర్ ద్వారా ధరల తగ్గింపు లభిస్తుందని శామ్సంగ్ తన సోషల్ మీడియా ప్రకటనలో స్పష్టంగా పేర్కొంది. అయితే ఎంతకాలం డిస్కౌంట్ ఇస్తుందో కంపెనీ పేర్కొనలేదు.

శామ్సంగ్ గెలాక్సీ M10 యొక్క కొత్త ధర తగ్గింపుతో రియల్ మి C1 మరియు నోకియా 2.2 వంటి మొబైల్ లకు బలమైన పోటీదారుగా నిలిచింది. అలాగే జూలై 4 న భారతదేశంలో లాంచ్ చేయబోయే షియోమి రెడ్‌మి 7Aను శామ్‌సంగ్ తన సరికొత్త సరసమైన ఫోన్‌గా తీసుకోవడానికి ఇది సహాయపడుతుంది.

 

 స్పెసిఫికేషన్స్:

స్పెసిఫికేషన్స్:

శామ్‌సంగ్ గెలాక్సీ M10 ఆండ్రాయిడ్ 8.1 ఓరియోతో రన్ అవుతుంది. అయితే ఇది ఇటీవల ఇండియాలో ఆండ్రాయిడ్ పై అప్డేట్ ను పొందడం ప్రారంభించింది. ఈ ఫోన్‌ 6.2-అంగుళాల HD + (720x1520 పిక్సెల్స్) ఇన్ఫినిటీ- Vడిస్ప్లే ప్యానెల్‌ 19: 9 కారక నిష్పత్తితో ఉంటుంది. ఈ మొబైల్ Exynos 7870 SoCతో పాటు 2GB మరియు 3GB RAM ఎంపికలతో జత చేయబడి ఉంటుంది.

కెమెరా:

కెమెరా:

ఫోటోలు మరియు వీడియోల కోసం గెలాక్సీ M10 లో వెనుక వైపు రెండు రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇందులో మొదటిది 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో పాటు f/1.9 లెన్స్ ను మరియు రెండవది 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ తో ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో చాట్ మద్దతు కోసం ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ సెన్సార్ తో సెల్ఫీ కెమెరా ఉంది.

కనెక్టవిటీలు:

కనెక్టవిటీలు:

శామ్‌సంగ్ గెలాక్సీ M10లో 16 GBమరియు 32GBఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. ఇవి రెండూ మైక్రో ఎస్‌డి కార్డ్ ద్వారా మెమొరీని 512GB వరకు విస్తరించబడతాయి. అంతేకాకుండా ఈ ఫోన్ 3,400 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంటుంది మరియు మైక్రో-USB పోర్టుతో పాటు డ్యూయల్ సిమ్ (నానో) సపోర్ట్ తో వస్తుంది.

Best Mobiles in India

English summary
samsung m10 price in india cut galaxy rs 6990 specifications

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X