అపరిమిత డేటా, కాల్స్‌తో దూసుకొచ్చిన టెలినార్

Written By:

నార్వేకు చెందిన టెలికాం ఆపరేటర్‌ టెలినార్‌ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని పాత, కొత్త కస్టమర్ల కోసం సరికొత్త అపరిమిత ప్లాన్లను టెలినార్‌ ప్రకటించింది. ఈ కొత్త ప్యాకేజీలు ప్రీపెయిడ్‌ వాయిస్‌, డేటా సర్వీసులకు ఎంతో సరసమైనవని కంపెనీ తెలిపింది.

సోనీ నుంచి బడ్జెట్ ధరకే రెండు కొత్త ఫోన్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎస్‌టీవీ 143

ఈ ప్లాన్‌ కింద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సర్కిల్‌లోని పాత కస్టమర్లు అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌ను వినియోగించుకోవచ్చు. అంతేకాకుండా ఎలాంటి అవాంతరాలు లేకుండా 2జీబీ హైస్పీడ్‌ 4జీ డేటా సర్వీసులను సద్వినియోగం చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.

కొత్త కస్టమర్లు..

ఈ ప్లాన్‌ వాలిడిటీ 28 రోజులు. కొత్త కస్టమర్లు ఇవే ప్రయోజనాలను పొందాలంటే ఎఫ్‌ఆర్‌సీ 148తో రీఛార్జ్‌ చేయించుకోవాల్సి ఉంటుంది.

ఎఫ్‌ఆర్‌సీ 448

ఎక్కువ వాడక కస్టమర్ల కోసం ఎఫ్‌ఆర్‌సీ 448ను లాంచ్‌ చేసింది. ఈ కొత్త ఫస్ట్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ కింద 84 రోజుల పాటు అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌ను, హైస్పీడు 4జీ డేటాను వాడుకోవచ్చని టెలినార్‌ పేర్కొంది.

బిల్లు గురించి ఆందోళన చెందకుండా..

తమ కొత్త ప్లాన్లలతో కొత్త, పాత కస్టమర్లు బిల్లు గురించి ఆందోళన చెందకుండా తమ ప్రియమైన వారితో అపరిమితంగా మాట్లాడుకోవచ్చని టెలినార్‌ ఇండియా టీఎస్‌, ఏపీ సర్కిల్‌ బిజినెస్‌ హెడ్‌ శ్రీనాథ్‌ కోటియాన్‌ తెలిపారు.

స్టమర్లకు వీలైనన్ని సేవలు..

సరసమైన ఉత్పత్తులు, సంబంధిత సర్వీసులతో కస్టమర్లకు వీలైనన్ని సేవలు టెలినార్‌ అందిస్తూ ఉంటుందని చెప్పారు.అన్ని టెల్కోలు ఇప్పుడు 84 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత డేటాను, కాల్స్ ను అందిస్తున్న సంగతి తెలిసిందే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Telenor unveils new plans for TS, AP customers read more news at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot