అమెజాన్‌కు భారీ షాక్ తప్పదా, ఫ్లిప్‌కార్ట్ రూ.9808కోట్ల డీల్ !

Written By:

దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ సరికొత్తగా ముందుకు దూసుకువస్తోంది. ఏకంగా అమెరికా దిగ్గజం అమెజాన్‌కు, చైనా దిగ్గజం అలీబాబాకు చెక్ పెట్టేందుకు వ్యూహాలు రచిస్తోంది.అమెజాన్, అలీబాబాలకు చెక్ పెట్టేందుకు 1.5 బిలియన్ డాలర్ల(రూ.9808కోట్లకు పైగా) ఫండింగ్ కోసం చర్చలు జరుపుతోంది. అమెరికాకు చెందిన ఈబే, చైనా టెన్సెంట్ కంపెనీలు ఫ్లిప్‌కార్ట్‌తో లావాదేవీలు నడపడంలో ముందంజలో ఉన్నట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

న్యూజిలాండ్‌కు ఉచిత విమాన ప్రయాణం, ఉచిత వసతి, ఎవరికంటే..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

చర్చలు కనుక సఫలమైతే

ఈ చర్చలు కనుక సఫలమైతే, వ్యూహాత్మక పెట్టుబడిదారుల కూటమితో అమెరికా దిగ్గజం అమెజాన్‌కు, చైనా దిగ్గజం అలీబాబాకు ఫ్లిప్‌కార్ట్ గట్టి పోటీనివ్వనుంది.

ఈబేతో చర్చలు తుదిదశలో

దీంతోపాటు మూడో ఇన్వెస్టర్ కోసం కూడా కంపెనీ అన్వేసిస్తుందని, ఈబేతో చర్చలు తుదిదశలో ఉన్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ డీల్‌లో ఫ్లిప్‌కార్ట్ ఈబే ఇండియా బిజినెస్‌లను తనలో కలుపుకోవడం లేదా కొనుగోలు చేయడం చేస్తుందని తెలుస్తోంది.

ఎలాంటి స్పందన

అయితే ఈ విషయంపై ఈబే కాని, ఫ్లిప్‌కార్ట్ కాని ఎలాంటి స్పందన తెలుపలేదు. 400, 500 మిలియన్ డాలర్లను ఈబే ఫ్లిప్‌కార్ట్‌లో ఇన్వెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇండియా ఆన్ లైన్ రిటైల్ ఇండస్ట్రి 15-16 బిలియన్ డాలర్లు

ప్రస్తుతం ఇండియా ఆన్ లైన్ రిటైల్ ఇండస్ట్రి 15-16 బిలియన్ డాలర్లుగా ఉంది. అమెరికా, చైనీస్ కంపెనీలకు ప్రస్తుతం భారత్ మార్కెట్ ఎంతో ప్రతిష్టాత్మకమైంది. అయితే వాటికి చెక్ పెడుతూ దేశీయ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఇండియా ఈ-కామర్స్ ఇండస్ట్రిలో ముందుకు దూసుకెళ్తోంది.

తాజా డీల్‌తో కంపెనీ విలువ

తంలో కూడా ఈ కంపెనీ 15.2 బిలియన్ డాలర్లు విలువైన పెట్టుబడులను ఆర్జించింది. ఈ తాజా డీల్‌తో కంపెనీ విలువ 10 బిలియన్ డాలర్లు(రూ.65,395కోట్లు), 12 బిలియన్ డాలర్ల(రూ.78,465కోట్లు)కు వెళుతుందని తెలుస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
This deal may give Flipkart $1.5 billion to take on Amazon read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot