తుపాను దెబ్బకి ఇంటర్నెట్ విలవిల, సర్వర్లు డౌన్

Written By:

గత రెండు మూడు రోజుల నుంచి వర్దా తుపాను చెన్నై, ఏపీని ముప్పతిప్పలు పెడుతున్న విషయం తెలిసిందే. తుపాను దెబ్బకు సర్వం అతలాకుతలమై జనజీవనం స్థంభించిపోయింది. చెన్నై అయితే చిగురుటాకులా వణికిపోయింది. తుఫాను దెబ్బ టెల్కోలపై కూడా భారీగా పడింది. దేశ వ్యాప్తంగా ఇంటర్నెట్ సరఫరా చేసే కేబుళ్లు తెగిపోయాయి. దీంతో ఇంటర్నెట్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

రూ. 19 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రోజుల నుంచి ఇంటర్నెట్ చాలా స్లో

గత రెండు రోజుల నుంచి ఇంటర్నెట్ చాలా స్లో అయింది. పేజీలు లోడ్ కావడానికి చాలా ఎక్కువ చాలా సమయం తీసుకుంటోంది. ఏం జరిగిందోనని కొంతమంది ఆందోళనతో తమ సర్వీస్ ప్రొవైడర్లకు ఫోన్లు చేశారు. కానీ తప్పు వాళ్లది కాదు .. వర్ధా తుపానుది!

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎయిర్టెల్ కేబుళ్లు

వర్ధా తుపాను తీవ్రత కారణంగా సముద్రగర్భంలో ఉన్న పలు టెలికం కంపెనీలకు చెందిన కేబుళ్లు దెబ్బతిన్నాయి. ఇందులో ఎయిర్టెల్ కేబుళ్లు ఎక్కువగా దెబ్బతిన్నాయని, ఇతర కంపెనీలకు చెందిన కేబుళ్లు కూడా దెబ్బతినడంతో నెట్ బాగా స్లో అయిందని నిపుణులు చెబుతున్నారు.

ఇంటర్నెట్ ట్రాఫిక్ పాక్షికంగా ప్రభావితం

చెన్నై తీరంలో సంభవించిన తీవ్ర పెనుతుపాను కారణంగా సముద్రగర్భంలో ఉన్న తమ అంతర్జాతీయ కేబుళ్లు దెబ్బతిన్నాయని, దాంతో ఇంటర్నెట్ ట్రాఫిక్ పాక్షికంగా ప్రభావితం అయ్యిందని .. అందుకే కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ / డేటా స్పీడు బాగా తగ్గిందని ఎయిర్టెల్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ విషయమై కస్టమర్లకు కూడా పలువురు సర్వీస్ ప్రొవైడర్లు ఎస్ఎంఎస్లు పంపుతున్నారు.

అంతర్జాతీయ ఇంటర్నెట్ ట్రాఫిక్ను

 దెబ్బతిన్న కేబుళ్లను సరిచేసేందుకు, ఆపరేషన్లను సాధారణ స్థితికి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈలోపు అంతర్జాతీయ ఇంటర్నెట్ ట్రాఫిక్ను మళ్లించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు కూడా తీసుకుంటున్నారు.

ప్రతి ఒక్కరికి సంబంధించిన కేబుళ్లు

తమ కేబుళ్లు కూడా దెబ్బతిన్నాయని వొడాఫోన్ ప్రతినిధి ఒకరు చెప్పారు. టాటా కమ్యూనికేషన్స్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ .. ఇలా ప్రతి ఒక్కరికి సంబంధించిన కేబుళ్లు కూడా దారుణంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Vardah damages undersea cable, internet slows down read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting