కొత్త Vivo Y15c ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది ! ధర మరియు స్పెసిఫికేషన్లు చూడండి.

By Maheswara
|

Vivo ఇండియన్ మార్కెట్లో స్మార్ట్‌ఫోన్‌లకు ప్రసిద్ధి చెందింది. ఈ బ్రాండ్ ఇప్పటికే పలు ఆకర్షణీయమైన స్మార్ట్‌ఫోన్‌లను ప్రవేశపెట్టింది. ఇప్పుడు కొత్త Vivo Y15c స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో లాంచ్ చేయబడింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ మరియు డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అవును, Vivo భారతదేశంలో Y15c స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది MediaTek Helio P35 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఫోన్‌లో మిస్టిక్ బ్లూ మరియు వేవ్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో అన్ని ఫీచర్లు గురించి వివరాలు తెలుసుకుందాం.

డిస్ప్లే  డిజైన్ మరియు లేఅవుట్

డిస్ప్లే  డిజైన్ మరియు లేఅవుట్

Vivo Y15c స్మార్ట్‌ఫోన్ 720 x 1600 పిక్సెల్ స్క్రీన్ రిజల్యూషన్‌తో 6.55-అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్  డిస్ప్లే వాటర్-డ్రాప్ నాచ్ డిస్ప్లే. ఇది 60Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ మరియు IPS LCD స్క్రీన్‌ని కలిగి ఉంది. అదనంగా, ఈ డిస్ప్లే ఐ ప్రొటెక్షన్ మోడ్‌ను కలిగి ఉంది, ఇది హానికరమైన నీలి కాంతిని ఫిల్టర్ చేస్తుంది.ఇందులో ని ప్రాసెసర్ వివరాలు గమనిస్తే , Vivo Y15c స్మార్ట్‌ఫోన్ MediaTek HeLio P35 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 12 ని సపోర్ట్‌ చేస్తుంది. ఇది 3GB RAM మరియు 32GB మరియు 64GB ఇంటర్-స్టోరేజ్ కెపాసిటీతో వస్తుంది. ఇంకా మైక్రో SD కార్డ్ సపోర్ట్‌తో స్టోరేజ్ కెపాసిటీ విస్తరించవచ్చు.

కెమెరా వివరాలు

కెమెరా వివరాలు

Vivo Y15c స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ప్రధాన కెమెరా F / 2.2 లెన్స్‌తో 13 మెగాపిక్సెల్ సెన్సార్ కలిగి ఉంది. ఇక రెండవ కెమెరా 2 మెగాపిక్సెల్ సెన్సార్ F / 2.4 మాక్రో లెన్స్‌ను కలిగి ఉంది. ఇందులో 8 మెగాపిక్సెల్ సెన్సార్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఇది పనోరమా, ఫేస్ బ్యూటీ, టైమ్-లాప్స్, లైవ్ ఫోటో, ప్రో మరియు అనేక ఇతర కెమెరా మోడ్‌లను కలిగి ఉంది.

బ్యాటరీ మరియు ఇతర వివరాలు

బ్యాటరీ మరియు ఇతర వివరాలు

Vivo Y15c స్మార్ట్‌ఫోన్ 5,000mAh కెపాసిటీ బ్యాటరీని కలిగి ఉంది మరియు 10W ఛార్జింగ్ స్పీడ్‌కు మద్దతు ఇవ్వగలదు. ఈ Vivo స్మార్ట్ ఫోన్ 18.74 గంటల ఆన్‌లైన్ HD మూవీ స్ట్రీమింగ్ మరియు 7.89 గంటల గేమ్‌ప్లే సమయాన్ని అందించగలదని పేర్కొంది. ఇతర కనెక్టివిటీ ఎంపికల వివరాలు గమనిస్తే , బ్లూటూత్ 5.0, 2.4GHz / 5GHz Wi-Fi, GPS ఉన్నాయి. ఇంకా ఆడియో కోసం 3.5mm హెడ్‌ఫోన్ జాక్ మరియు ఛార్జింగ్ మరియు డేటా బదిలీ కోసం మైక్రో USB పోర్ట్‌ను కూడా కలిగి ఉంది. ఈ ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది.

ధర మరియు లభ్యత వివరాలు

ఈ స్మార్ట్‌ఫోన్ ధర మరియు లభ్యత ఇంకా వెల్లడి కాలేదు. కానీ ఈ స్మార్ట్‌ఫోన్ మిస్టిక్ బ్లూ మరియు వేవ్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది.

Best Mobiles in India

English summary
Vivo Y15c Smartphone Launched In India With 5000mAh Battery. Check Specifications Here.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X