జూన్ నెలలో రిలీజ్ అయిన ఉత్తమమైన స్మార్ట్ ఫోన్లు

|

మీరు కొత్త మొబైల్ కొనుగోలు చెయ్యాలి అని చూస్తున్నారా అయితే ఈ నెల జూన్ లో కొన్ని కంపెనిల నుంచి మంచి స్మార్ట్ ఫోన్లు రిలీజ్ అయ్యాయి.గత నెల మే నెలలో OnePlus మరియు గూగుల్ వారు తమ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేశాయి. OnePlus దాని ప్రీమియమ్ ఫ్లాగ్షిప్ OnePlus 7 ప్రో మరియు OnePlus 7 ను ప్రారంభించినప్పుడు గూగుల్ సంస్థ తమ బ్రాండ్ ఫోన్లు గూగుల్ పిక్సెల్ 3a మరియు పిక్సెల్ 3a XL లను ఆవిష్కరించింది.

 
want to buy a new smartphone here are some cool phones launching in june

రియల్ మి, Xiaomi, శామ్సంగ్ మరియు నోకియాలు కూడా ఈ నెలలో వారి స్మార్ట్ ఫోన్లను ప్రారంభించాయి. జూన్ నెలలో మరిన్ని స్మార్ట్ ఫోన్లను ప్రారంభించాయి వాటిలో ఉత్తమమైన స్మార్ట్ ఫోన్ల గురించి ఇప్పుడు ఇక్కడ చూడండి.

రియల్‌ మిX:

రియల్‌ మిX:

రియల్‌ మిX స్మార్ట్‌ఫోన్ 19.5: 9 కారక నిష్పత్తితో 6.53-అంగుళాల ఫుల్ హెచ్‌డి + ఎడ్జ్-టు-ఎడ్జ్ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇక్కడ వీటిలో ఒకటి 48-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ మరియు 5 మెగాపిక్సెల్ డీప్ సెన్సార్‌తో సెకండరీ కెమెరా జత చేయబడి ఉంటుంది.సెల్ఫీస్ మరియు వీడియో కాలింగ్ కోసం ఇది ముందువైపు 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 710 SoC చేత రన్ అవుతుంది మరియు ఇది 8GB RAM మరియు 128GB స్టోరేజీతో జత చేయబడి ఉంటుంది.

Xiaomi Redmi K 20:

Xiaomi Redmi K 20:

Xiaomi Redmi K 20 19.5: 9 కారక నిష్పత్తితో 6.39 అంగుళాల AMOLED ఫుల్ HD + డిస్ప్లేని కలిగి ఉంది. Xiaomi 0.8 సెకన్లలో పైకి వచ్చే పాప్స్ 20MP కెమెరా ఉంది.డిస్ప్లే లో వేలిముద్ర సెన్సార్ కూడా వస్తుంది. వెనుక భాగంలో Redmi K20 48MP + 13MP + 8MP ఆకృతీకరణలో ట్రిపుల్-కెమెరా సెటప్ తో వస్తుంది.ఇది ఆక్టా-కోర్ స్నాప్ డ్రాగన్ 730 ద్వారా పనిచేస్తుంది. ఇది 6GB RAM మరియు 64GB స్టోరేజీ వేరియంట్ తో వస్తుంది.

శామ్సంగ్ A80:
 

శామ్సంగ్ A80:

శామ్సంగ్ సంస్థ ఈ నెలలో శామ్సంగ్ గెలాక్సీ A80 ను రిలీజ్ చేసారు.ఇది రెండు వైపులా తిరిగే ట్రిపుల్ కెమెరా వ్యవస్థతో మరియు ఫుల్ స్క్రీన్ డిస్ప్లే తో పని చేస్తుంది. దీనిని ఏప్రిల్ లో బ్యాంకాక్ లో ప్రారంభించారు. ఈ ఫోన్ను ఇండియాలో ఇంకా రిలీజ్ చేయలేదు ఈ మొబైల్ యొక్క లభ్యత మరియు ధరల వివరాలను ఇంకా ప్రకటించాల్సి ఉంది కానీ ఈ మొబైల్ ను జూన్ లోనే ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రకటించింది.ఈ ఫోన్ యొక్క ధర 50,000 రూపాయలకు తక్కువగా ఉంటుంది. వినియోగదారులు కెమెరా యాప్ లో సెల్ఫీ మోడ్ను ఎంచుకున్నప్పుడు, మూడు కెమెరాలు ఫోన్ యొక్క వెనుక నుండి ఆటొమ్యాటిక్ గా పాప్-అప్ రొటేట్ అవుతాయి.అంటే దీని అర్థం ట్రిపుల్ సెన్సార్స్ తో ఉన్న కెమెరా 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 8 మెగాపిక్సెల్ సెన్సర్ 123 డిగ్రీ అల్ట్రా వైడ్ కోణంతో పాటు మరో 3D డెప్త్ సెన్సర్ గల మెయిన్ కెమెరాలు ఫొటోస్ మరియు వీడియో రికార్డింగ్ తో పాటు వీడియో కాలింగ్ మరియు సెల్ఫీస్ కోసం ఈ ట్రిపుల్ కెమెరాను రెండింటికి ఉపయోగించవచ్చు.

Xiaomi Mi 9:

Xiaomi Mi 9:

Mi 9 స్మార్ట్ ఫోన్ జూన్ 12 వ తేదీన ప్రారంభించారు. ఈ ఫోన్ 19.5: 9 యొక్క కారక నిష్పత్తితో మరియు 1080x2340 పిక్సెల్స్ తో 6.9 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లే ను కలిగి ఉంటుంది. ఇది 1.8GHz ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 730 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇది 6GB RAM మరియు 64 GB స్టోరేజీతో నిర్మిచబడి ఉంటుంది.దీని వెనుకవైపు 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా మరియు 8 మెగాపిక్సెల్ రెండవ కెమెరా మరియు 13 మెగాపిక్సెల్ మూడవ కెమెరా గల ట్రిపుల్ కెమెరా స్లాట్ ను కలిగి ఉంది. ఇది సెల్ఫీస్ కోసం ముందు వైపు 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

నోకియా X 71:

నోకియా X 71:

నోకియా X71స్పోర్ట్స్ FHD + రిజల్యూషన్ తో 6.39-అంగుళాల పూర్ డిస్ప్లే స్క్రీన్లను కలిగి ఉంది. ఇది ఆక్టా-కోర్ స్నాప్ డ్రాగన్ 660 చిప్సెట్ తో పనిచేస్తుంది.ఇది బ్యాక్ సైడ్ 48MP, 5MP మరియు 8MP అల్ట్రా వైడ్-అంగిల్ సెన్సర్ తో ట్రిపుల్ కెమెరా స్లాట్ ను కలిగి ఉంటుంది.ఈ ఫోన్ ముందువైపు సెల్ఫీస్ కోసం 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
want to buy a new smartphone here are some cool phones launching in june

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X