ఇండియాలో షియోమి ఉద్యోగాల పంట, 20వేలకు పైగానే

Written By:

షియోమి ఇండియాలో ఉద్యోగాల పంటను పండించనుంది. 20 వేల ఉద్యోగాలు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇండియా తమకు చాలా కీలకమైన మార్కెట్‌ అని, ఇక్కడ వచ్చే మూడేళ్లలో 20,000 మందికి ఉపాధి కల్పిస్తామని షియోమి వ్యవస్థాపకుడు లీ జున్‌ తెలిపారు. ఆయన ఎకనమిక్‌ టైమ్స్‌ గ్లోబల్‌ బిజినెస్‌ సమిట్‌-2017లో పాల్గొని అక్కడ ఈ విషయాలు తెలిపారు.

షియోమి కొత్త షాక్ : సెకనుకో ఫోన్ తయారీ, అదీ ఏపీలో

ఇండియాలో షియోమి ఉద్యోగాల పంట, 20వేలకు పైగానే

ఇండియన్‌ ఆన్‌లైన్‌ మార్కెట్‌లో విజయవంతమైన తాము ఆఫ్‌లైన్‌ మార్కెట్‌పై దృష్టి కేంద్రీకరించామని తెలిపారు. భారత్‌లో విక్రయమౌతోన్న ఫోన్లలో 95 శాతం మేడిన్‌ ఇండియావేనని పేర్కొన్నారు. కాగా షియోమి కంపెనీ 2014 జూలైలో ఇండియన్‌ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది.

షియోమి నుంచి దిమ్మతిరిగే ఫోన్ వస్తోంది

ఇండియాలో షియోమి ఉద్యోగాల పంట, 20వేలకు పైగానే

2015 ఆగస్ట్‌లో తొలి ప్లాంట్‌ను ప్రారంభించింది. 2016 మార్చి నాటికి కంపెనీకి చెందిన 75 శాతం ఫోన్లు దేశీయంగానే తయారవుతున్నాయి. షియోమి కంపెనీ ఫాక్స్‌కాన్‌తో కలిసి ఏపీలో రెండో ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోన్న సంగతి తెలిసిందే.

English summary
Xiaomi aims to create 20,000 jobs in India in next three years read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot