రిటైల్ షాపులలో RS.5000 తగ్గింపుతో షియోమి పోకో F1

|

షియోమి యొక్క పోకో F1 ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ లలో ధరల తగ్గింపును ఇంకా కొనసాగిస్తోంది. గత వారం పోకో డేస్ సేల్ సందర్భంగా పోకో F1 మొబైల్ మీద 8,000 రూపాయల వరకు తగ్గింపును పొందింది. ఇప్పుడు సంస్థ ఆఫ్‌లైన్ ఛానెళ్లలో కూడా స్మార్ట్‌ఫోన్‌కు శాశ్వత ధర తగ్గింపును ప్రకటించినట్లు తెలిసింది. షియోమి యొక్క పోకో F1 మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

 
xiaomi poco f1 price in india reportedly slashed by up to rs 5000 at offline stores

ఈ మొబైల్ ను గతంలో చాలా సార్లు అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ ద్వారా గొప్ప ఆఫర్లతో అందించారు. భారతదేశంలో ఇప్పుడు కొత్తగా తగ్గింపు పొందిన తరువాత పోకో F1 యొక్క ధర వివరాలు తెలుసుకోవడానికి కింద చదవండి.

ఇండియాలో షియోమి పోకో F1 ధర వివరాలు:

ఇండియాలో షియోమి పోకో F1 ధర వివరాలు:

ఇండియాలో ఆఫ్‌లైన్ రిటైలర్లు పోకో F1 యొక్క తగ్గింపు ధర గురించి వివరాలు పూర్తిగా షియోమి నుండి సర్క్యులర్ అందుకున్నట్లు తెలిసింది. దీని ఆధారంగా పోకో F1 స్మార్ట్‌ఫోన్‌కు రూ .5 వేల వరకు ధర తగ్గింపు లభిస్తుందని నివేదించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ధరలు ఇప్పుడు 128 GB స్టోరేజ్ మరియు 6 Gb ర్యామ్ వేరియంట్‌కు రూ .2,000 డిస్కౌంట్ తగ్గింపు పొందిన తరువాత 18,999 రూపాయల ధరతో ప్రారంభమవుతాయి.

256 జీబీ స్టోరేజ్ మరియు 8 Gb ర్యామ్‌తో కూడిన టాప్ ఎండ్ వేరియంట్‌కు 5 వేల రూపాయల వరకు తగ్గింపు లభిస్తుంది. స్టాండర్డ్ మరియు కెవ్లర్ ఎడిషన్లు రెండూ ఇప్పుడు 22,999 రూపాయలకు అందుబాటులో ఉన్నాయి. ఈ ధరల తగ్గింపులు ఆఫ్‌లైన్ మోర్టార్ దుకాణాలకు పరిమితం అవుతాయి.

 

ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో ధర:

ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో ధర:

గతంతో ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో ఉన్న ధరతో పోల్చితే పోకో F1 యొక్క బేస్ మోడల్ 64 GB స్టోరేజ్ మరియు 6 GB ర్యామ్ మోడల్ 17,999 రూపాయలతో ప్రారంభమయాయి. అలాగే 128 GB స్టోరేజ్, 6 GB ర్యామ్ కలిగిన మిడ్ రేంజ్ వేరియంట్ ధర 20,999 రూపాయలు ఉండగా. చివరగా 256 GB స్టోరేజ్ మరియు 8 GB ర్యామ్ కలిగిన టాప్-ఎండ్ వేరియంట్ ధర 27,999 రూపాయలు.

కలర్ వేరియంట్:
 

కలర్ వేరియంట్:

ఈ మొబైల్ రోసా రెడ్, గ్రాఫైట్ బ్లాక్ మరియు స్టీల్ బ్లూ వంటి మూడు రంగులలో మార్కెట్లో అందుబాటులో ఉంది. Xiomi Poco F1 స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 845 SoC ప్రాసెసర్ తో ఇండియన్ మార్కెట్లో చౌకైన ధరకు లభిస్తుంది.

Xiomi Poco F1 స్పెసిఫికేషన్స్ :

Xiomi Poco F1 స్పెసిఫికేషన్స్ :

పోకో F1 6.18 inch ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే 2246 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ మరియు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ను కలిగి ఉంటుంది. ఇది ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్ తో 6/8 GB ర్యామ్ మరియు 64/128/256 Gb స్టోరేజ్ వేరియంట్ లలో వస్తుంది. మెమరీని మరింత పొందడానికి ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ఆప్షన్ ద్వారా 256Gb వరకు పొందవచ్చు. ఇది ఆండ్రాయిడ్ 8.1 ఓరియో (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 9.0 పై) ఆధారంగా పనిచేస్తుంది. కనెక్టవిటీ పరంగా ఇది హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 4G VolteE, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్C ను కలిగి ఉంటాయి. కెమెరా విషయంలో వీడియోలు మరియు విడియోగ్రఫీ కోసం ఫోన్ వెనుక వైపు ఇది 12+5- మెగా పిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలను కలిగి ఉంటుంది. అలాగే సెల్ఫీస్ మరియు వీడియో కాలింగ్ కోసం ముందు వైపు 20- మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. ఇందులో ఫింగర్‌ప్రింట్ సెన్సార్,IR ఫేస్ అన్‌లాక్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇది క్విక్ చార్జ్ 3.0 ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో పెద్ద 4000 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. 4000mAh బ్యాటరీ గల పోకోF1 లిక్విడ్ కూలింగ్ సాంకేతికతను కలిగి ఉంది.ఇది చాలా సమయం వరకు కూడా గేమ్ ఆడినా కూడా CPU ను కూల్ గా ఉంచుతుంది. ఇందులో 256GB వరకు విస్తరించదగిన మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా ఉంది.

Best Mobiles in India

English summary
xiaomi poco f1 price in india reportedly slashed by up to rs 5000 at offline stores

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X