20 కోట్ల మంది యూజ్ చేస్తున్న యాప్

Written By:

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ర్యామ్ తక్కువ ఉన్నవారికోసం రూపొందించిన ఫేస్‌బుక్ లైట్ యాప్‌ను ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు వినియోగిస్తున్నారు. నెలవారీగా ఫేస్‌బుక్ యాప్ వినియోగంపై సంస్థ జరిపిన తాజా సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఇన్ని కోట్లమంది యూజ్ చేయడంపై ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ హర్షం వ్యక్తం చేశారు.

ఈ ఫోన్ చాలా కాస్ట్ గురూ..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యూజర్ల ఇబ్బందులను తొలగించేందుకు

సాధారణ ఫేస్‌బుక్ యాప్ యూజ్ చేయాలంటే స్మార్ట్‌ఫోన్ ర్యామ్ కాస్త ఎక్కువగా ఉండాలి. 1జీబీ కంటే తక్కువ ర్యామ్ ఉన్న స్మార్ట్ ఫోన్లు వాడే యూజర్ల ఇబ్బందులను తొలగించేందుకు సంస్థ ఫేస్‌బుక్ లైట్ యాప్‌ను ఆవిష్కరించింది.

150కి పైగా దేశాల నెటిజన్లు

50 కంటే ఎక్కువ భాషలలో, లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికా, యూరప్ ఖండాలలో 150కి పైగా దేశాల నెటిజన్లు ఈ యాప్‌ను యూజ్ చేస్తున్నారు.

గూగుల్ ప్లే స్టోర్ నుంచి

గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆండ్రాయిడ్ యూజర్లు ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రెగ్యులర్ ఎఫ్‌బీ యాప్ కంటే లైట్ యాప్ తక్కువ స్పేస్ తీసుకుంటుంది. దీంతో సులువుగా లైక్స్, షేర్లు చేయొచ్చు.

సీఈవో జుకర్ బర్గ్ స్పందన

ప్రోగ్రామర్స్ ఎంతో శ్రమించి రూపొందించిన ఫేస్‌బుక్ లైట్ యాప్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తక్కువ బ్యాండ్ విడ్త్ ఇంటర్ నెట్ కలిగి ఉన్న నెటిజన్లను దృష్టిలో ఉంచుకుని చేసిన తమ ప్రయత్నానికి విశేష స్పందన వచ్చిందని ఓ ప్రకటనలో ఫేస్‌బుక్ సీఈవో జుకర్ బర్గ్ వెల్లడించారు.

2015 జూన్ నెలలో

కాగా ఈ యాప్‌ను 2015 జూన్ నెలలో లాంచ్ చేశారు. అతి కొద్ది కాలంలోనే 20 కోట్ల మార్క్‌ని చేరుకుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Facebook Lite Gets Speed, Reliability Improvements; Now Has Over 200 Million Users read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting