ప్రజాస్వామ్యానికి ఫేస్‌బుక్ మంచిదని గ్యారెంటీ ఇవ్వలేం !

Written By:

అందరూ కోరుకుంటున్నట్లు మంచి ప్రజాస్వామ్యానికి మేము గ్యారెంటీ ఇవ్వలేమంటున్న ఫేస్‌బుక్ వెల్లడించింది. ఏ దేశ ప్రజాస్వామ్యానికైనా మా నుంచి మంచి వస్తుందని కరెక్టుగా చెప్పలేము..అయితే మంచి రావడానికే మా ప్రయత్నం మేము చేస్తామని చెబుతోంది. కాగా గత అమెరికా ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున misleading headlines సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ప్రధానంగా అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ దేశాల ఎన్నికల సమయంలో సోషల్‌మీడియాను వినియోగించుకుని రష్యా ఫేక్‌న్యూస్‌ను సర్క్యూలేట్‌ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ ఆరోపణలను రష్యా ఖండించింది.

రూపాయికే అన్‌లిమిటెడ్ డేటా, అదిరే ఆఫర్ దిశగా Bsnl..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎన్నికల సమయంలో..

దీనిపై ఫేస్‌బుక్ product manager Samidh Chakrabarti స్పందిస్తూ ఎన్నికల సమయంలో రష్యా తదితర దేశాల ప్రభావం ప్రజలపై పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఫేక్ న్యూస్ కలిగిన అకౌంట్లను బ్లాక్ చేసేందుకు కృషి చేస్తామని అతని యెక్క FB పోస్టులో తెలిపారు.

ప్రజాస్వామ్యంలో సోషల్‌మీడియా పాత్ర

దాదాపు రెండు బిలియన్ల యూజర్లను కలిగిన ఫేస్‌బుక్‌ ‘ప్రజాస్వామ్యంలో సోషల్‌మీడియా పాత్ర' అనే అంశంపై చర్చించింది. ఇకపై ఎన్నికల సమయంలో అనుమానిత అకౌంట్లను సస్పెండ్‌ చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది.

2016 యుఎస్ ఎన్నికల్లో

కాగా 2016 యుఎస్ ఎన్నికల్లో రష్యన్ ఏజెంట్లు దాదాపు 80వేల పోస్టులను 126 మిలియన్ల మందికి చేరేలా క్రియేట్ చేశారనే విషయాన్ని గుర్తు చేశారు. ఈ సమయంలో ఆ అకౌంట్లను గుర్తించే వాటిని ఏరివేసే దిశగా ముందు ముందు అడుగులు వేస్తామని ఫేస్‌బుక్ తెలిపింది.

ఎన్నికల యాడ్‌లను..

ఎన్నికల యాడ్‌లను ఎక్కువమందికి చేరేలా చూస్తామని చెప్పింది. అయితే, ఇందుకోసం యాడ్‌లు ఇచ్చే వారి దగ్గర నుంచి గుర్తింపును కోరనున్నట్లు తెలిపింది. కాగా, ఫేస్‌బుక్‌ బాటలోనే ట్విటర్‌, గూగుల్‌, యూట్యూబ్‌లు కూడా నడవనున్నాయి.

ఇటలీలో మార్చి 8న ఎన్నికలు..

కాగా ఇటలీలో మార్చి 8న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఫేస్‌బుక్ తమ చర్యలను వేగవంతం చేసింది. ఫేక్ న్యూస్ లు కనిపిస్తే వారిని తీసివేస్తోంది. ఆడియన్స్ లక్ష్యంగా ఫేక్ న్యూస్ లు క్రియేట్ చేస్తున్న వారి అకౌంట్లను బ్లాక్ చేసేందుకు నడుం బిగించింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Facebook says it can't guarantee social media is good for democracy More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot