Google Map Plus Code:లొకేషన్ షేర్ చేయడం మరింత సులభం...

|

గూగుల్ మ్యాప్స్ ఇప్పుడు కొత్తగా మరొక అప్ డేట్ ను అందుకుంది. ఇందులో భాగంగా వినియోగదారులు ప్లస్ కోడ్‌లను ఉపయోగించి ప్రస్తుతం వారు ఉన్న లొకేషన్ ను షేర్ చేయడాన్ని మరింత సులభతరం చేస్తుంది.

ఆండ్రాయిడ్ గూగుల్ మ్యాప్స్‌

ఆండ్రాయిడ్ గూగుల్ మ్యాప్స్‌

సరికొత్త అప్ డేట్ ద్వారా ఆండ్రాయిడ్ కోసం గూగుల్ మ్యాప్స్‌లో కొత్త మార్పులను తీసుకువచ్చింది. ముఖ్యంగా ఆగస్టు 2015 అప్ డేట్ నుండి గూగుల్ మ్యాప్స్‌కు ప్లస్ కోడ్‌లను చూపించే అవకాశం ఉంది. అయితే కొత్త మార్పు వినియోగదారులు తమ స్థానాలను సులభంగా పంచుకునేందుకు అనుమతించడం ద్వారా ప్లస్ కోడ్‌ల వాడకాన్ని విస్తరించడం లక్ష్యంగా పెట్టుకుంది. IOS వినియోగదారులు తాజా Google మ్యాప్స్ అప్ డేట్ ను ఎప్పుడు పొందుతారనే దానిపై ఎటువంటి సరైన సమాచారం ప్రస్తుతం అందుబాటులో లేదు. Infinix Hot 9 & 9 Pro: రూ.8,499 ధరకే ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్లు...

గూగుల్ మ్యాప్స్ క్రొత్త అప్ డేట్

గూగుల్ మ్యాప్స్ క్రొత్త అప్ డేట్

గూగుల్ మ్యాప్స్ యొక్క క్రొత్త అప్ డేట్ తో వినియోగదారులు వారి ప్రస్తుత స్థానాన్ని సూచించే నీలి బిందువును నొక్కడం ద్వారా ఆరు అంకెల ప్లస్ కోడ్‌ను షేర్ చేయడానికి గూగుల్ మ్యాప్స్ మిమ్మల్ని అనుమతిస్తుంది. అలాగే మీ యొక్క సమీప ప్రదేశాలను చూడటానికి, మీ స్థానాన్ని షేర్ చేయడానికి మరియు పార్కింగ్‌ను సేవ్ చేయడం వంటి అనుమతుల ఎంపికలతో మీరు ప్లస్ కోడ్‌ను వినియోగించవచ్చు. WhatsApp scam:వెరిఫికేషన్ కోడ్స్ పేరుతో మెసేజ్ వచ్చిందా!!!! జర జాగ్రత్త...

గూగుల్ మ్యాప్స్ ఆండ్రాయిడ్ అప్‌డేట్

గూగుల్ మ్యాప్స్ ఆండ్రాయిడ్ అప్‌డేట్

వినియోగదారులు వారి యొక్క లొకేషన్ ను షేర్ చేయడం కోసం ప్లస్ కోడ్‌ను నొక్కిన వెంటనే మీకు స్క్రీన్ పైన మ్యాప్ ఉద్భవించి చూపించిన తర్వాత, మీకు తెలిసిన వారికి షేర్ చేయడానికి దానిని కాపీ చేయడానికి క్లిప్‌బోర్డ్‌ యొక్క కోడ్‌ను నొక్కండి. తాజా అప్‌డేట్ షేరింగ్ లొకేషన్‌తో ఎవరికైనా ఫోన్ నంబర్ ఇవ్వడం కూడా చాలా సులభం అయిందని గూగుల్ తెలిపింది.

గూగుల్ మ్యాప్స్ ios అప్‌డేట్

గూగుల్ మ్యాప్స్ ios అప్‌డేట్

గూగుల్ మ్యాప్స్ యొక్క తాజా మార్పు ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే పరిమితం చేయబడింది. ఏదేమైనా iOS వినియోగదారులు ఒక నిర్దిష్ట ప్రదేశంలో పిన్ను వదలడానికి మ్యాప్‌ను నొక్కడం మరియు పట్టుకోవడం ద్వారా ఏదైనా ప్రదేశం యొక్క ప్లస్ కోడ్‌లను పొందవచ్చు. ఆండ్రాయిడ్ లోని గూగుల్ మ్యాప్స్ యూజర్లు పిన్ ను ఉపయోగించి ఒక నిర్దిష్ట ప్రదేశం యొక్క ప్లస్ కోడ్ ఇప్పుడు పొందవచ్చు.

గూగుల్ మ్యాప్స్ ప్లస్ కోడ్‌ ఉపయోగం

గూగుల్ మ్యాప్స్ ప్లస్ కోడ్‌ ఉపయోగం

సరైన చిరునామా కూడా లేని స్థలాన్ని కనుగొనడంలో ఎవరికైనా సహాయపడటానికి ప్లస్ కోడ్‌లను ఉపయోగించవచ్చు. ఇవి అక్షాంశం మరియు రేఖాంశ కోఆర్డినేట్ల నుండి తీసుకోబడిన సమాచారం ప్రకారం అడ్రస్ ను ట్రాక్ చేస్తుంది.

Best Mobiles in India

English summary
Google Maps New Update allows Users to Share Location Using Plus Codes

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X