Infinix Hot 9 & 9 Pro: రూ.8,499 ధరకే ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్లు...

|

ఇండియాలో గత రెండు సంవత్సరాలుగా స్మార్ట్ ఫోన్ రంగంలో మంచి గుర్తింపు పొందిన ఇన్ఫినిక్స్ సంస్థ ఇప్పుడు కొత్తగా మరొక రెండు స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసారు. ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో మరియు ఇన్ఫినిక్స్ హాట్ 9 పేరుతో సరికొత్త స్మార్ట్ ఫోన్లు బడ్జెక్ట్ ధరలో భారతదేశంలో ప్రారంభించబడ్డాయి.

ఇన్ఫినిక్స్ హాట్ 9 సిరీస్ లాంచ్

ఇన్ఫినిక్స్ హాట్ 9 సిరీస్ లాంచ్

ఈ రెండు ఫోన్‌లు వెనుక కెమెరా సెటప్‌లో దాదాపు ఒకేలాంటి స్పెసిఫికేషన్‌లతో వస్తాయి. ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో వెనుక భాగంలో క్వాడ్-ఎల్ఇడి ఫ్లాష్‌ మద్దతుతో 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను కలిగి ఉంది. అలాగే ఇన్ఫినిక్స్ హాట్ 9 కూడా ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండి 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఎల్ఇడి ఫ్లాష్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ల గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి. Samsung Exynos 880 5G Chip గురించి కొన్ని ముఖ్య విషయాలు....

ఇన్ఫినిక్స్ హాట్ 9 సిరీస్ ధరల వివరాలు

ఇన్ఫినిక్స్ హాట్ 9 సిరీస్ ధరల వివరాలు

ఇన్ఫినిక్స్ హాట్ 9 సిరీస్ స్మార్ట్ ఫోన్లు ఇండియాలో కేవలం ఒకే ఒక వేరియంట్ లో మాత్రమే లాంచ్ అయ్యాయి. ఇందులో ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో యొక్క 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర 9,499 రూపాయలు. మరోవైపు ఇన్ఫినిక్స్ హాట్ 9 యొక్క 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర 8,499 రూపాయలు. Realme Smart TV vs Xiaomi Mi TV 4A Pro: ఈ రెండింటిలో ఉత్తమమైనది ఇదే!!!!

లభ్యత వివరాలు

లభ్యత వివరాలు

ఇన్ఫినిక్స్ హాట్ 9 సిరీస్ యొక్క ఫోన్‌ల అమ్మకాలు ఫ్లిప్‌కార్ట్ ద్వారా మొదలుకానున్నాయి. ఇందులో ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో యొక్క మొదటి సేల్ జూన్ 5 మధ్యాహ్నం 12 గంటలకు షెడ్యూల్ చేయబడింది. అలాగే ఇన్ఫినిక్స్ హాట్ 9 యొక్క మొదటి సేల్ జూన్ 8 న మధ్యాహ్నం 12 గంటలకు షెడ్యూల్ చేయబడింది. ఇవి రెండు కూడా ఓషన్ బ్లూ మరియు వైలెట్ కలర్ ఎంపికలలో అందించబడతాయి.

ఇన్ఫినిక్స్ హాట్ 9 సిరీస్ స్పెసిఫికేషన్స్

ఇన్ఫినిక్స్ హాట్ 9 సిరీస్ స్పెసిఫికేషన్స్

ఇన్ఫినిక్స్ హాట్ 9 మరియు ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో రెండు డ్యూయల్ సిమ్ స్లాట్‌ (నానో + నానో) మద్దతుతో వస్తాయి. ఇవి ఆండ్రాయిడ్ 10-ఆధారిత XOS 6.0 లో రన్ అవుతాయి. రెండు ఫోన్‌లలో 720x1600 పిక్సెల్స్ పరిమాణంలో గల 6.6-అంగుళాల హెచ్‌డి + హోల్-పంచ్ LCD IPS డిస్ప్లే 20: 9 కారక నిష్పత్తి, 90.5 శాతం స్క్రీన్-టు-బాడీ-రేషియో, మరియు 480 నిట్స్ ప్రకాశంతో వస్తాయి. IMG PowerVR GE8320 GPU మరియు 4GB RAM తో జత చేసిన 2.0GH హెలియో పి 22 ఆక్టా-కోర్ ప్రాసెసర్ తో ఇవి పనిచేస్తాయి. ఇంటర్నల్ స్టోరేజ్ 64GB వద్ద ఉన్నాయి. ఇందులో గల ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ స్లాట్ మెమొరీని 256GB వరకు మరింత విస్తరించడానికి వీలుకల్పిస్తుంది.

ఇన్ఫినిక్స్ హాట్ 9 సిరీస్ కెమెరా సెటప్

ఇన్ఫినిక్స్ హాట్ 9 సిరీస్ కెమెరా సెటప్

ఇన్ఫినిక్స్ హాట్ 9 సిరీస్ యొక్క ఆప్టిక్స్ విషయానికొస్తే ఇవి రెండు కూడా వెనుకవైపు క్వాడ్ కెమెరా సెటప్ తో వస్తాయి. ఈ కెమెరా సెటప్ ఫోన్ వెనుక భాగంలో ఎడమవైపు ఎగువ మూలలో నిలువుగా సమలేఖనం పద్దతిలో అమర్చబడి ఉంటాయి. ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రోలో ఎఫ్ / 1.8 ఎపర్చరుతో 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా , 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కెమెరాలను కలిగి ఉన్నాయి. ఇవి తక్కువ లైట్ సెన్సార్లను కూడా కలిగి ఉన్నాయి. ప్రో మోడల్ లో క్వాడ్-ఎల్ఈడి ఫ్లాష్ ఉంటుంది. దీనికి విరుద్ధంగా ఇన్ఫినిక్స్ హాట్ 9 లో ఎఫ్ / 1.8 ఎపర్చరుతో 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. దీని యొక్క వెనుక భాగంలో ట్రిపుల్ ఎల్ఇడి ఫ్లాష్ ఉంది. కెమెరా లక్షణాలలో కస్టమ్ బోకె, AI HDR మరియు AI 3D బ్యూటీ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి.

ఇన్ఫినిక్స్ హాట్ 9 సిరీస్ సెన్సార్

ఇన్ఫినిక్స్ హాట్ 9 సిరీస్ సెన్సార్

ఇన్ఫినిక్స్ హాట్ 9 సిరీస్ యొక్క రెండు ఫోన్‌లలో ముందుభాగంలో ఎఫ్ / 2.0 ఎపర్చరు మరియు ఎల్‌ఇడి ఫ్లాష్ సపోర్ట్‌తో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ముందు కెమెరా స్క్రీన్ ఎడమ ఎగువ భాగంలో ఉంచిన రంధ్రం-పంచ్ కటౌట్ లోపల ఉంటుంది. ఫ్రంట్ కెమెరా మోడ్లలో AI పోర్ట్రెయిట్, AI 3D ఫేస్ బ్యూటీ, వైడ్-సెల్ఫీ మరియు AR అనిమోజీ ఉన్నాయి. ఇన్ఫినిక్స్ హాట్ 9 మరియు ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో లోపల 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంది. ఇది 30 గంటల టాక్‌టైమ్, 130 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్, 13 గంటల గేమింగ్ మరియు 19 రోజుల స్టాండ్‌బై సమయం వరకు కంపెనీ బ్యాటరీని గట్టిగా చెబుతుంది.

కనెక్టివిటీ

కనెక్టివిటీ

ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో మరియు ఇన్ఫినిక్స్ హాట్ 9 రెండు ఫోన్ల యొక్క వెనుకభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు సపోర్ట్ ఫేస్ అన్‌లాక్‌ ఫీచర్లను కలిగి ఉన్నాయి. కనెక్టివిటీ ఎంపికలలో ఇవి బ్లూటూత్ V5, 3.5mm ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో, యుఎస్బి ఓటిజి, వోవైఫై మరియు మైక్రో యుఎస్బి పోర్ట్ ఉన్నాయి. బోర్డులో సెన్సార్లలో జి-సెన్సార్, ఇ-కంపాస్, గైరోస్కోప్, సామీప్య సెనర్ మరియు యాంబియంట్ లైట్ సెన్సార్ ఉన్నాయి. ఫోన్లు DTS సరౌండ్ సౌండ్‌కు మద్దతు ఇస్తాయి.

Best Mobiles in India

English summary
Infinix Hot 9, Infinix Hot 9 Pro Launched in India: Price, Specs, Features and Sale Date Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X