యూజర్లకు పేటీఎమ్ బంపరాఫర్

Written By:

పేటీఎం వాడుతున్న యూజర్లకు కంపెనీ బంఫరాఫర్ ప్రకటించింది. ఆ సంస్థకు చెందిన వాలెట్ యాప్ ఉన్న ఫోన్ పోయినా లేదంటే వాలెట్ నుంచి డబ్బు తస్కరించబడినా అందుకు గాను పేటీఎం ఇన్సూరెన్స్‌ను అందిస్తోంది. ఇవాళ్టి నుంచే ఈ ఇన్సూరెన్స్ అందుబాటులోకి వచ్చిందని పేటీఎం ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. పేటీఎంలో ఉన్న యూజర్లందరికీ ఈ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది.

ఐఫోన్ 7 రెడ్ కలర్ వేరియంట్ వెనుక రహస్యం..?

యూజర్లకు పేటీఎమ్ బంపరాఫర్

దీనికి వారు ఎటువంటి చార్జి చెల్లించాల్సిన అవసరంలేదని, ఇన్సూరెన్స్ పూర్తిగా ఉచితమని వారు తెలిపారు. పేటీఎం వాలెట్‌ను వాడుతున్న యూజర్లందరికీ ఈ ఇన్సూరెన్స్ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అయిందని వారు పేర్కొన్నారు. ఎలా క్లయిమ్ చేయాలో ఓ సారి చూద్దాం.

షియోమి కొత్త షాక్ : సెకనుకో ఫోన్ తయారీ, అదీ ఏపీలో

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

24 గంటల్లోగా ఫిర్యాదు

పేటీఎం అందిస్తున్న ఇన్సూరెన్స్ ద్వారా యూజర్లు సంవత్సరానికి ఒక క్లెయిమ్ చేసుకోవచ్చు. డివైస్ పోయినా, పేటీఎం వాలెట్‌లో ఉన్న డబ్బు దొంగిలించబడినా పేటీఎం కస్టమర్ కేర్ నంబర్ +91 9643 979797 కు వినియోగదారుడు 24 గంటల్లోగా ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.

పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్

ఒక వేళ డివైస్ పోతే యూజర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం పేటీఎం ఆ ఫిర్యాదును స్వీకరించి 5 రోజుల్లోగా తస్కరించబడిన మొత్తాన్ని యూజర్ వాలెట్‌కు ట్రాన్స్‌ఫర్ చేస్తుంది.

అన్ని వివరాలను పరిశీలించాకే

అన్ని వివరాలను పరిశీలించాకే పేటీఎం డబ్బును ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. ఈ క్రమంలో యూజర్‌కు చెందిన పేటీఎం వాలెట్ 5 రోజుల పాటు బ్లాక్ అవుతుంది.

ఆ పైన కొత్త పాస్‌వర్డ్‌

ఆ పైన కొత్త పాస్‌వర్డ్‌ను పేటీఎం ఇస్తుంది. దాంతో యూజర్ మళ్లీ అకౌంట్‌లోకి లాగిన్ అయితే అప్పుడు పోయిన డబ్బును తిరిగి పొందవచ్చు.

రూ.20వేల వరకు మాత్రమే

అయితే పేటీఎం ఇలా గరిష్టంగా రూ.20వేల వరకు మాత్రమే యూజర్‌కు అందిస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Paytm Introduces Free Wallet Insurance Cover For Its Users read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot