త్వరలో వాట్సప్ గ్రూప్ వాయిస్ కాల్స్

Written By:

వాట్సప్ యూజర్లకు కంపెనీ గుడ్ న్యూస్ చెప్పబోతోంది. ఆండ్రాయిడ్ లేటెస్ట్ బీటా వర్షన్‌లో గ్రూప్ వాయిస్ కాల్స్ ఫీచర్ వస్తున్నట్లు వాట్సప్ సంస్థ ప్రకటించింది. వాట్సప్ 2.17.70 బీటా అప్‌డేట్.. ఈ గ్రూప్ కాల్స్ ఫీచర్‌ను అందుబాటులోకి తేనున్నది. అయితే గ్రూప్ వీడియో కాల్స్ విషయంలో మాత్రం ప్రస్తుతానికి కంపెనీ ఎటువంటి స్పష్టత రాలేదు. వచ్చే ఏడాది గ్రూప్ వాయిస్ కాల్స్‌ను తీసుకురానున్నట్లు మొదట్లో వార్తలు వచ్చాయి. అది కార్యరూపం దాల్చే దిశగా అడుగుల పడుతున్నాయి. ఫేస్‌బుక్ మెసెంజర్‌లో ఇప్పటికే ఇలాంటి ఫీచర్ ఉంది.

రూ. 6 వేలకే నోకియా 2, లీకేజి సంచలనం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అప్‌డేట్స్..

ఈ కొత్త బీటా వర్షన్‌లో యాప్ సైజ్ తగ్గడం, మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా నంబర్ చేంజ్ చేస్తే నోటిఫికేషన్ ఇవ్వడంలాంటి అప్‌డేట్స్ కూడా ఉన్నాయి.

మరికొన్ని ఫీచర్స్ యాడ్..

గ్రూప్ మేనేజ్‌మెంట్‌ను మరింత మెరుగ్గా చేయడానికి మరికొన్ని ఫీచర్స్ యాడ్ చేసినట్లు వాట్సప్ తెలిపింది. గ్రూప్‌లోని ఇతర అడ్మినిస్ట్రేటర్లు.. గ్రూప్ క్రియేటర్‌ను తీసేయకుండా చేసే ఫీచర్ కూడా ఇందులో ఒకటి

గ్రూప్ సబ్జెక్ట్, ఐకాన్‌లాంటివి ..

ఇక గ్రూపులోని ఇతర పార్టిసిపెంట్స్‌కు గ్రూప్ సబ్జెక్ట్, ఐకాన్‌లాంటివి మార్చే అవకాశం ఇవ్వాలా వద్దా అన్నది కూడా అడ్మినిస్ట్రేటర్స్ నిర్ణయించవచ్చు.

అన్‌సెండ్ ఫీచర్ కూడా త్వరలోనే..

అటు చాలా రోజులుగా యూజర్లు ఎదురు చూస్తున్న అన్‌సెండ్ ఫీచర్ కూడా త్వరలోనే రానున్నట్లు వాట్సప్ వెల్లడించింది. డిలిట్ ఫర్ ఎవరివన్ ఫీచర్‌ని కూడా వాట్సప్ టెస్ట్ చేస్తున్నట్లు వాబీటాఇన్ఫో వెబ్‌సైట్ తెలిపింది.

ఐదు నిమిషాల్లోపు వెనక్కి తీసుకొనే వీలు..

ఈ ఫీచర్ సాయంతో యూజర్లు తాము పంపిన టెక్ట్స్, ఇమేజెస్, వీడియోలు, డాక్యుమెంట్లను ఐదు నిమిషాల్లోపు వెనక్కి తీసుకొనే వీలు కలుగుతుంది. .

ఇన్‌స్టాంట్ మనీ ట్రాన్స్‌ఫర్..

ఇక యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ ద్వారా ఇన్‌స్టాంట్ మనీ ట్రాన్స్‌ఫర్ అవకాశాన్ని కూడా త్వరలోనే వాట్సప్ అందించనుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
whatsApp testing group video and voice calls, official roll out soon More News At Gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot