ఇవి కంప్యూటర్లా లేక చెత్త కుప్పాలా..?
పట్టించుకోకపోతే అంతే సంగతులు
వ్యక్తిగత కంప్యూటర్లకు సంబంధించి లోపలా ఇంకా బయట భాగాలను శుభ్రపరిచి విషయంలో నిర్లక్ష్యం వహించినట్లయితే చోటుచేసుకునే అనర్థాలను ఈ కధనం రూపంలో ఉదాహరణగా చూపుతున్నాం.
Read More : రెడ్మీ నోట్ 4 కోసం చూస్తున్నారా..?

ఫోటో 1
పర్సనల్ కంప్యూటర్‌ల క్లీనింగ్ విషయంలో నిర్లక్ష్యం వహించినట్లయితే లోపలి కాంపోనెంట్స్ దెబ్బతినే అవకాశం ఉంది.

ఫోటో 2
కంప్యూటర్ లోపలి భాగాల్లో దుమ్ము అతిగా పేరుకుపోవటం వల్ల పీసీ పనితీరు మందగిస్తుంది. ఎక్స్‌టర్నల్ ఫ్యాన్ భాగం దెబ్బతింటుంది. దుమ్ము అతిగా పేరుకుపోవటం కారణంగా సీపీయూ లోపలి భాగంలో వేడి ఉష్ణోగ్రతలు అధికమై పీసీ మధ్యమధ్యలో ఆగిపోవటం మొదలుపెడుతుంది.

ఫోటో 3
ముందుగా కంప్యూటర్ క్లీనింగ్ కు అవసరమైన టూల్స్ ను సిద్ధం చేసుకోండి. తురువాతి చర్యగా మీ పీసీని షట్‌డౌన్ చేయండి. కంప్యూటర్ కున్న అన్ని కనెక్షన్ లను తొలగించండి. ఇప్పుడు సీపీయూను పనికి అనుకూలమైన ప్రాంతానికి తీసుకువెళ్లండి.

ఫోటో 4
స్ర్కూడ్రైవర్ సాయంతో కంప్యూటర్‌ను ఓపెన్ చేయండి. లోపలి భాగాలను చేతితో టచ్ చేయవద్దు. దుమ్ముతో పేరుకుపోయి ఉన్నలోపలి భాగాలను బ్రష్ లేదా ఎయిర్ కంప్రెసర్ సాయంతో పూర్తిగా శుభ్రం చేయండి.

ఫోటో 5
పని పూర్తి అయిన అనంతరం సీపీయూలో ఓపెన్ చేసిన భాగాలను జాగ్రత్తగా బిగించేసి యథా స్థానానికి తీసుకువచ్చేయండి. ఇప్పుడు మీ కంప్యూటర్ సౌకర్యవంతంగా స్పందిస్తుంది.


Click it and Unblock the Notifications








