స్మార్ట్ టీవీలు వాడుతున్నారా..బికేర్ పుల్

Written By:

ప్రతి ఒక్కరి ఇంట్లో ఇప్పుడు స్మార్ట్ గాడ్జెట్లు ఎక్కువ అయిపోయాయి. ముఖ్యంగా స్మార్ట్ టీవీలు ప్రతి ఒక్కరి ఇంట్లో కామన్ అయిపోయాయన్నది నగ్న సత్యం. అయితే ఈ స్మార్ట్ టీవీలతో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు. ఓ కంపెనీ స్మార్ట్‌ టీవీల్లో బయటపడ్డ రహస్యం గురించి తెలిస్తే ఎంత జాగ్రత్తగా ఉండాలనేది మీకే తెలుస్తుంది.

ఇకపై పాస్‌వర్డ్‌లు చెబితేనే అమెరికా వీసా

స్మార్ట్ టీవీలు వాడుతున్నారా..బికేర్ పుల్

అమెరికాలో బాగా పాపులరైన 'విజియో' సంస్థ తయారు చేసిన స్మార్ట్‌ టీవీలు వీక్షకులపై నిఘా పెడుతున్నట్లు తేలింది. వినియోగదారులు తెలియజేసేందుకు ఇష్టపడని వివరాలనూ ఆ టీవీ ద్వారా తయారీ సంస్థ సేకరిస్తున్నట్లు ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌ గుర్తించింది. వీక్షకులు ఏ ప్రాంతంలో ఉన్నారు? వాళ్లు ఏ సమయంలో ఏ కార్యక్రమాలు చూస్తారు? తదితర వివరాలన్నింటినీ క్షణం క్షణం ఆ టీవీలు స్మార్ట్‌గా సేకరించి తయారీదారుల సర్వర్లకు చేరవేస్తున్నాయట.

బడ్జెట్ రేంజ్‌లో మార్కెట్లోకి మరో కొత్త 4జీ వోల్ట్ ఫోన్

స్మార్ట్ టీవీలు వాడుతున్నారా..బికేర్ పుల్

అలా దాదాపు కోటి పది లక్షల టీవీల ద్వారా సేకరించిన డేటాను మార్కెటింగ్‌ కంపెనీలకు అమ్మి సొమ్ము చేసుకుంటోందట ఆ సంస్థ.ఈ ఆగడాలను పసిగట్టిన అమెరికాలోని ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌ కోర్టులో లాసూట్‌ వేసింది. దాంతో న్యూజెర్సీ డిస్ట్రిక్‌ కోర్టు విజియో సంస్థకు 22లక్షల డాలర్లు(రూ.14.81కోట్లు) జరిమానా విధించింది. అందుకు ఆ సంస్థ కూడా అంగీకరించక తప్పలేదు. సో మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి మరి.

 

 

English summary
Most smart TVs are tracking you — Vizio just got caught read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting