షియోమి సంచలనం, రూ. 13 వేలకే 32 అంగుళాల స్మార్ట్‌టీవి..

|

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో దూసుకుపోతున్న చైనా దిగ్గజం ఎలక్ట్రానిక్ రంగంలోనూ దూసుకుపోతోంది. ఇటీవలే టెలివిజన్‌ మార్కెట్‌లో ప్రవేశించి సంచలనం సృష్టించిన షియోమి టీవీ మార్కెట్‌లోను తన మార్క్‌ కోసం తనదైన ముద్ర కోసం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే రూ. 40 వేలకు 55 అంగుళాల స్మార్ట్‌ టీవీని లాంచ్‌ చేసి ప్రముఖ కంపెనీల గుండెల్లో దడ పుట్టించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇదే ఊపులో భారత టీవీ మార్కెట్‌ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న షియోమి మధ్య తరగతి ప్రజలను లక్ష్యంగా చేసుకొని మిడ్‌ రేంజ్‌ టీవీలను లాంచ్‌ చేయనుంది. ఇందులో భాగంగానే 15వేల కంటే తక్కువ ధరలో 32 అంగుళాల టీవీని మార్కెట్లోకి విడుదల చేసే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం.

 

పోర్న్ వీడియోలు చూస్తున్నారా, ఇకపై మీ మొబైల్‌ని సేఫ్‌గా ఉంచుకోవచ్చు !పోర్న్ వీడియోలు చూస్తున్నారా, ఇకపై మీ మొబైల్‌ని సేఫ్‌గా ఉంచుకోవచ్చు !

 ఐగ్యాన్‌ ప్రచురించిన కథనం ప్రకారం

ఐగ్యాన్‌ ప్రచురించిన కథనం ప్రకారం

ప్రముఖ టెక్నాలజీ వార్తా సంస్థ ఐగ్యాన్‌ ప్రచురించిన కథనం ప్రకారం హైడెఫినేషన్‌ క్వాలీటీతో రూ.12,999లకే 32 అంగుళాల స్మార్ట్‌ టీవీని షియోమి ఇండియా మార్కెట్లోకి తీసుకురానుందని తెలుస్తోంది. ఇందులో 1జీబీ ర్యామ్‌తో పాటు 4జీబీ ఇంటర్నల్‌ మెమెరీని నిక్షిప్తం చేసినట్లు తెలిపింది.

రూ.21,999లకే 43 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ టీవీ

రూ.21,999లకే 43 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ టీవీ

దీంతో పాటు రూ.21,999లకే 43 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ టీవీని అందిస్తున్నట్లు ఆ కధనంలో పేర్కొంది. ఇందులో 2జీబీ ర్యామ్‌, 8జీబీ ఇంటర్నల్‌ మెమోరీ అందుబాటులో ఉంటాయని ఐగ్యాన్‌ తెలిపింది. అంతేకాకుండా బ్లూటూత్‌ 4.2 వెర్షన్‌, వైఫై సౌకర్యం కూడా ఇందులో ఉన్నట్లు పేర్కొంది.

32 అంగుళాల టీవీ ఫీచర్లు
 

32 అంగుళాల టీవీ ఫీచర్లు

స్క్రీన్‌: 32 అంగుళాలు
ర్యామ్‌: 1జీబీ
ఇంటర్నల్‌ మెమెరీ : 4జీబీ
ఆపరేటింగ్‌ సిస్టమ్‌ : ప్యాచ్‌ (ఆండ్రాయిడ్‌)
వీడియో టైప్‌ : ఫుల్‌ హెచ్‌డీ
ధర : రూ.12, 999 (అంచనా)

43 అంగుళాల టీవీ ఫీచర్లు

43 అంగుళాల టీవీ ఫీచర్లు

స్క్రీన్‌: 43 అంగుళాలు
ర్యామ్‌: 2జీబీ
ఇంటర్నల్‌ మెమెరీ : 8జీబీ
ఆపరేటింగ్‌ సిస్టమ్‌ : ప్యాచ్‌ (ఆండ్రాయిడ్‌)
వీడియో టైప్‌ : ఫుల్‌ హెచ్‌డీ, 4కే
ధర : రూ.21, 999 (అంచనా)

Mi TV 4

Mi TV 4

షియోమి నుంచి వచ్చిన ఎంఐ టీవీ 4 (Mi TV 4) మార్కెట్లో రికార్డు అమ్మకాలతో దూసుకుపోతోంది. ఫ్లాష్ సేల్ కు వచ్చిన ప్రతీసారి ఈ టీవీ దుమ్మురేపుతోంది. నిమిషాల వ్యవధిలోనే అమ్ముడుపోతున్నాయి. రెండు ఫ్లాష్ సేల్ లు జరపగా నిమిషాల వ్యవధిలోనే అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యాయి. ఎంఐ టీవీ 4కు సంబంధించిన తదుపరి సేల్ మార్చి 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు జరుగుతుంది. ఈ సంచలన స్మార్ట్ టీవీని Flipkartతో పాటు షావోమి అఫీషియల్ ఆన్‌లైన్ స్టోర్ అయిన Mi.comలు ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తున్నాయి. ధర రూ.39,999. ఫ్లిప్‌కార్ట్ యూజర్లు ఈ టీవీని కొనుగోలు చేసే సమయంలో యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డును ఉపయోగించుకోవటం ద్వారా 5శాతం అదనపు క్యాష్‌బ్యాక్‌ను పొందే వీలుంటుంది.

55 అంగుళాల సామ్‌సంగ్ హెచ్‌డిఆర్ స్ర్కీన్‌

55 అంగుళాల సామ్‌సంగ్ హెచ్‌డిఆర్ స్ర్కీన్‌

ఎంఐ టీవీ 4, 55 అంగుళాల హెచ్‌డిఆర్ స్ర్కీన్‌తో వస్తోంది. ఈ ప్యానల్‌ను సామ్‌సంగ్ అభివృద్ధి చేసింది. ఇందులో 3840x2160 పిక్సల్ రిసల్యూషన్ క్వాలిటీతో కూడిన కస్టమ్ బిల్ట్ సామ్‌సంగ్ 4కే సుపీరియర్ వెర్టికల్ అలైన్‌మెంట్ డిస్‌ప్లే పొందుపరచబడి ఉంటుంది. 4కే రిసల్యూషన్ సపోర్ట్‌ను ఈ టీవీ ఆఫర్ చేయగలుగుతుంది. 4.9 మిల్లీమీటర్ల పలుచటి స్ర్కీన్‌తో వస్తోన్న ఈ స్మార్ట్ టెలివిజన్ సెట్‌ను ప్రపంచంలోనే అతి నాజూకైన టీవీగా షావోమి అభివర్ణిస్తోంది.

Mi TV 4 స్సెసిఫికేషన్స్..

Mi TV 4 స్సెసిఫికేషన్స్..

స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చేసరికి ఎంఐ టీవీ 4, ARM Cortex A53 చిప్‌సెట్‌తో కూడిన క్వాడ్ కోర్ ప్రాసెసర్ పై రన్ అవుతుంది. 2జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వంటి స్టాండెర్డ్ ఫీచర్స్ ఈ టీవీలో ఉన్నాయి. కనెక్టువిటీ విషయానికి వచ్చేసరికి, ఈ టీవీలో రెండు యూఎస్బీ పోర్ట్స్‌తో పాటు మూడు హెచ్‌డిఎమ్ఐ పోర్ట్స్ అందుబాటులో ఉంటాయి.

డాల్బీ సౌండ్ ఎక్స్‌పీరియన్స్...

డాల్బీ సౌండ్ ఎక్స్‌పీరియన్స్...

వై-ఫైకు సులువుగా కనెక్ట్ అయ్యే విధంగా Ethernet పోర్ట్ ను కూడా ఈ టీవీలో సెటప్ చేయటం జరిగింది. బ్లుటూత్ కనెక్టువిటీని కూడా ఈ టీవీ సపోర్ట్ చేస్తుంది. డాల్బీ సౌండ్ నిమిత్తం రెండు 8వాట్ స్పీకర్లను ఈ టీవీలో షావోమి నిక్షిప్తం చేసింది.

Best Mobiles in India

English summary
Xiaomi to launch new Mi TVs for Rs 12,999 and Rs 21,999 this month More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X