మీ ఫోన్‌లో జీపీఎస్ సిగ్నల్ వీక్‌గా ఉందా..?

Written By:

నేటితరం స్మార్ట్‌ఫోన్‌లలో ఉండాల్సిన ముఖ్యమైన ఫీచర్లలో జీపీఎస్ ఒకటి. శాటిలైట్ ఆధారంగా స్పందించే ఈ నావిగేషన్ వ్యవస్థ పూర్తి పేరు గ్లోబల్ పొజీషనింగ్ సిస్టం (Global Positioning System).

మీ ఫోన్‌లో జీపీఎస్ సిగ్నల్ వీక్‌గా ఉందా..?

జీపీఎస్ ఫీచర్ మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉంటే చాలు దారి తెలియకపోయినా ఎక్కడికైనా సలువుగా వెళ్లిపోవచ్చు. జీపీఎస్ ఫీచర్, మ్యాపింగ్ ద్వారా మనం చేరుకోవల్సిన గమ్యాన్ని మలుపులతో సహా చూపిస్తుంది. జీపీఎస్ సిస్టంను 24 ఉపగ్రహాల సహకారంతో అమెరికా అభివృద్థి చేసింది. ఈ ఉపగ్రహాలు భూమిని మొత్తం కవర్ చేస్తూ శాటిలైట్ ద్వారా సమాచారాన్ని ప్రతి ఒక్కరికి చేరువ చేస్తుంటాయి.

బెస్ట్ ఫిట్నెస్ యాప్స్

కొన్ని స్మార్ట్‌ఫోన్‌లలో జీపీఎస్ ఫీచర్ ఫేలవమైన పనితీరును కనబరుస్తుంటుంది. ఈ సమస్యకు ఫోన్ హార్డ్‌వేర్ ప్రధాన కారణం కావొచ్చు. మీ స్మార్ట్‌‍ఫోన్‌లలో జీపీఎస్ పనితీరును మరింత మెరుగుపరుచుకునేందుకు పలు ముఖ్యమైన చిట్కాలు....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీ ఫోన్‌లో జీపీఎస్ సిగ్నల్ వీక్‌గా ఉందా..?

ఫోన్ సెట్టింగ్స్‌లోని High Accuracy మోడ్‌ను ఎనేబుల్ చేసుకోవటం ద్వారా జీపీఎస్ పనితీరును మెరుగుపరుచుకోవచ్చు.

మీ ఫోన్‌లో జీపీఎస్ సిగ్నల్ వీక్‌గా ఉందా..?

High Accuracy మోడ్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లో యాక్టివేట్ చేసుకోవాలంటే ముందుగా ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. ఆ తరువాత లోకేషన్ సర్వీసును టర్న్ ఆన్ చేసుకోండి. ఇక్కడ కనిపించే Location Sources categoryలో High Accuracy మోడ్‌ను సెలక్ట్ చేసుకోవటం ద్వారా జీపీఎస్ సిగ్నల్ సామర్థ్యం మరింత రెట్టింపు అవుతుంది.

మీ ఫోన్‌లో జీపీఎస్ సిగ్నల్ వీక్‌గా ఉందా..?

గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉన్న GPS Essentials  ఫీచర్‌ను మీ ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకోవటం ద్వారా జీపీఎస్ పనితీరును మరింత మెరుగుపరుచుకోవచ్చు.

 

మీ ఫోన్‌లో జీపీఎస్ సిగ్నల్ వీక్‌గా ఉందా..?

GPS Essential యాప్‌ను ఇన్ స్టాల్ చేసుకున్న తరువాత కూడా జీపీఎస్ సిగ్నల మందకొడిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ ఫోన్‌లో హార్డ్‌వేర్ లేదా సాఫ్ట్‌వేర్ సమస్యలు ఉన్నట్లే.

 

మీ ఫోన్‌లో జీపీఎస్ సిగ్నల్ వీక్‌గా ఉందా..?

మార్కెట్లో అందుబాటులో ఉన్న GPS Status & Toolbox యాప్స్ మీ జీపీఎస్ డేటాను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ జీపీఎస్ డేటాను ఎప్పటికప్పుడు రీఫ్రెష్ చేస్తాయి.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
In this post you'll get to know how you can improve your GPS performance in few easy tips and apps. Read on to know more.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot