అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ను రద్దు చేయడం ఎలా?

|

అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ పొందడానికి చాలా కారణాలు ఉన్నాయి. వేగవంతమైన డెలివరీ వంటి విషయాలను పక్కన పెడితే ఇది మీకు ప్రైమ్ వీడియో మరియు ప్రైమ్ మ్యూజిక్ నుండి ఉచితంగా వీడియో, మ్యూజిక్ స్ట్రీమింగ్ ను అందిస్తుంది. అంతేకాకుండా కిండ్ల్ బుక్స్ మరియు ఇతర ప్రోత్సాహకాలను కూడా ఉచితంగా అందిస్తుంది.

అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్

కానీ అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ అందించడానికి US లో ఉండేవారు నెలకు $99 10.99, ఇండియాలో నెలకు రూ.129 సంవత్సరానికి రూ.999. అలాగే UK లో సంవత్సరానికి £79 చెల్లించవలసి ఉంటుంది. ఇది ఇప్పుడు ఆస్ట్రేలియాలో నెలకు AU $ 4.99 పరిచయ ధర కోసం అందుబాటులో ఉంది.

అమెజాన్

ఒక సంవత్సరానికి మీరు వెచ్చించే డబ్బులు విలువైనవిగా మీకు అనిపించకపోతే మీ యొక్క అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ను ఎలా రద్దు చేయాలో మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. అందువల్ల అమెజాన్ ప్రైమ్‌ను వదిలించుకోవడం ఎలానో తెలియక సతమత మవుతున్నారా? అయితే దానిని ఎలా కాన్సల్ చేయాలో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ రద్దు చేయడం ఎలా?

అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ రద్దు చేయడం ఎలా?

**** అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ను ఇప్పుడు రద్దు చేయడం నిజంగా చాలా సులభం. మొదట మీరు వెబ్ పేజీలో మీ యొక్క అకౌంట్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వండి. తరువాత మీ బ్రౌజర్ యొక్క కుడివైపు ఎగువన మూలలో ఉన్న ‘మీ అకౌంట్' బటన్‌పై హోవర్ చేసి డ్రాప్ డౌన్ లోని మెను నుండి ‘మీ ప్రైమ్ మెంబర్‌షిప్' ఎంచుకోండి.


*** మీకు చెల్లింపు మెంబర్ షిప్ ఉంటే కనుక పేజీ యొక్క ఎడమ వైపున ఉన్న ‘ఎండ్ మెంబర్‌షిప్' పైన క్లిక్ చేయండి. ఫ్రీ డెలివరీ లేదా ప్రైమ్ వీడియో వంటి అమెజాన్ ప్రైమ్ ప్రయోజనాలను మీరు ఉపయోగించకపోతే అప్పుడు మీరు పూర్తిగా డబ్బులు వాపసు పొందడం కోసం అర్హులు అవుతారు.

*** మీరు అమెజాన్ ప్రైమ్ యొక్క కొన్ని లక్షణాలను ఉపయోగించనప్పటికీ అన్నింటికీ కాకపోయినా వాటి ఆధారంగా పాక్షిక వాపసు కోసం మీరు ఇంకా అర్హులు అవుతారు.

 

అమెజాన్ ప్రైమ్ ఫ్రీ ట్రయిల్ ను  ఎలా రద్దు చేయాలి?

అమెజాన్ ప్రైమ్ ఫ్రీ ట్రయిల్ ను ఎలా రద్దు చేయాలి?

** మీరు అమెజాన్ ప్రైమ్ యొక్క ఫ్రీ ట్రయల్‌ను రద్దు చేయాలనుకుంటే మునుపటిలా ‘మీ ప్రైమ్ మెంబర్‌షిప్' ను ఎంచుకోండి. కానీ ఈసారి మీరు మీ బ్రౌజర్ విండో యొక్క ఎడమ వైపున ఉన్న ‘ఫ్రీ ట్రయల్‌ను కాన్సల్ చేయండి లేదా కొనసాగించవద్దు' పై క్లిక్ చేయాలి.

** ఈ సందర్భంలో ‘కొనసాగించవద్దు' ఎంచుకోవడం ఉత్తమం. ఎందుకంటే మీరు మీ ఫ్రీ ట్రయల్ వ్యవధి ముగిసే వరకు అమెజాన్ ప్రైమ్‌ను ఉపయోగించుకోగలుగుతారు. ఆ తర్వాత మీ ప్రైమ్ మెంబర్‌షిప్ ముగుస్తుంది. మీ విచారణను ప్రారంభించేటప్పుడు మీరు వివరాలను అందించిన బ్యాంక్ కార్డు నుండి ఈ సందర్భంలో డబ్బులు వసూలు చేయబడదు.

** మీ అకౌంట్ లోని ‘కొనసాగించవద్దు' విభాగంలో 'రిమైండ్ మి లేటర్' (‘తర్వాత నాకు గుర్తు చేయి') ఎంచుకోవడం ద్వారా మీరు పునరుద్ధరణ రిమైండర్‌ను కూడా సెట్ చేయవచ్చు. ఫ్రీ ట్రయల్ ముగిసిన తర్వాత మీ అకౌంట్ ను రద్దు చేయాలని మీరు ప్లాన్ చేస్తే మీ స్మార్ట్‌ఫోన్‌లో రిమైండర్‌ను సెట్ చేయడం ఎల్లప్పుడూ విలువైనదిగా ఉంటుంది.

 

ప్రైమ్ వీడియోను కొనసాగించాలనుకుంటే?

ప్రైమ్ వీడియోను కొనసాగించాలనుకుంటే?

అమెజాన్ ప్రైమ్ అందిస్తున్న ప్రతిష్టాత్మక మూవీస్ మరియు వెబ్ సిరీస్ వంటి షోలకు యాక్సిస్ ను నిలుపుకోవాలనుకుంటే మీరు మీ అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని ప్రైమ్ వీడియో సభ్యత్వానికి మార్చవచ్చు. మీరు ప్రైమ్ డెలివరీ హక్కులు మరియు అమెజాన్ మ్యూజిక్‌లను కోల్పోతారు. అయితే దీని కోసం కొద్ది మొత్తంలో ఖర్చు చేయవలసి ఉంటుంది.

Best Mobiles in India

English summary
How to Remove your Amazon Prime Membership

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X