Home
Mobile

RS.1000ల ధర తగ్గిన ఒప్పో A9 2020 స్మార్ట్‌ఫోన్‌

ఒప్పో A9 2020 ప్రారంభించి దాదాపు ఒక నెల అవుతోంది. ఈ నెల లోపే దీపావళి పండుగ సందర్బంగా దాని ధరను తగ్గించింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క 4 జీబీ ర్యామ్ వేరియంట్‌ మీద రూ.1,000ల ధరను తగ్గించింది. ఒప్పో సంస్థ ధరను తగ్గించిన తరువాత ఇప్పుడు దీని ధర రూ.15,990లు. ఈ కొత్త ధర వద్ద ఇప్పుడు అమెజాన్ ఇండియాలో మొబైల్ ను కొనుగోలు చేయవచ్చు.

తగ్గింపు ధరల వివరాలు

తగ్గింపు ధరల వివరాలు

ధర తగ్గింపు తరువాత ఒప్పో A9 2020 4 జిబి ర్యామ్ వేరియంట్‌ ధర రూ. 15,990. నెల ముందు రిలీజ్ అయినప్పుడు దాని అసలు ధర రూ. 16,990. గత నెలలో ప్రారంభించినప్పటి నుండి ఇది మొదటి ధర తగ్గింపు. ఈ తగ్గింపు ధరలు శాశ్వతమని ఒప్పో సంస్థ ధృవీకరించింది. అలాగే 8 జీబీ ర్యామ్ వేరియంట్‌కు అదే ధర రూ.19,990 వద్ద కొనసాగుతున్నది.

లభ్యత

లభ్యత

ఒప్పో A9 2020 మొబైల్ యొక్క 4 జిబి ర్యామ్ వేరియంట్‌ను అమెజాన్ ఇండియా ద్వారా కొత్త ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఒప్పో A9 2020 యొక్క ధరల తగ్గింపు ఆఫ్‌లైన్ మార్కెట్లకు కూడా వర్తిస్తుందని ముంబైకి చెందిన రిటైలర్ మహేష్ టెలికాం ట్వీట్ ద్వారా ధృవీకరించాడు. అమెజాన్ ఇండియా ప్రస్తుతం నో-కాస్ట్ EMI ఆప్షన్స్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్లను అందిస్తోంది. ఫోన్ మెరైన్ గ్రీన్ మరియు స్పేడ్ పర్పుల్ కలర్ ఆప్షన్లలో జాబితా చేయబడింది.

 

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

 ఒప్పో A9 2020 స్మార్ట్‌ఫోన్‌ 6.5-అంగుళాల అతి పెద్ద HD + డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఇది నానో-వాటర్‌డ్రాప్ స్క్రీన్‌ మద్దతును కలిగి ఉంటుంది. దీని యొక్క డిస్ప్లే పెద్దగా ఉండడం వలన సెల్ఫీ స్నాపర్‌ను చక్కగా కలిగి ఉంటుంది. డిస్ప్లే అద్భుతమైన 89% స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో వస్తుంది. ఈ పెద్ద డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3+ ప్రొటెక్షన్ ద్వారా పైన కవర్ చేయబడి ఉంటుంది. స్క్రీన్ స్పష్టంగా ఉంటుంది మరియు చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. అందువలన పగటి పూట సూర్యకాంతి వెలుగులో ఫోన్లో కంటెంట్‌ను చూడటానికి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. OPPO A9 2020 తో 'బ్లూ షీల్డ్' సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా కలిగి ఉంది. ఇది రాత్రి సమయంలో సురక్షితమైన వీక్షణ అనుభవం కోసం హానికరమైన నీలి కిరణాల నుండి మీ కళ్ళను రక్షిస్తుంది.

కెమెరాలు

కెమెరాలు

ఒప్పో A9 2020 స్మార్ట్‌ఫోన్‌ యొక్క కెమెరాల విషయానికి వస్తే ఇది ప్రస్తుతం అందరికి తెలిసిన క్వాడ్-కెమెరా సెటప్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో కెమెరాలు వెనుకవైపు ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో నిలువుగా అమర్చబడి ఉంటాయి. ఇందులో మొదటిది ప్రైమరీ కెమెరా 48MP ప్రైమరీ సెన్సార్‌తో పాటు శామ్‌సంగ్ GM1 లెన్స్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా కెమెరా సెటప్‌లో 8MP అల్ట్రా-వైడ్ (119 డిగ్రీ) లెన్స్, 2MP డెప్త్ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ ఉన్నాయి. దీని యొక్క వెనుక కెమెరాను "అల్ట్రా నైట్ మోడ్ 2.0" తో అమర్చారు. అలాగే సెల్ఫీల కోసం ముందు భాగంలో స్మార్ట్‌ఫోన్‌కు AI మెటీఫికేషన్ మోడ్‌తో 16 మెగాపిక్సెల్ కెమెరా షూటర్ లభిస్తుంది.

 

బ్యాటరీ

బ్యాటరీ

ఒప్పో అందిస్తున్న ఈ హ్యాండ్‌సెట్‌ యొక్క ముఖ్యమైన అంశాలలో బ్యాటరీ ఒకటి. బడ్జెట్‌తో పాటు మిడ్-రేంజ్ విభాగంలో 4,000 ఎంఏహెచ్ బ్యాటరీలతో మార్కెట్ ట్రెండ్ అవుతున్నప్పుడు ఒప్పో దీని కంటే పెద్ద బ్యాటరీ యూనిట్‌ను అందిస్తోంది. ఒప్పో A9 2020 హ్యాండ్‌సెట్‌ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది ఒక్క ఛార్జీతో 20 గంటలకు పైగా బ్యాకప్ ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రతి రోజు మీరు మీతో పాటు ఛార్జర్‌ను తీసుకెళ్లవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీ స్మార్ట్‌ఫోన్‌ను ఒక రోజు మొత్తం రన్ చేయడానికి కావలసిన ఛార్జింగ్ మీకు ఒప్పో బ్యాటరీ ఇస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Oppo A9 2020 Price Slashed in India: 8GB RAM Variant Now Starts at Rs. 15,990
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X