6జిబి ర్యామ్‌తో Nubia Z18 Mini స్మార్ట్‌ఫోన్

Written By:

చైనా దిగ్గజం జ‌డ్‌టీఈ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ నూబియా జ‌డ్‌18 మినీని చైనాలో లాంచ్ చేసింది. 64/128 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో విడుద‌ల కానున్న ఈ ఫోన్ వ‌రుస‌గా రూ.18,650, రూ.21,760, రూ.22,800 ధ‌ర‌ల‌కు వినియోగ‌దారుల‌కు ల‌భ్యం కానుంది. కాగా ఈ నెల 19 నుంచి ఇది అమ్మకానికి వెళ్లనుంది. అయితే ఈ ఫోన్ ఇండియాకి ఎప్పుడు వస్తుందనే దానిపై కంపెనీ ఇంకా స్పష్టతనివ్వలేదు. అతి త్వరలో వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో 5.7 ఇంచుల సైజ్ ఉన్న భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 6 జీబీ ప‌వ‌ర్‌ఫుల్ ర్యామ్‌ను ఇందులో అందిస్తున్నారు. వెనుక భాగంలో 24, 5 మెగాపిక్స‌ల్ కెపాసిటీ ఉన్న రెండు ప‌వ‌ర్‌ఫుల్ కెమెరాల‌ను అమ‌ర్చారు. వీటితో తీసుకునే ఫొటోలు, వీడియోలు బాగా క్వాలిటీతో వ‌స్తాయి. ముందు భాగంలో ఉన్న 8 మెగాపిక్స‌ల్ కెమెరాతో ఫేస్ అన్‌లాక్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. దీంతో యూజ‌ర్లు కేవ‌లం 0.1 సెక‌న్ల వ్య‌వ‌ధిలోనే డివైస్‌ను అన్‌లాక్ చేయ‌వ‌చ్చు. అలాగే వెనుక భాగంలో ఉన్న ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌తోనూ డివైస్‌ను అంతే వేగంగా అన్‌లాక్ చేయ‌వ‌చ్చు.

6జిబి ర్యామ్‌తో Nubia Z18 Mini స్మార్ట్‌ఫోన్

నూబియా జ‌డ్‌18 మినీ ఫీచ‌ర్లు
5.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2160 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 660 ప్రాసెస‌ర్‌, 6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయ‌ల్ సిమ్‌, 24, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3450 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

మొబైల్‌లో పోర్న్ వీడియోలు ఉండాలని ఏం చేస్తున్నారో తెలుసా ?

కాగా ఈ కంపెనీ నుంచి అతి త్వరలో Nubia V18 పేరుతో మరో స్మార్ట్‌ఫోన్ రానుంది. 4జిబి ర్యామ్ 6.01-inch డిస్ ప్లేతో ఈ ఫోన్ మార్కెట్లోకి రానుందని సమాచారం. ఇందులో కూడా ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 660 ప్రాసెస‌ర్‌ని పొందుపరిచారు. ఆండ్రాయిడ్ నౌగట్ మీద పనిచేయనుంది. కెమెరా విషయానికొస్తే 13 ఎంపీ కెమెరాతో పాటు 8 ఎంపీ సెల్ఫీ కెమెరాను పొందుపరిచారు.

English summary
Nubia Z18 Mini with 5.7-Inch 18:9 Display, 6GB RAM, Android 8.1 Launched: Price, Specifications More news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot