అతి త్వరలో మార్కెట్లోకి రాబోతున్న సామ్‌సంగ్ ఫోల్డింగ్ ఫోన్స్

స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో దూసుకుపోతున్న ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్ మరో కొత్త మోడల్ ఫోన్‌ను తీసుకురాబోతుంది.ఈ ఫోన్ ను ‘విన్నర్‌' అనే కోడ్‌నేమ్‌తో మార్కెట్ లోకి తీసుకొని రాబోతుంది

By Anil
|

స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో దూసుకుపోతున్న ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్ మరో కొత్త మోడల్ ఫోన్‌ను తీసుకురాబోతుంది.ఈ ఫోన్ ను 'విన్నర్‌' అనే కోడ్‌నేమ్‌తో మార్కెట్ లోకి తీసుకొని రాబోతుంది. అయితే ఈ ఫోన్ యొక్క ప్రత్యకత ఏంటంటే ఫోన్ ను ఫోల్డ్ చేసుకోవచ్చు .ఈ నేపథ్యంలో ఈ ఫోన్‌ పై అనేక పుకార్లు వినిపిస్తున్నాయి.ఈ ఫోన్ 7 అంగుళాల బారి స్క్రీన్,6000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంటుందని వచ్చే ఏడాది 2019 మొదటి నెలలో ఈ ఫోల్డింగ్ ఫోన్ మార్కెట్‌లోకి సామ్‌సంగ్ కంపెనీ తీసుకురాబోతుందని టాక్ . అయితే ఈ ఫోన్‌ లాంచింగ్‌ పై శాంసంగ్ కంపెనీ ఎటువంటి ప్రకటన చేయలేదు.కాగా ఇండియన్ మార్కెట్లోకి ఈ ఫోన్ వస్తుందో రాదో అన్నదాని ఫై ఎటువంటి క్లారిటీ లేదు. ఈ శీర్షిక లో భాగంగా ఈ ఫోన్ గురించి మరిన్ని ఆసక్తికరమైన వివరాలు మీకు తెలుపుతున్నాము.

రెండు డిస్‌ప్లేలు కలిగి  ఉంటాయి:

రెండు డిస్‌ప్లేలు కలిగి ఉంటాయి:

భారీ స్క్రీన్‌తో పాటు ఈ ఫోన్‌కు ముందు వైపు రెండో డిస్‌ప్లే కూడా ఉంటుంది. ఫోన్‌కు టాప్‌లో ముందు వైపు ఈ రెండో డిస్‌ప్లేను సామ్‌సంగ్ కంపెనీ అందిస్తుంది. ఈ రెండో డిస్‌ప్లే ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం యూజర్లకు నోటిఫికేషన్ల గురించి తెలియజేయడం కోసం .వాట్సాప్‌ మెసేజ్‌లు వచ్చినప్పుడు, ఈమెయిల్స్‌ చదవాలనుకున్నప్పుడు హ్యాడ్‌సెట్‌ను పూర్తిగా తెరవాల్సిన పనిలేదు.అన్ని నోటిఫికేషన్లను రెండో డిస్‌ప్లేలో చెక్ చేసుకోవచ్చు.

ఈ ఫోన్‌ ధర :

ఈ ఫోన్‌ ధర :

ఈ ఫోన్ ధర ఫై ఎటువంటి సమాచారం లేనప్పటికీ ఇంచుమించు Apple iPhone X మాదిరి లక్ష రూపాయల ధరను కలిగి ఉండవచ్చు అని సమాచారం . తొలుత ఈ ఫోన్‌ పరిమిత పరిమాణంలోనే అందుబాటులో ఉంటుంది .అయితే Apple iPhone X కు ఈ ఫోన్ గట్టిపోటీగా నిలువబోతుందని శాంసంగ్‌ అభిమానులు అనుకుంటున్నారు.

గేమింగ్ ప్రియులకు టార్గెట్:

గేమింగ్ ప్రియులకు టార్గెట్:

ఈ ఫోల్డింగ్ ఫోన్ లో అత్యుత్తమ గేమింగ్ ఫీచర్స్ కలిగి ఉంటాయి .అయితే ఈ ఫోన్ ను కేవలం గేమింగ్ ప్రియులను టార్గెట్ చేస్తూ సామ్‌సంగ్ కంపెనీ తయారు చేసారు అని సమాచారం.

మొదట స్వదేశంలో :

మొదట స్వదేశంలో :

సామ్‌సంగ్ కంపెనీ ఈ ఫోన్‌ను మొదట తన స్వదేశంలో లాంచ్‌ చేసుకుని, ఆ తరువాత ఇతర మార్కెట్లకు తీసుకొని రాబోతుందని తెలుస్తుంది. అయితే ఇండియన్ మార్కెట్లోకి ఈ ఫోల్డింగ్ ఫోన్ వస్తుందో రాదో అన్నదాని ఫై ఎటువంటి సమాచారం లేదు.

 

 

Best Mobiles in India

English summary
Samsung’s foldable phone will reportedly have a 7-inch screen and a secondary display.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X