ప్రపంచపు అతిసన్నని ఫోన్ ‘వివో ఎక్స్5 మాక్స్’

Posted By:

ప్రపంచపు అతిసన్నని ఫోన్

ప్రపంచపు అతిసన్నని స్మార్ట్‌ఫోన్‌గా ‘ఎక్స్5 మాక్స్' అవతరించింది. ప్రముఖ బ్రాండ్ ‘వివో' (Vivo) ఈ అతి పలుచని ఫోన్‌ను అంతర్జాతీయ మార్కెట్లో ఆవిష్కరించింది. డివైస్ మందం కేవలం 4.75మిల్లీ మీటర్లు. చైనా మార్కెట్లో డిసెంబర్ 22 నుంచి ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ధర 486 డాలర్లు (మన కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.29,646). ఇండియన్ మార్కెట్లో వివో ఎక్స్5 మాక్స్ ఫోన్‌ను డిసెంబర్ 15న ప్రకటిస్తారు. ధర ఇంకా అందుబాటుకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. హెచ్‌టీసీ డిజైర్ 820, జియోనీ ఈలైఫ్ ఎస్5.1, ఓప్పో ఆర్5 తదితర ఫోన్‌లకు ఎక్స్5 మాక్స్ ప్రధాన పోటీ కానుంది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా అన్ని అప్‌డేట్స్ పొందండి

ఫోన్ ప్రత్యేకతలు:

5.5 అంగుళాల 1080 పిక్సల్ సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.4.4 ఆధారంగా స్పందించే ఫన్‌టచ్ 2.0 ఆపరేటింగ్ సిస్టం,
1.7గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ53 ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Vivo X5 Max Announced As The World’s Slimmest Smartphone. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot