హ్యాకర్లను గుర్తించేందుకు 5 స్మార్ట్ మార్గాలు

Posted By:

మనందరి జీవితాల్లో ఇంటర్నెట్ ఓ భాగంగా మారిపోయింది. సమాచార శోధన, సోషల్ నెట్‌వర్కింగ్, నగదు చెల్లింపు ఇలా అనేక కమ్యూనికేషన్ అవసరాలకు ఇంటర్నెట్‌ను ఉపయోగించుకుంటున్నాం. మంచి ఉన్న చోటే చెడు కూడా ఉన్నట్లు వెబ్ ప్రపంచంలో హ్యాకింగ్ దాడులు రోజు రోజకు ముమ్మరమవుతున్నాయి. ప్రముఖ వెబ్‌సైట్‌లను లక్ష్యంగా చేసుకుంటున్న హ్యాకర్లు సదరు వెబ్‌సైట్‌లను పోలిన నకిలీ వెబ్‌సైట్‌లను సృష్టించి విజిటర్ల పై మాల్వేర్‌తో దాడులకు పాల్పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా రోజుకు 9,500 వెబ్‌సైట్‌లు మాల్వేర్ భారిన పడుతున్నట్లు గూగుల్ గతంలో గుర్తించింది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా హ్యాకర్లను గుర్తించేందుకు 5 స్మార్ట్ మార్గాలను మీకు సూచిస్తున్నాం...

(ఇంకా చదవండి: షియోమీ ఎంఐ4ఐ.. బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ చిట్కాలు)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్పూఫ్ ఇ-మెయిల్స్

ఈమెయిల్ అకౌంట్‌లను టార్గెట్ చేస్తున్న హ్యాకర్లు మోసపూరిత డేటాతో కూడిన స్పూఫ్ ఇ-మెయిల్స్‌ను నెటిజనుల అకౌంట్లకు పంపుతున్నారు. వీటిని అసలు నమ్మకూడదు.

 

ఫేక్ వెబ్‌సైట్స్, యాప్స్

ప్రముఖ వెబ్‌సైట్‌లను లక్ష్యంగా చేసుకుంటున్న హ్యాకర్లు సదరు వెబ్‌సైట్‌లను పోలిన నకిలీ వెబ్‌సైట్‌లను సృష్టించి విజిటర్ల పై మాల్వేర్‌తో దాడులకు పాల్పడుతున్నారు. కాబట్టి నకిలీ వెబ్‌సైట్స్ అలాను నకిలీ యాప్స్ జోలికి వెళ్లొద్దు. httpsతో మొదల్యే వెబ్ లింక్ బ్రౌజింగ్‌కు ఎంతో శ్రేయస్కరం.

 

మోసపూరిత డిస్కౌంట్ ధరలు

ఇంటర్నెట్‌లో బ్రౌజ్ చేస్తున్నప్పుడు భారీ డిస్కౌంట్ ధరలతో అనేక యాడ్ లింక్‌లు మనకు కనిపిస్తుంటాయి. ఈ లింక్స్ సురక్షితం కాదు.

 

పలనా బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాము, మీ క్రెడిట్ కార్డ్ వివరాలు కాస్త చెబుతారా అంటూ తియ్యని మాటలతో కూడిన ఫేక్ కాల్స్ ఒకోసారి వస్తుంటాయి. సాధారణంగా ఏ బ్యాంక్ వారు ఇలాంటి ఫోన్ కాల్స్ చేయరు. కాబట్టి ఇటివంటి నకిలీ కాల్స్ కు స్పందించకండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
5 smart ways to identify hackers. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot