బిఎస్ఎన్ఎల్,వోడాఫోన్ యూజర్లకు న్యూ ఇయర్ గిఫ్ట్

దేశీయ టెలికాం రంగంలో పలు విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.కొత్త సంవత్సరం కానుకగా బిఎస్ఎన్ఎల్ మరియు వోడాఫోన్ తమ యూజర్లకు ఓ మంచి శుభవార్తను మోసుకొచ్చింది.

|

దేశీయ టెలికాం రంగంలో పలు విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.కొత్త సంవత్సరం కానుకగా బిఎస్ఎన్ఎల్ మరియు వోడాఫోన్ తమ యూజర్లకు ఓ మంచి శుభవార్తను మోసుకొచ్చింది.సాధార‌ణంగా పండుగ‌లు, ముఖ్య‌మైన రోజుల్లో వినియోగ‌దారులు పంపుకునే ఎస్ఎంఎస్‌ల‌కు చార్జిలు వేస్తారు. ఇక‌పై ఈ నెట్‌వ‌ర్క్‌ల‌లో ఉన్న వినియోగ‌దారుల‌కు బ్లాక్ అవుట్ డేస్ ఉండ‌వు అని బిఎస్ఎన్ఎల్ మరియు వోడాఫోన్ స్పష్ట చేసింది.

వాట్సాప్ అలెర్ట్ : ఇంకా ఈ ఫోన్లలో వాట్సప్ సేవలు బంద్వాట్సాప్ అలెర్ట్ : ఇంకా ఈ ఫోన్లలో వాట్సప్ సేవలు బంద్

రిలయన్స్ జియో....

రిలయన్స్ జియో....

టెలికాం మార్కెట్లో ప్రకంపనలు రేపుతున్న రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రిలయన్స్‌ జియోను చూసి, ఇతర టెల్కోలు కూడా తమ కస్టమర్లకు బంపర్‌ ఆఫర్లు ప్రకటిస్తూ ఉన్నాయి.మొదటి నుంచి జియో బ్లాక్ అవుట్ డేల‌లోనూ ఎస్ఎంఎస్‌ల‌కు చార్జిలు విధించ‌డం లేదు. దీంతో బీఎస్ఎన్ఎల్‌, వొడాఫోన్‌, ఐడియాలు ఇప్పుడు జియో బాట ప‌ట్టాయి.

ఎస్ఎంఎస్‌ల‌కు చార్జిలు...

ఎస్ఎంఎస్‌ల‌కు చార్జిలు...

నేటి నుంచి మొద‌లుకొని 2019లో వ‌చ్చే ప్ర‌త్యేక రోజులు, పండుగ రోజుల్లో వినియోగ‌దారులు పంపుకునే ఎస్ఎంఎస్‌ల‌కు చార్జిలు విధించ‌బోమని, వారు య‌థావిధిగా త‌మ ఎస్ఎంఎస్ ప్యాక్‌ల‌ను వాడుకోవ‌చ్చ‌ని బిఎస్ఎన్ఎల్ మరియు వోడాఫోన్ కంపెనీలు తెలిపాయి.

ఎయిర్‌టెల్

ఎయిర్‌టెల్

అయితే ఎయిర్‌టెల్ మాత్రం  బ్లాక్ అవుట్ డేస్ పై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

వొడాఫోన్ రెండు ప్లాన్లలో మార్పులు చేసింది....

వొడాఫోన్ రెండు ప్లాన్లలో మార్పులు చేసింది....

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న వొడాఫోన్ రెండు ప్లాన్లలో మార్పులు చేసింది. నెల రోజుల ప్లాన్ రూ. 199, అలాగే 84 రోజుల ప్లాన్ రూ.399లో భారీ మార్పులను చేస్తూ నిర్ణయం తీసుకుంది.ఇందులో భాగంగా అధిక డేటాను అందిస్తోంది.

రూ.199 ప్లాన్...

రూ.199 ప్లాన్...

ఈ ప్లాన్లో భాగంగా కంపెనీ ఇంతకు ముందు నెలరోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.4 జిబి డేటా చొప్పున అందిస్తోంది. అలాగే అన్‌లిమిటెడ్ లోకల్ , ఎస్టీడీ కాల్స్ నెల రోజుల పాటు లభిస్తాయి. అలాగే రోజుకు 100 ఎసెమ్మెస్ లు ఉచితంగా లభిస్తాయి. అయితే మారిన ప్లాన్ ప్రకారం ఇకపై దీని మీద 1.5జిబి డేటాను అందుకుంటారు.

రూ.399 ప్లాన్...

రూ.399 ప్లాన్...

ఈ ప్లాన్లో భాగంగా కంపెనీ 84 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1జిబి డేటా చొప్పున అందిస్తోంది. అలాగే అన్ లిమిటెడ్ లోకల్ , ఎస్టీడీ కాల్స్ నెల రోజుల పాటు లభిస్తాయి. అలాగే రోజుకు 100 ఎసెమ్మెస్ లు ఉచితంగా లభిస్తాయి. అయితే మారిన ప్లాన్ ప్రకారం ఇకపై దీని మీద 1.4జిబి డేటాను అందుకుంటారు.

కాల్ లిమిట్...

కాల్ లిమిట్...

ఈ రెండు ప్లాన్లు daily FUP limitతో వచ్చాయి. రోజుకు 250 నిమిషాలు అలాగే వారానికి 1000 నిమిషాలు మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది. ఈ పరిధిని దాటి మీరు కాల్ చేస్తే సెకండ్ కి 1.2పైసా, నిమిషానికి రూపాయి ఛార్జ్ చేయబడుతుందని కంపెనీ తెలిపింది. డేటా లిమిట్ దాటిన తర్వాత కూడా ఎంబికి 50 పైసల చొప్పున ఛార్జ్ చేస్తారు.

లేటెస్ట్ ప్లాన్...

లేటెస్ట్ ప్లాన్...

కాగా కంపెనీ ఈ మధ్య ప్రీపెయిడ్ యూజర్ల కోసం రూ.169 ప్లాన్ ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్లాన్ కింద యూజర్లు 28 రోజుల పాటు రోజుకు 1జిబి డేటా అలాగే అన్‌లిమిటెడ్ లోకల్ , ఎస్టీడీ కాల్స్, రోజుకు 100 ఎసెమ్మెస్ లు అందుకుంటారు.

Best Mobiles in India

English summary
After BSNL, Vodafone Idea discontinues blackout days.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X