Airtel ప్రీపెయిడ్ ప్లాన్‌లపై ఉచిత & క్యాష్‌బ్యాక్ ఆఫర్స్....

|

భారతీ ఎయిర్‌టెల్ యొక్క ప్రీపెయిడ్ ప్లాన్‌లు అధిక సంఖ్యలో అందించకపోయినప్పటికీ టెల్కో కొన్ని ఖచ్చితమైన ప్రత్యేకమైన ఆఫర్‌లను అందిస్తున్నది. భారతీ ఎయిర్‌టెల్ టెలికాం పరిశ్రమలో స్టాండ్‌అవుట్ ఆపరేటర్‌గా మారుతుంది.

 

భారతి ఎయిర్టెల్

ఇప్పటివరకు ఆపరేటర్లు పోస్ట్ పెయిడ్ ప్లాన్లతో OTT సబ్స్క్రిప్షన్ మరియు అదనపు ప్రయోజనాలను అందించడాన్ని అందరు గమనించారు. కాని భారతి ఎయిర్టెల్ ఇప్పుడు మరొక అడుగు ముందుకు వేసి మరికొన్ని ప్రయోజనాలను కూడా జోడించింది. ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లో ప్రస్తుతం లభించే ఇటువంటి రూ.179, రూ.279 మరియు రూ.349 ప్రత్యేకమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఉన్నాయి. ఈ ప్లాన్ లు అమెజాన్ ప్రైమ్ సభ్యత్వంను ఉచితంగా అందిస్తున్నది. బిఎస్ఎన్ఎల్ లోని ఇటువంటి కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఈరోస్ నౌను ఉచితంగా అందిస్తున్నది. అయితే ఇది ఇండియాలో అమెజాన్ ప్రైమ్ వలె ప్రజాదరణ పొందలేదు.

ఎయిర్‌టెల్ రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు
 

ఎయిర్‌టెల్ రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

భారతీ ఎయిర్‌టెల్ ఇంతుకుముందు అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని దాని రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్‌తో అందించేది. అయితే ప్రస్తుతం ఈ ప్లాన్ యొక్క ధరను రూ.349 కు పెంచారు. ఇది రోజుకు 2GB డేటా, అన్ని నెట్ వర్క్ లకు అపరిమిత కాల్స్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తున్నది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క ఇతర ప్రయోజనాల విషయానికి వస్తే ఇది అదనపు ఖర్చు లేకుండా 129 రూపాయల విలువైన అమెజాన్ ప్రైమ్ చందాను, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్ చందా, ఫ్రీ హెలోటూన్స్, వింక్ మ్యూజిక్, షా అకాడమీ నుండి ఉచిత ఆన్‌లైన్ కోర్సులు మరియు ఫాస్టాగ్‌లో రూ.150 క్యాష్‌బ్యాక్ వంటి ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

ఎయిర్‌టెల్

లాక్డౌన్ వ్యవధిలో భారతీ ఎయిర్‌టెల్ వినియోగదారులకు రూ.349 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ నిజంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చందాదారులు ఎటువంటి ప్రత్యేక చందా లేకుండా అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని ఉచితంగా పొందవచ్చు. అలాగే 2GB రోజువారీ డేటా ప్రయోజనం ప్రస్తుతం భారతదేశంలో చాలా మందికి సరిపోతుంది.

ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్లపై రూ.4 లక్షల వరకు లైఫ్ ఇన్సూరెన్స్ కవర్

ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్లపై రూ.4 లక్షల వరకు లైఫ్ ఇన్సూరెన్స్ కవర్

భారతి ఎయిర్‌టెల్ రూ.179, రూ.279 అనే రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లను ధరల పెంపుకు ముందు రూ.149, రూ.249 ధరల వద్ద అందించేది. ఎయిర్‌టెల్ సంస్థ రూ.179 ప్లాన్‌తో భారతి ఆక్సా లైఫ్ నుంచి రూ .2 లక్షల జీవిత బీమాను అందిస్తుండగా, రూ.279 ప్లాన్‌తో హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి రూ.4 లక్షల జీవిత బీమా కవర్‌ను అందిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ.179, రూ.279 రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లు

ఎయిర్‌టెల్ రూ.179, రూ.279 రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లు

రూ .279 ప్లాన్ యొక్క ఇతర ప్రయోజనాలు రోజుకు 1.5 జిబి డేటా, భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తున్నది. అలాగే రూ.179 ప్లాన్ 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 300 ఎస్‌ఎంఎస్‌ ప్రయోజనాలను 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తున్నది. అంతేకాకుండా ఈ రెండు ప్లాన్‌లు ఉచిత హెలొటూన్స్, ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్ చందా మరియు వింక్ మ్యూజిక్‌ను కూడా అందిస్తున్నాయి. రూ.279 ప్రీపెయిడ్ రీఛార్జ్ వినియోగదారునికి ఫాస్టాగ్‌లో రూ .150 క్యాష్‌బ్యాక్ మరియు షా అకాడమీలో ఉచిత ఆన్‌లైన్ కోర్సులను అందిస్తుంది.

జియో Vs వొడాఫోన్ ఐడియా Vs ఎయిర్‌టెల్

జియో Vs వొడాఫోన్ ఐడియా Vs ఎయిర్‌టెల్

ఈ మూడు ప్లాన్‌లు ఇప్పటికే దేశవ్యాప్తంగా భారతి ఎయిర్‌టెల్ చందాదారులకు అందుబాటులో ఉన్నాయి. భారతి ఎయిర్‌టెల్ నుండి వచ్చిన మూడు ప్రత్యేకమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇవి. రిలయన్స్ జియో మరియు వొడాఫోన్ ఐడియా చందాదారులకు ప్రస్తుతం ఇటువంటి ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందించడం లేదు. జియో మరియు వొడాఫోన్ ఐడియా రెండూ ప్రస్తుతం సాధ్యమైనంత ఎక్కువ అపరిమిత కాంబో ప్లాన్‌లను అందించడంపై దృష్టి సారించాయి.

Best Mobiles in India

English summary
Airtel Prepaid Plans offers Insurance and Amazon Prime Benefits

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X