Airtel యొక్క 1Gbps స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల ఆఫర్లు....

|

ఇండియాలోని బ్రాడ్‌బ్యాండ్ రంగంలో అద్భుతమైన ప్లాన్ లను అందించే వాటిలో భారతి ఎయిర్‌టెల్ సంస్థ కూడా ఒకటి. ఇటీవల భారతి ఎయిర్‌టెల్ సిఇఓ గోపాల్ విట్టల్ తమ సంస్థ 1Gbps ఇంటర్నెట్ స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను అందిస్తూనే ఉందని తెలిపారు. ఈ స్పీడ్ తో గల ప్లాన్‌ను తమ ఇళ్లలో పొందాలనుకునే ఎవరైనా ఎయిర్‌టెల్‌ను సంప్రదించవచ్చు.

ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్

ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్

ప్రజలు ఇప్పుడు ఇంటి నుండి పని చేస్తున్నారు మరియు కొన్ని ఇళ్లలో ఒకే వైఫైకి ఇద్దరు కంటే ఎక్కువ మంది కనెక్ట్ అయ్యిఉంటారు. ఇది వేగవంతమైన సమస్యలు మరియు బెదిరింపుల సమస్యలు ఉన్నప్పటికీ అవసరమైన చోట ఎయిర్‌టెల్ 1 Gbps ఇంటర్నెట్ వేగాన్ని అందిస్తోంది. ఎయిర్‌టెల్ నుండి వచ్చిన 1Gbps ప్లాన్ అత్యంత ఖరీదైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్. ఇది ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఆఫర్ కింద వస్తుంది.

ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ యొక్క ఇతర ప్లాన్‌లు

ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ యొక్క ఇతర ప్లాన్‌లు

ఎయిర్‌టెల్ నుండి 1Gbps ప్లాన్‌కు సమానమైన మరిన్ని ప్లాన్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ కింద అందిస్తున్న చౌకైన ప్లాన్ రూ.799 ధరను కలిగి ఉండి ఒక నెలకు 150GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. ఆ తర్వాత మీకు 100Mbps వేగంతో అపరిమిత డేటాను అందిస్తుంది.

1 Gbps స్పీడ్ ప్లాన్

1 Gbps స్పీడ్ ప్లాన్

ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బ్రాడ్‌బ్యాండ్ రెండవ ప్లాన్ రూ.999 ధర వద్ద 200 Mbps వేగంతో 300GB హై-స్పీడ్ డేటాను ఇస్తుంది ఆ తర్వాత డేటా యొక్క వేగం తగ్గుతుంది. దీనిని మీరు కావాలంటే ఆరునెలల ప్లాన్‌కు అప్‌గ్రేడ్ చేయవచ్చు. దీని యొక్క ధర జిఎస్‌టిని మినహాయించి రూ.5,544 ధర వద్ద అపరిమిత హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. మీరు 1 Gbps స్పీడ్ ప్లాన్ కోసం చూస్తున్నట్లు అయితే మీరు నెలకు 3,999 రూపాయలు చెల్లించి అపరిమిత డేటాను పొందవచ్చు. ఎయిర్టెల్ యొక్క అపరిమిత ఇంటర్నెట్ అంటే 3.3TB డేటా అని అర్థం.

భారతదేశంలో బ్రాడ్‌బ్యాండ్ సేవలు

భారతదేశంలో బ్రాడ్‌బ్యాండ్ సేవలు

ఇండియాలో రెగ్యులర్ వ్యాపారాన్ని నిర్వహించడానికి 19 మిలియన్ల మంది (కార్యాలయాల్లో) ఇంటర్నెట్ కోసం బ్రాడ్‌బ్యాండ్ సేవలపై ఆధారపడుతున్నారు. అలాగే ఇంటర్నెట్‌ను ఉపయోగించడానికి మరో 17 మిలియన్ల మంది ప్రజలు తమ ఇళ్లలో బ్రాడ్‌బ్యాండ్ సేవలను ఏర్పాటు చేసుకున్నారు.

ఎయిర్టెల్  IVR సిస్టమ్

ఎయిర్టెల్ IVR సిస్టమ్

ఎయిర్టెల్ తన మెరుగైన IVR సిస్టమ్ సహాయంతో ఈ అనిశ్చిత సమయాల్లో ప్రజలకు హై-స్పీడ్ ఇంటర్నెట్ను అందిస్తామని హామీ ఇచ్చింది. ప్రస్తుతానికి లక్షలాది మంది ప్రజలు తమ ఇళ్లలో పనిచేస్తున్న వారి పనిని సజావుగా సాగేలా చూస్తున్నారు. ఎయిర్‌టెల్ తన బ్రాడ్‌బ్యాండ్ సేవతో ఈ నేపథ్యంలో తీవ్రంగా కృషి చేస్తుంది మరియు ప్రజలను కనెక్ట్ చేస్తుంది.

Best Mobiles in India

English summary
Airtel Broadband Plans offers 1Gbps Speed: Check the Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X