ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ DTH సెకండరీ కనెక్షన్ కొనుగోలుపై భారీ డిస్కౌంట్ ఆఫర్

|

భారతదేశంలో రెండవ అతిపెద్ద టెలికాం కంపెనీ అయిన భారతి ఎయిర్‌టెల్ తన యొక్క సేవలను డైరెక్ట్-టు-హోమ్ విభాగంలో కూడా అందిస్తూ మెరుగైన యూజర్ బేస్ ని కలిగి ఉంది. దేశంలో DTH విభాగంలో విజయవంతమైన వాటిలో కూడా ఎయిర్‌టెల్ ఒకటిగా ప్రసిద్ది చెందింది. ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ పేరుతో ఎయిర్‌టెల్ యొక్క DTH బ్రాండ్ ప్రస్తుతం భారతదేశంలో మిలియన్ల మంది కస్టమర్లను కలిగి ఉంది. ఇది తన యొక్క వినియోగదారులకు HD, SD మరియు Xstream ఆండ్రాయిడ్ బాక్స్‌తో బహుళ సెట్-టాప్ బాక్స్‌లను అందిస్తుంది.

ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ

ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ యొక్క STBలు కొందరికి కొంచెం ఖరీదైనవిగా అనిపించవచ్చు. మీరు ఎయిర్‌టెల్ DTH కంపెనీ నుండి కొత్త కనెక్షన్‌ని కొనుగోలు చేసినప్పుడు మీరు కేవలం STBని మాత్రమే కాకుండా మరికొన్ని వస్తువులను కూడా కొనుగోలు చేయవలసి ఉంటుంది. DTH కనెక్షన్‌లో ఫైబర్ కేబుల్ మరియు సాటిలైట్ సిగ్నల్లను స్వీకరించే డిష్ కూడా ఉంటాయి. మీరు మీ ఇల్లు/ఆఫీసులలో ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ DTH యొక్క బహుళ కనెక్షన్‌ల కోసం చూస్తుంటే కనుక ఒకే మొత్తంలో డబ్బును చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి మీరు ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ కస్టమర్ అయితే కనుక మీరు చాలా తక్కువ ధర వద్ద ఎయిర్‌టెల్ యొక్క రెండవ కనెక్షన్‌ని కూడా పొందవచ్చు. రెండవ కనెక్షన్ మీ మొదటి కనెక్షన్ కింద నమోదు చేయబడితే కనుక దాని కోసం మీరు బహుళ డిష్ లను ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. సెకండరీ-DTH కనెక్షన్ కోసం ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ అందించే ఆఫర్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

8 యూట్యూబ్ ఛానెల్‌లను బ్యాన్ చేసిన భారత ప్రభుత్వం!! కారణం ఏమిటో...8 యూట్యూబ్ ఛానెల్‌లను బ్యాన్ చేసిన భారత ప్రభుత్వం!! కారణం ఏమిటో...

ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ సెకండరీ కనెక్షన్ భారీ డిస్కౌంట్ ఆఫర్

ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ సెకండరీ కనెక్షన్ భారీ డిస్కౌంట్ ఆఫర్

ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ యొక్క సెకండరీ కనెక్షన్ ప్రస్తుతం వినియోగదారులకు భారీ తగ్గింపుతో కేవలం రూ.750 తక్కువ ధరకు మాత్రమే అందుబాటులో ఉంది. వాస్తవానికి కొత్త కస్టమర్‌లు ఈ ఆఫర్‌ను పొందలేరు. ఎందుకంటే వారు సెకండరీ కనెక్షన్‌ని పొందడానికి వారి ప్రాంగణంలో ప్రాథమిక కనెక్షన్‌ని ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీకు ప్రస్తుతం సెకండరీ కనెక్షన్ కావాలంటే ప్రస్తుతం ఉన్న రూ.1,000 చెల్లించవలసిన అవసరం లేదు. అయితే ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు మరియు ఇతర ఛార్జీలు ఉండవచ్చు. ఆ వివరాల కోసం మీరు ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ కస్టమర్ కేర్ సపోర్ట్‌తో కనెక్ట్ అవ్వాలి.

సెకండరీ కనెక్షన్

మీరు ఎయిర్‌టెల్ కంపెనీ వెబ్‌సైట్ ద్వారా సెకండరీ కనెక్షన్ కోసం అభ్యర్థించవచ్చు. లేదా మీరు కంపెనీ కస్టమర్ కేర్ సపోర్ట్‌ని సంప్రదించవచ్చు లేదా రిటైల్ స్టోర్‌ను కనుగొనవచ్చు. ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ వినియోగదారులు ఆనందించడానికి ఉత్తమమైన కొన్ని టీవీ ప్యాక్‌లను అందిస్తుంది. మీరు OTT (ఓవర్-ది-టాప్) కంటెంట్‌ని చూడటం చాలా సులభం అయిన కంపెనీ నుండి Xstream బాక్స్‌ను కూడా పొందవచ్చు.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ రూ.699 ప్లాన్‌

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ రూ.699 ప్లాన్‌

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో మొదటిది రూ.699 ధరతో లభిస్తుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు 40 Mbps ఇంటర్నెట్ స్పీడ్‌ని పొందుతారు. అదనంగా డిస్నీ+ హాట్‌స్టార్, సోనీలైవ్, ErosNow, లయన్స్‌గేట్ ప్లే, మనోరమమాక్స్, Hoichoi, Ultra, షెమరూ, EPICON, హంగామాక్స్, DivoTV, Klikk, Nammaflix, Dollywood మరియు Shorts TV వంటి 14 OTTలకు ప్రీమియం సింగిల్ లాగిన్ యాక్సెస్‌తో ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను పొందుతారు. ఈ 14 OTT ప్లాట్‌ఫారమ్‌లు రూ.1099 మరియు రూ.1599 ధరల వద్ద లభించే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో కూడా అందించబడుతున్నాయని గమనించండి. అదనంగా ఎయిర్‌టెల్ 4K ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌తో పాటుగా 350 ఛానెల్‌ల టీవీ సర్వీసుకు కూడా ఉచిత యాక్సిస్ లభిస్తుంది. కానీ STB (సెట్-టాప్ బాక్స్) కోసం మీరు రూ. 2,000 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌తో వినియోగదారులు 3.3TB లేదా 3300GB ఉచిత డేటాను పొందుతారు.

Best Mobiles in India

English summary
Airtel Digital TV is Offering Huge Discounts on Secondary DTH Connection

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X