4 లక్షల బీమాను అందిస్తున్న ఎయిర్‌టెల్ RS.599 ప్రీపెయిడ్ ప్లాన్

|

టెలికామ్ రంగంలో ఇప్పుడున్న పోటీని దృష్టిలో పెట్టుకొని భారతీ ఎయిర్‌టెల్ సంస్థ తన వినియోగదారుల కోసం మరిన్ని కొత్త కొత్త ప్లాన్లను ప్రవేశపెట్టింది. భారతీ ఎయిర్‌టెల్ కొత్తగా అందిస్తున్న మరియు సవరణలు చేసిన ప్లాన్లు మిగిలిన పోటీదారులకు పెద్ద సవాలును ఇస్తున్నాయి. భారతీ ఎయిర్‌టెల్ ఈ రోజు కొత్తగా 599 రూపాయల కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇది 84 రోజుల కాలవ్యవధితో అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది.

ఎయిర్‌టెల్

భారతీ ఎయిర్‌టెల్ కొత్తగా ప్రవేశపెట్టిన తన సరికొత్త 599 రూపాయల ప్లాన్ కస్టమర్లకు 4 లక్షల రూపాయల వరకు బీమా సౌకర్యాన్ని అందిస్తోంది. ఎయిర్‌టెల్ సంస్థ ఇంతక ముందు 249 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్‌లో 2 లక్షల బీమా సౌకర్యాన్ని అందించింది. ఎయిర్‌టెల్ యొక్క ఈ సరికొత్త ప్లాన్ అదనంగా మొత్తం చెల్లుబాటు కాలానికి 2GB రోజువారీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్ మరియు రోజుకు 100 SMS లతో సరికొత్త లాంగ్-వాలిడిటీతో ఈ ప్లాన్ ను అందిస్తుంది.

భారతి ఆక్సా లైఫ్

ఎయిర్‌టెల్ ఇప్పటికే 499 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్‌ను కలిగి ఉంది. ఇది 2 GB రోజువారీ డేటాను 82 రోజులకు అందిస్తుంది. అయితే ఈ కొత్త 599 రూపాయల ప్లాన్ అదనంగా జీవిత బీమా ప్రయోజనాన్ని అందిస్తుంది. జీవిత బీమాను అందించడం కోసం భారతి ఎయిర్టెల్ భారతి ఆక్సా లైఫ్ తో భాగస్వామ్యం కలిగి ఉంది. నెలకు కేవలం 200 రూపాయలకు ఎయిర్టెల్ నుండి వచ్చిన కొత్త ప్రీపెయిడ్ బండిల్ ఆర్థిక భద్రతతో హై-స్పీడ్ డేటా కనెక్టివిటీని అందిస్తుంది అని భారతి ఎయిర్టెల్ తెలిపింది.

భారతి ఎయిర్‌టెల్

భారతి ఎయిర్‌టెల్ అందిస్తున్న 599 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ రాబోయే 22 నెలల్లో మొత్తం 22 టెలికాం సర్కిల్‌లలో లభిస్తుంది. అయితే ప్రస్తుతానికి ఇది తమిళనాడు మరియు పాండిచేరిలోని వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ 2GB రోజువారీ డేటా, రోజుకు 100 SMS లు మరియు అపరిమిత వాయిస్ కాల్‌లతో మొత్తం 84 రోజుల పాటు అందిస్తుంది. అదనంగా భారతి ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థతో టెల్కో భాగస్వామ్యం కలిగి ఉన్నందున ఇది 4 లక్షల బీమా కవర్తో వస్తుంది. రీఛార్జ్ 84 రోజుల చెల్లుబాటుతో వస్తుందని ఎయిర్‌టెల్ తెలిపింది. అయితే ప్రతి రీఛార్జితో మూడు నెలల వరకు బీమా ఓవర్ స్వయంచాలకంగా కొనసాగుతుంది.

IRDAI

IRDAI ప్రకారం ఇండియాలో భీమా ప్రవేశం మొత్తం జనాభాలో 4% కంటే తక్కువగా ఉంది. మొబైల్ ప్రవేశం 90% కి దగ్గరగా ఉంది. 2022 నాటికి ఇండియాలో 830 మిలియన్ల మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఉంటారని అంచనా వేయబడింది. కాబట్టి ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ ప్లాన్‌లతో భీమా పంపిణీ కోసం ప్రయత్నిస్తోంది.

ఎయిర్‌టెల్ నుంచి 4 లక్షల బీమా కవర్‌ను ఎలా పొందాలి?

ఎయిర్‌టెల్ నుంచి 4 లక్షల బీమా కవర్‌ను ఎలా పొందాలి?

ఎయిర్టెల్ మొత్తం భీమా ప్రక్రియను కొన్ని నిమిషాల వ్యవధిలో డిజిటల్‌గా పంపిణీ చేయడానికి ఇంజనీరింగ్ చేసిందని ఎయిర్‌టెల్ తెలిపింది. కస్టమర్ SMS, ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ లేదా ఎయిర్‌టెల్ రిటైలర్ ద్వారా మొదటి రీఛార్జ్ తర్వాత బీమా కోసం నమోదు చేసుకోవాలి. 18-54 సంవత్సరాల వయస్సు గల వినియోగదారులందరికీ లభించే జీవిత బీమా కవర్‌కు ఎటువంటి వైద్య పరీక్షలు అవసరం లేదు. భీమా యొక్క ధృవీకరణ పత్రం తక్షణమే ఇవ్వబడుతుంది లేదా అది డిజిటల్‌గా పంపిణీ చేయబడుతుంది. భీమా యొక్క ఒరిజినల్ కాపీ కస్టమర్ అభ్యర్థన మేరకు అతని ఇంటి వద్దకు పంపబడుతుంది. ప్రస్తుతం ఈ 4 లక్షల బీమా కవర్‌ తమిళనాడు మరియు పాండిచేరిలోని వినియోగదారులకు అందుబాటులో ఉంది. దాని యొక్క లభ్యత క్రమంగా రాబోయే కొద్ది నెలల్లో పాన్-ఇండియాకు విస్తరించబడుతుంది.

సిఇఒ మనోజ్ మురళి

సిఇఒ మనోజ్ మురళి

ప్రపంచ స్థాయి టెలికాం కనెక్టివిటీతో ఎయిర్‌టెల్ తమిళనాడు మరియు పాండిచేరిలో మిలియన్ల మంది వినియోగదారులకు అధికారం ఇచ్చింది. ఈ నెట్‌వర్క్ డిజిటల్ సేవలను అందించడానికి మరియు వినియోగదారుల సమస్యలను పరిష్కరించడానికి ఒక గొప్ప వేదిక అని నమ్ముతున్నాము. ఈ వినూత్న సమర్పణను రూపొందించడానికి మరియు భారతదేశంలో జీవిత బీమాను స్వీకరించడానికి ధర, యాక్సెస్ మరియు చెల్లింపు అసౌకర్యాల యొక్క అడ్డంకులను తొలగించడానికి భారతి ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్‌తో భాగస్వామ్యం కావడం మాకు ఆనందంగా ఉంది అని కేరళ మరియు తమిళనాడు భారతీయ ఎయిర్‌టెల్ యొక్క సిఇఒ మనోజ్ మురళి తెలిపారు.

Best Mobiles in India

English summary
Airtel Introduce RS.599 Prepaid Recharge plan: Offers, Validity and Other Benefits

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X