Airtel Xstream Fibre : వర్క్@ హోమ్ చేసే వారి కోసం అద్భుతమైన ఆఫర్‌లు

|

ఇండియాలోని ప్రసిద్ధ ప్రైవేట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లలో ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ కూడా ఒకటి. దేశంలో కరోనావైరస్ యొక్క వ్యాప్తిని తగ్గించే ఉద్దేశంతో దాదాపు అన్ని కంపెనీలు తమ ఉద్యోగులను 'ఇంటి నుండే పని చేయమని' ఆదేశించాయి. ఇప్పుడు ఇంటి నుండి పనిని ఎంచుకునే ప్రతి ఒక్కరికి కావలసిన ముఖ్యమైన అంశం నమ్మకమైన ఇంటర్నెట్ కనెక్షన్.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్‌

బ్రాడ్‌బ్యాండ్ యొక్క స్పీడ్ విషయంలో ఇండియా ఇతర దేశాలతో పోటీపడుతోంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్‌తో సహా వివిధ ISPలు కూడా 1 Gbps వేగంతో బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ లను అందిస్తున్నాయి. 2019 చివరిలో భారతి ఎయిర్‌టెల్ తన బ్రాడ్‌బ్యాండ్ ధరలను క్రమబద్ధీకరించింది. ఇది ఇప్పుడు కేవలం రూ.999 నుండి 100Mbps వేగంతో నాలుగు ప్లాన్‌లను అందిస్తోంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ ఇప్పుడు తన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ల్లా మీద అందిస్తున్న ప్లాన్ల గురించి మరిన్ని వివరాలు తెల్సుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్‌టెల్ రూ .799 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

ఎయిర్‌టెల్ రూ .799 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

50 Mbps కన్నా తక్కువ బేస్ వేగాన్ని అందిస్తున్న ఇతర ఆపరేటర్ల మాదిరిగా కాకుండా ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ యొక్క స్టాండర్డ్ ప్లాన్ రూ.799 ధర వద్ద 50 Mbps వేగంతో నెలకు 150GB డేటాను అందిస్తుంది. అలాగే ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ యొక్క ఎంటర్టైన్మెంట్ ప్లాన్ రూ.999 ధర వద్ద లభిస్తుంది. ఇది నెలకు 300GB డేటాను 200Mbps వేగంతో మరియు అన్ని రకాల ప్రయోజనాలను అందిస్తుంది.

ఎయిర్‌టెల్ VIP బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

ఎయిర్‌టెల్ VIP బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

రూ.1,499 ధర వద్ద గల ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ ప్రీమియం ప్లాన్ ప్రతి నెలా 500GB వరకు 300Mbps వేగంతో వెబ్ బ్రౌజ్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. చివరగా ఎయిర్‌టెల్ యొక్క ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ VIP బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ నెలకు రూ.3,999 ధర వద్ద 1Gbps వేగంతో అందిస్తుంది. ఎయిర్టెల్ విఐపి ప్లాన్ యొక్క ఉత్తమ భాగం అపరిమిత డేటా ప్రయోజనం.

 

 

 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ లు

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ లు డిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి వివిధ ప్రముఖ నగరాల్లో వర్తిస్తాయి. అయితే హైదరాబాద్, విశాఖపట్నం వంటి కొన్ని నగరాల్లో రూ.799, రూ.999, రూ.1,499, రూ.3,999 వంటి ప్లాన్లు అపరిమిత డేటా ప్రయోజనాన్ని అందిస్తున్నాయి.

ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ అన్‌లిమిటెడ్ యాడ్-ఆన్ డేటా ప్లాన్లు

ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ అన్‌లిమిటెడ్ యాడ్-ఆన్ డేటా ప్లాన్లు

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ ప్లాన్‌లపై FUP పరిమితి ఉందని మీరు ఆందోళన చెందవచ్చు. ఏదేమైనా ప్రతి వినియోగదారుకు అపరిమిత డేటా యాడ్-ఆన్ అందుబాటులో ఉంది. దీని కోసం అదనంగా రూ.299 చెల్లించి చందాను పొందవచ్చు. ఉదాహరణకు మీరు రూ.999 ఎంటర్టైన్మెంట్ ప్లాన్ మరియు రూ.299 అపరిమిత డేటా యాడ్-ఆన్ ఎంచుకుంటే మీకు మొత్తం నెలవారీ ధర రూ.999 + రూ.299 ధర వద్ద మొత్తం నెలలో 200 Mbps వేగంతో 3.3TB వరకు అపరిమిత డేటా ప్రయోజనాన్ని పొందుతారు.

 

 

vivo V19 : అద్భుతమైన కెమెరా ఫీచర్లలో అన్నిటికంటే బెస్ట్ ఇదే...vivo V19 : అద్భుతమైన కెమెరా ఫీచర్లలో అన్నిటికంటే బెస్ట్ ఇదే...

ఇతర ISP లు

ఇతర ISP లు

ప్రస్తుతం కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ఏకైక మార్గం ఇంట్లో ఉండటమే. ACT ఫైబర్నెట్ మరియు బిఎస్ఎన్ఎల్ వంటి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఇప్పటికే చందాదారులను ఆకర్షించడానికి కొన్ని కొత్త మార్పులను ప్రవేశపెట్టారు. బిఎస్ఎన్ఎల్ ISP ఉచితంగా ‘వర్క్ @ హోమ్' అనే బ్రాడ్‌బ్యాండ్ కొత్త ప్లాన్ ను ప్రవేశపెట్టింది.అలాగే ACT ఫైబర్‌నెట్ ఇంటర్నెట్ వేగాన్ని 300 Mbps కు పెంచింది మరియు మార్చి 31, 2020 వరకు అపరిమిత డేటాను కూడా అందిస్తోంది. వ్యాప్తి కొనసాగితే ISP ల నుండి మరిన్ని ఆఫర్‌లను చూడవచ్చు.

Best Mobiles in India

English summary
Airtel Xstream Fibre Now Provide Amazing Offers For Work From Home

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X