గొప్ప ఆఫర్లతో అమెజాన్ లో ఫ్రీడమ్ సేల్స్

|

ఇండియాలో ఎప్పుడూ మొబైల్ ఫోన్లను గొప్ప గొప్ప ఆఫర్లతో అందించే అమెజాన్ ఇప్పుడు మరొక ఆఫర్ తో మన ముందుకు రాబోతోంది. ఇప్పుడు అమెజాన్ యొక్క ఫ్రీడమ్ సేల్ 48 గంటల కన్నా తక్కువ దూరంలో ఉంది. వినియోగదారులు దాని కోసం సిద్ధంగా ఉన్నారని నిర్ధారించుకొండి. ఈ సేల్స్ లో భాగంగా అమెజాన్ మొబైల్ ఫోన్లలో వివిధ ఒప్పందాలు మరియు ఆఫర్లను వెల్లడించింది.

గొప్ప ఆఫర్లతో అమెజాన్ లో ఫ్రీడమ్ సేల్స్

 

ఇ-రిటైల్ దిగ్గజం అమెజాన్ ఫ్రీడం అమ్మకం సమయంలో మనం ఆశించిన దానికంటే ఎక్కువ ఆఫర్లను అందిస్తోంది. ఈ సేల్స్ లో భాగంగా అమెజాన్ వన్‌ప్లస్ 7, శామ్‌సంగ్ గెలాక్సీ M30, రెడ్‌మి Y30, హానర్ 20i, రెడ్‌మి 7, నోకియా 6.1 ప్లస్, హానర్ 8X, రెడ్‌మి 6A, ఎల్‌జి W10 వీటితో పాటు అనేక ఇతర స్మార్ట్‌ఫోన్‌లకు కూడా ఈ ఆఫర్లను అందిస్తోంది.

గొప్ప ఆఫర్లతో అమెజాన్ లో ఫ్రీడమ్ సేల్స్

వివిధ ఒప్పందాలతో భాగంగా అమెజాన్ షాపింగ్ లో SBI క్రెడిట్ కార్డులను ఉపయోగించడం ద్వారా 10 శాతం తక్షణ తగ్గింపు లభిస్తుంది. అమెజాన్ ఫ్రీడమ్ సేల్ ప్రైమ్ చందాదారుల కోసం ఆగస్టు 7 మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రసారం అవుతుంది. అలాగే ఆగస్టు 8 అర్ధరాత్రి నుండి సాధారణ ప్రజల కోసం అమెజాన్ ఫ్రీడమ్ సేల్స్ ప్రారంభమవుతుంది. ప్రైమ్ చందాదారులతో సహా అమెజాన్ వినియోగదారులందరికీ ఈ సేల్స్ ఆగస్టు 11 తో ముగుస్తుంది.

అమెజాన్  ఫ్రీడమ్ సేల్స్ సమయంలో మొబైల్ ఫోన్ ఆఫర్లు:

అమెజాన్ ఫ్రీడమ్ సేల్స్ సమయంలో మొబైల్ ఫోన్ ఆఫర్లు:

శామ్‌సంగ్ గెలాక్సీ M30, గెలాక్సీ M20:

అమెజాన్ ఫ్రీడమ్ సేల్ సమయంలో శామ్‌సంగ్ గెలాక్సీ M30 మొబైల్ ఫోన్ కి 1,000 రూపాయల వరకు తగ్గింపు లభిస్తోంది. ఈ ఫోన్ యొక్క 4GB + 64GB మరియు 6GB + 128GB రెండు వేరియంట్లకు ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. శామ్సంగ్ గెలాక్సీM30 చౌకగా మారడం ఇది మొదటిసారి కాదు. వాస్తవానికి గత కొన్ని అమ్మకాలలో అమెజాన్ గెలాక్సీM30 పై 1,000 రూపాయల తగ్గింపు అందించింది. అదేవిధంగా శామ్‌సంగ్ గెలాక్సీ M20 పై కూడా 1,000 రూపాయల తగ్గింపు అందిస్తోంది.

హానర్ 20i, హానర్ 8X :
 

హానర్ 20i, హానర్ 8X :

రెండు నెలల కిందట ఇండియాలో లాంచ్ అయిన హానర్ 20i మొబైల్ ఫోన్ కు అమెజాన్ ఫ్రీడమ్ సేల్ సమయంలో 2,000 రూపాయల తగ్గింపుతో అందిస్తోంది. ఈ ఫోన్‌ యొక్క ప్రస్తుత ధర రూ.14,999 అయితే అమెజాన్ ఫ్రీడమ్ సేల్ సమయంలో దీని ధర 12,999 రూపాయలు. ఈ ఫోన్ ను కొనుగోలు చేయదలచిన వారు SBI క్రెడిట్ కార్డు ద్వారా డబ్బులు చెల్లించినచో బ్యాంకింగ్ డిస్కౌంట్ కూడా ఫోన్‌ను మరింత చౌకగా చేస్తుంది. హానర్ 8X యొక్క 4 జీబీ + 64 జీబీ మోడల్‌ ప్రస్తుత ధర రూ.14,999 కానీ అమెజాన్ ఫ్రీడమ్ అమ్మకం సమయంలో దీనిని 10,999 రూపాయలకు లభిస్తుంది. అలాగే ఈ ఫోన్ యొక్క 6GB + 128GB మోడల్‌ ప్రస్తుత ధర 18,999 రూపాయలు దీనిని రూ.16,999లకు లభిస్తుంది.

రెడ్‌మి Y3, రెడ్‌మి Y2:

రెడ్‌మి Y3, రెడ్‌మి Y2:

అమెజాన్ ఫ్రీడమ్ సేల్స్ లో భాగంగా రెడ్‌మి 7, రెడ్‌మి 6A, రెడ్‌మి 6 మొబైల్ ఫోన్లు కూడా డిస్కౌంట్లను పొందనుంది. రెడ్‌మి 7 యొక్క 3 జీబీ + 32 జీబీ వేరియంట్‌ సాధారణ ధర రూ. 8,999. ఈ అమ్మకం సమయంలో దీనిని 8,499 రూపాయలకు అందిస్తున్నారు. అదేవిధంగా రెడ్‌మి 6A యొక్క 2 జీబీ + 32 జీబీ వేరియంట్ సాధారణ ధర రూ.6,999, అమెజాన్ అమ్మకం సమయంలో రూ. 6,199 కు అందిస్తున్నారు. అలాగే రెడ్‌మి 6 మొబైల్ ఫోనెను కూడా అమెజాన్ అమ్మకం సమయంలో 1,000 రూపాయల తగ్గింపుతో 6,999 రూపాయలకు అందిస్తున్నారు.

నోకియా 6.1 ప్లస్, నోకియా 8.1:

నోకియా 6.1 ప్లస్, నోకియా 8.1:

అమెజాన్ ఫ్రీడమ్ సేల్స్ లో భాగంగా HMD గ్లోబల్‌కు చెందిన నోకియా 6.1 ప్లస్, నోకియా 8.1 కూడా డిస్కౌంట్లను పొందనున్నాయి. నోకియా 6.1 ప్లస్ యొక్క 6 జిబి + 64 జిబి వేరియంట్ రూ.10,999 లకు లభిస్తుంది. అమెజాన్ అమ్మకం సమయంలో దాని సాధారణ ధర రూ. 16.999 నుండి 6,000 రూపాయల తగ్గింపుతో లభించనుంది. మరోవైపు నోకియా 8.1 కూడా ఈ అమ్మకం సమయంలో ప్రస్తుతం ఉన్న ధర రూ. 19,999 కంటే తక్కువగా 19,499 రూపాయలకు లభిస్తుంది.

LG W10:

LG W10:

LG W10 అమెజాన్ ఫ్రీడమ్ సేల్ సమయంలో రూ.8,999 ఫోన్ లాంచ్ ధర కంటే 1000రూపాయల తగ్గింపుతో 7,999 రూపాయలకు లభిస్తుంది. LG W10 2019 జూన్ చివరలో భారతదేశంలో ప్రారంభించబడింది. అమెజాన్ అమ్మకం సమయంలో ఇతర LG W -సిరీస్ ఫోన్‌లకు తగ్గింపు లభించలేదు.

వన్‌ప్లస్ 7:

వన్‌ప్లస్ 7:

అమెజాన్ ఫ్రీడమ్ సేల్ సమయంలో వన్‌ప్లస్ 7 మొబైల్ మీద 3,000 రూపాయల అదనపు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ అందిస్తోంది. దీనితో పాటు కొనుగోలుదారులకు 12 నెలల వరకు ఎటువంటి ఖర్చు లేని No-Cost EMI లను ఎంచుకునే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఎస్బిఐ క్రెడిట్ కార్డ్ ఆఫర్ కూడా ఉంది.

ఎక్స్చేంజ్ ఆఫర్:

ఎక్స్చేంజ్ ఆఫర్:

వివో V15, ఒప్పోF11, శామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 9, వివోY12, శామ్‌సంగ్ గెలాక్సీ A50, ఒప్పో రెనో, శామ్‌సంగ్ గెలాక్సీ S10, శామ్‌సంగ్ గెలాక్సీ A80, ఒప్పో F11 ప్రో కూడా పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేయడంలో అదనపు తగ్గింపును పొందుతాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
amazon freedom sale 2019 mobile phone offers

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X