ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ దెబ్బకు విలవిలలాడుతున్న ఐఫోన్, బ్లాక్ బెర్రీ

Posted By: Super

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్  దెబ్బకు విలవిలలాడుతున్న ఐఫోన్, బ్లాక్ బెర్రీ

యునైటెడ్ స్టేట్స్‌‌లో ఓ ప్రయివేట్ రీసెర్చ్ సంస్ద స్మార్ట్ ఫోన్స్ గురించి సర్వే నిర్వహించడం జరిగింది. ఆ సర్వే ప్రకారం ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ ప్రస్తుతం మార్కెట్ షేర్‌‌ని 36శాతం డామినేట్ చేస్తున్నాయని తెలిసింది. సర్వేని నిర్వహించినటువంటి నీల్సన్ సంస్ద యునైటెడ్ స్టేట్స్‌లో ఐఫోన్స్, బ్లాక్ బెర్రీ మొబైల్ ఫోన్స్ కంటే కూడా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ మొట్టమొదటి స్దానంలో పాపులారిటీని సంపాదించాయని వెల్లడించారు. నీల్సన్ సంస్ద దాదాపు 65,000మంది స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నటువంటి యూజర్స్‌‌ని ఇంటర్వ్యూ చేయగా అందులో దాదాపు 36శాతం మంది యూజర్స్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ స్మార్ట్ ఫోన్స్‌‌ని వాడుతున్నట్లు తెలిసింది.

ఇక ప్రపంచంలో ఐకానిక్ డివైజ్‌గా పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్న ఐఫోన్ 26శాతంతో షేర్‌ని సంపాదించి రెండవ స్దానంలో నిలిచింది. ఇక రీసెర్ట్ ఇన్ మోషన్ తయారు చేసేటటువంటి బ్లాక్ బెర్రీ 23శాతంతో షేర్‌‌తో మూడవ స్దానంలో ఉంది. ఇది మాత్రమే కాకుండా నీల్సన్ సర్వే వారు గ్రహించింది మరోకటి ఉంది. అదేమిటంటే ఆండ్రాయిడ్ మొబైల్స్ వాడుతున్నటువంటి వారు ఎక్కువ డేటాని కూడా యాక్సెస్ చేస్తున్నారని సమాచారం. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ యూజర్స్ నెలకు యావరేజిగా 582 MB డేటాని సెర్చ్ చేస్తున్నారు. అదే ఐఫోన్ యూజర్స్ విషయానికి వస్తే కేవలం 492 MB మాత్రమే డేటాని సెర్చ్ చేస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది.

మార్చి 2011లో నీల్సన్ సర్వే ప్రకారం 31శాతం మంది యూజర్స్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్స్‌‌‌ని కొనుక్కోవడానికి మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. కేవలం 30శాతం మంది మాత్రమే ఐఫోన్‌‌‌ని కోనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కొత్తగా నిర్వహించినటువంటి సర్వేని బట్టి చూస్తుంటే ఎక్కువ శాతం మంది ఆండ్రాయిడ్ ఫోన్స్ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot