ఫ్లిప్‌కార్ట్‌లో రిపబ్లిక్ డే సేల్స్... ఈ స్మార్ట్‌ఫోన్‌ల మీద భారీగా తగ్గింపు ఆఫర్లు

|

2020 సంవత్సరంలో సంక్రాంతి మరియు రిపబ్లిక్ డే సందర్బంగా ఫ్లిప్‌కార్ట్‌ "రిపబ్లిక్ డే సేల్స్"ను ప్రకటించింది. ఈ సేల్స్ జనవరి 19 నుండి 22 వరకు ఉంటుంది. నాలుగు రోజులపాటు జరిగే ఈ సేల్స్ లో వివిధ రకాల స్మార్ట్ ఫోన్లను డిస్కౌంట్ ధరలతో అందిస్తున్నారు. ప్రముఖ యుఎస్ దిగ్గజం అమెజాన్ ఇప్పటికే అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్‌ను జనవరి 19 మరియు జనవరి 22 మధ్య జరుపుతున్నట్లు ప్రకటించింది.

స్మార్ట్ ఫోన్ ఆఫర్స్
 

స్మార్ట్ ఫోన్ ఆఫర్స్

ఫ్లిప్‌కార్ట్‌లో జరిగే రిపబ్లిక్ డే సేల్స్ లో రెడ్‌మి 8A, మోటరోలా వన్ యాక్షన్, రియల్‌మి 3, మోటరోలా వన్ విజన్, ఐఫోన్ 7, మరియు లెనోవాA 6 నోట్ వంటి స్మార్ట్ ఫోన్లను డిస్కౌంట్ల ధర వద్ద అందిస్తున్నది. అలాగే ఐఫోన్ XS ను కూడా డిస్కౌంట్ ధర వద్ద పొందవచ్చు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్‌కు పోటీగా ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ 2020 తో అమెజాన్‌ను ఎదుర్కోవాలని ఇ-కామర్స్ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్ లో "బ్లాక్ బస్టర్ డీల్స్", "రష్ అవర్స్ ", మరియు" ప్రైస్ క్రాష్ " వంటి వాటి ద్వారా కస్టమర్లను ఆకర్షించడానికి వివిధ ఉత్పత్తులపై డిస్కౌంట్లను ఇస్తున్నది.

గూగుల్ పేలో జరిగే మోసాన్ని ఎలా నివారించవచ్చు?

జనవరి 19 స్పెషల్ ఆఫర్స్

జనవరి 19 స్పెషల్ ఆఫర్స్

కొత్తగా రిలీజ్ అయిన హానర్ 9X స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ 19 న మొదలుకానున్నందున దీని అసలు ధర రూ.13,999 కంటే వేయి రూపాయలు తక్కువ ధరతో కేవలం రూ.12,999 లకే పొందవచ్చు. ఈ ఆఫర్ కేవలం జనవరి 19 మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ఫ్లిప్‌కార్ట్‌లో గొప్ప ఆఫర్లతో నోకియా 55-inch స్మార్ట్ టీవీ సేల్స్

బ్యాంక్ ఆఫర్స్

బ్యాంక్ ఆఫర్స్

ఫ్లిప్‌కార్ట్‌ యొక్క రిపబ్లిక్ డే సేల్స్ లో ఐసీఐసీఐ మరియు కోటక్ మహింద్రా బ్యాంక్ యొక్క క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల మీద ఏదైనా కొనుగోలు చేసిన వారికి 10శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్ కస్టమర్లకు ఈ సేల్స్ లో కొనుగోలు కోసం ముందస్తుగా జనవరి 18 8PM లకే యాక్సిస్ లభిస్తుంది. జనవరి 15-17 మధ్య ఎంచుకున్న ఉత్పత్తులపై ప్రీ-బుకింగ్‌లు ఉంటాయి. దీని కింద అమ్మకం సమయంలో జాబితా చేయబడిన ధరల కంటే తక్కువకు లభిస్తాయి.

RS.100 కన్నా తక్కువ ధరతో స్మార్ట్ ఛానల్ ప్యాక్‌లను అందిస్తున్న టాటా స్కై

ఎలక్ట్రానిక్స్ మరియు వాటి ఉపకరణాలపై ఆఫర్స్
 

ఎలక్ట్రానిక్స్ మరియు వాటి ఉపకరణాలపై ఆఫర్స్

ఫ్లిప్‌కార్ట్ సేల్స్ లో ఎలక్ట్రానిక్స్ మరియు వాటి ఉపకరణాలపై 80 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. వీటిలో స్మార్ట్‌వాచ్‌లపై 50 శాతం వరకు, హెడ్‌ఫోన్‌లు మరియు స్పీకర్లపై 70 శాతం వరకు తగ్గింపు, మరియు టీవీలు మరియు ఉపకరణాలపై 75 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. ఏసర్ స్విఫ్ట్ 3 ల్యాప్‌టాప్, ఆపిల్ వాచ్ సిరీస్ 3 మరియు ఆపిల్ ఎయిర్‌పాడ్‌లు ఈ అమ్మకాల సమయంలో ఆకర్షణీయమైన ధరలతో కొనుగోలు చేయవచ్చు. ఏసెర్, హెచ్‌పి, డెల్, లెనోవా వంటి సంస్థల ల్యాప్‌టాప్‌లు మరియు డెస్క్‌టాప్‌లపై 45 శాతం వరకు తగ్గింపు ఉంటుంది.

ఫ్యాషన్ ఉత్పత్తులు

ఫ్యాషన్ ఉత్పత్తులు

ఫ్యాషన్ విభాగంలోని ఉత్పత్తుల మీద సుమారు 50 నుంచి 80 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. ఇందులో ఫుట్ వేర్, బ్యాగ్స్, లగేజీ బ్యాగ్స్, సారీస్,ప్యాంట్స్ , కిడ్స్ వేర్, మెన్స్ వేర్, ఉమెన్స్ వేర్ వంటి ఉత్పతుల మీద తగ్గింపును పొందవచ్చు. ఈ ఫ్యాషన్ విభాగంలో 10 లక్షల రకాల స్టయిల్స్ మరియు 1000 రకాల బ్రాండ్స్ ఉంటాయి. కొన్నవి మీకు నచ్చకపోతే వీటిని 30 రోజులలో రిటర్న్ పంపే వెసులుబాటు కూడా ఉంది. బ్యూటీ మరియు టాయ్స్ ఉత్పత్తులను రూ.99 లకే కొనుగోలు చేయవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Flipkart Announced Republic Day Sales: Check Offers Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X