క్రెడిట్, డెబిట్ కార్డ్ చెల్లింపులను అనుమతిస్తున్న గూగుల్ పే

|

గూగుల్ పే యొక్క వినియోగదారులు పేమెంట్స్ చేయడానికి ఇప్పుడు గూగుల్ పే యాప్ కి డెబిట్ మరియు క్రెడిట్ కార్డులను జోడించడానికి అనుమతించబడతారు. ఇది గతంలో బ్యాంకు ఖాతాల నుండి యుపిఐ ఆధారిత చెల్లింపులను మాత్రమే అనుమతించింది.

గూగుల్ పే

డిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో గూగుల్ సంస్థ గూగుల్ పేలో డెబిట్ మరియు క్రెడిట్ కార్డుల కోసం టోకనైజేషన్ అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుందని వివరించింది. అంటే గూగుల్ పే యొక్క యాప్ లో డిజిటల్ టోకెన్‌ ద్వారా కార్డులను అతేంటికెట్ చేయవచ్చు. ఇలా డిజిటల్ ద్వారా అతేంటికెట్ చేసిన తరువాత మీ యొక్క డెబిట్ మరియు క్రెడిట్ కార్డులను విక్రేతకు లేదా వ్యాపారికి ఇవ్వకుండా కార్డులను యాక్సిస్ చేయడానికి ఈ కొత్త విధానం ఉపయోగపడుతుంది.

గూగుల్ పే

గూగుల్ పే యొక్క యాప్ లో కార్డులను డిజిటల్ టోకెన్ చేయడానికి కార్డ్ ఎంపికను కొన్ని వారాల వ్యవధిలో Google Pay లో విడుదల చేస్తారు అని గూగుల్ సంస్థ దృవీకరించింది. అయితే ఇది ప్రస్తుతం యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ మరియు ఎస్‌బిఐ నుండి వీసా కార్డులకు మాత్రమే మద్దతు ఇస్తుంది. ఇది మాస్టర్ కార్డ్ మరియు రుపే కార్డులకు కూడా మద్దతు త్వరలో ఇవ్వనున్నట్లు సమాచారం ఉంది.

ఆఫ్‌లైన్ స్పాట్స్ ప్లాట్‌ఫాం

ఆఫ్‌లైన్ స్పాట్స్ ప్లాట్‌ఫాం

గూగుల్ పే కోసం కంపెనీ కొత్త స్పాట్స్ ప్లాట్‌ఫామ్‌ను ప్రకటించింది. ఇది వ్యాపారులు మరియు సంస్థలకు ఆఫ్‌లైన్ చెల్లింపుల కోసం ఫీజికల్ క్యూఆర్-కోడ్ మరియు ఎన్‌ఎఫ్‌సి ఆధారిత పేమెంట్ కార్డులను సృష్టించడానికి అనుమతిస్తుంది. ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించి వ్యాపారులు గూగుల్ పే ద్వారా అనుకూలీకరించదగిన అనుభవాలను నిర్మించగలరు. ఇది రిటైల్ స్టోర్ దాని మొత్తం కేటలాగ్‌ను జోడించడానికి అనుమతిస్తుంది.

స్పాట్ కార్డు

ఇవి స్పాట్ కార్డులతో వస్తాయి కావున ఇది వినియోగదారులకు వ్యాపారులు సృష్టించే విబిన్న అనుభవానికి నేరుగా యాక్సిస్ ను పొందటానికి వీలు కల్పిస్తుంది. ఈ లక్షణాన్ని మేక్‌మైట్రిప్ మరియు గూగుల్ పే వంటి పెద్ద సంస్థలు ఉపయోగిస్తాయి. చిన్న వ్యాపారులు మూడవ పార్టీలకు వెళ్లకుండా "కోడ్" తో స్పాట్‌ను నిర్మించడానికి అనుమతించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. స్పాట్ ప్లాట్‌ఫామ్ కోసం గూగుల్ సంస్థ ఈట్.ఫిట్, మేక్‌మైట్రిప్, రెడ్‌బస్, అర్బన్ క్లాప్ వంటి ఇతర సంస్థలతో భాగస్వామ్యం కలిగి ఉంది.

గూగుల్ పే ఫర్ బిజినెస్

గూగుల్ పే ఫర్ బిజినెస్

గూగుల్ పే వ్యాపారాల కోసం 'గూగుల్ పే ఫర్ బిజినెస్' ను కూడా కంపెనీ ప్రకటించింది. ఇది వ్యాపారులు తమను తాము ధృవీకరించడానికి మరియు చెల్లింపుల కోసం Google Pay ని ఉపయోగించడానికి అనుమతించే యాప్. భారతదేశంలో మొత్తం మీద సుమారు 67 మిలియన్ల మంది గూగుల్ పే యూజర్లు ఉన్నారని గూగుల్ సంస్థ తెలిపింది.

Best Mobiles in India

English summary
Google Pay Will Allow Credit, Debit Card Payments in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X