ఇకపై ఐడియా రోమింగ్ ఉచితం

Written By:

ఐడియా కూడా భారతీ ఎయిర్‌టెల్‌ బాటలో నడుస్తోంది. దేశ వ్యాప్తంగా రోమింగ్ ఛార్జీలను ఎత్తి వేస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్‌ 1 నుంచి తన ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్‌ కస్టమర్లు దేశీయంగా రోమింగ్‌లో ఇన్‌కమింగ్‌ కాల్స్‌ను ఉచితంగా అందుకోవచ్చని ప్రకటించింది.

1000 జిబి డేటా, 10 జిబిపిఎస్ స్పీడ్, జియో సంచలనం

ఇకపై ఐడియా రోమింగ్ ఉచితం

ఈ సందర్భంగా అంతర్జాతీయ రోమింగ్‌కు సంబంధించి వేల్యూ ప్యాక్‌లను కూడా ప్రవేశపెట్టింది. దేశీయ రోమింగ్‌లో కాల్స్, ఎస్‌ఎంఎస్‌లపై చార్జీలను ఎత్తివేస్తూ భారతీ ఎయిర్‌టెల్‌ ప్రకటించిన నేపథ్యంలో పోటీగా ఐడియా కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.రోమింగ్‌లో అవుట్‌గోయింగ్‌ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లను సైతం తక్కువ చార్జీలకే అందిస్తున్నట్టు ఐడియా ప్రకటించింది.

ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా..? ఆ ఫీచర్స్ చాలా ముఖ్యం

ఇకపై ఐడియా రోమింగ్ ఉచితం

సొంత సర్కిల్‌లో అందుబాటులో ఉన్న డేటా ప్యాక్‌లను అదనపు చార్జీలు లేకుండా రోమింగ్‌లోనూ వాడుకోవచ్చని స్పష్టం చేసింది. అంతర్జాతీయ పర్యాటకులకు రోమింగ్‌ కోసం రూ.2,499, రూ.5,999 ప్యాక్‌లను ప్రకటించింది.

సరికొత్త ఫీచర్లతో ఆండ్రాయిడ్ 8.0

ఇకపై ఐడియా రోమింగ్ ఉచితం

400 అవుట్‌గోయింగ్‌ నిమిషాలు, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 3జీబీ డేటా, ఉచిత అపరిమిత కాల్స్‌ వీటిపై అందుకోవచ్చు. కాల వ్యవధి 30 రోజులు. 10 రోజుల వ్యాలిడిటీతో రూ.1,199 ప్యాక్‌ కూడా ఉంది.

 

 

English summary
Idea to Provide Free Roaming on Incoming Calls From April 1 read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot